PM Kisan Yojana : ఈ పని చేయకపోతే పీఎం కిసాన్ డబ్బులు రావు, వెంటనే ఇలా చేయండి

ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి ద్వారా కేంద్రం రైతులకు సంవత్సరానికి రూ.6,000 విడతల వారీగా ఇస్తుంది. 17 వ పొందాలంటే ఈ పని చేయాల్సిందే!

PM Kisan Yojana : దేశంలో చాలా మంది రైతులు ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నారు. చాలా మంది రైతులు అకాల వర్షాల కారణంగా పంట నష్టపోయారు. ఇలాంటి పరిస్థితుల్లో రైతులకు ఆర్థిక సాయం అందించేందుకు కేంద్ర ప్రభుత్వం అనేక పథకాలు చేపడుతోంది. దాంట్లో, ప్రధాన్ మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి (PM Kisan Samman Nidhi) యోజన ఒకటి.

అయితే, రైతులు ప్రస్తుతం 16 విడతలు లబ్ధి పొందారు. ప్రస్తుతం, దేశంలోని రైతులు 17వ విడత కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ పథకం నుండి ప్రయోజనం పొందాలంటే రైతులు తప్పనిసరిగా నమోదు చేసుకోవాలి.

ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి ద్వారా కేంద్రం రైతులకు సంవత్సరానికి రూ.6,000 విడతల వారీగా ఇస్తుంది. మూడు విడతలుగా రైతుల ఖాతాల్లోకి పంపిణీ చేస్తారు. ప్రతి విడత 2,000 చొప్పున రైతుల ఖాతాల్లోకి జమ చేస్తారు. సాధారణంగా, PM కిసాన్ సమ్మాన్ నిధి మొదటి విడత ఏప్రిల్ 1 నుండి జూలై 31 వరకు, రెండవ విడత ఆగస్టు 1 నుండి నవంబర్ 30 వరకు మరియు మూడవ విడత డిసెంబర్ 1 నుండి మార్చి 31 వరకు ఉంటుంది.

చాలా మంది రైతులు పీఎం కిసాన్ మొత్తాన్ని సకాలంలో అందుకోలేకపోతున్నారు. అలాంటి సందర్భాల్లో ఈసారి నిబంధనలు మారాయని రైతులు భావిస్తున్నారు. ఈ పరిస్థితిలో, ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి ప్రణాళికలో ప్రభుత్వం ఎటువంటి అధికారిక మార్పులు చేయలేదు.

 PM Kisan Yojana

ఈ పథకం నుండి లబ్ధి పొందాలంటే, రైతులు తప్పనిసరిగా తమ బ్యాంకు ఖాతాలను ఆధార్‌తో లింకు చేయాలి. అదేవిధంగా, KYCని పూర్తి చేయాలి. KYC పూర్తి చేయని రైతులకు రాబోయే విడత ఇక అందకపోవచ్చు.

PM కిసాన్‌కు ఈ పత్రాలు అవసరం.

ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన నుండి లబ్ధి పొందాలంటే, రైతులు తప్పనిసరిగా ఆధార్ కార్డు (Aadhaar card) మరియు బ్యాంకు ఖాతా కలిగి ఉండాలి. వీటితో పాటు,ఆధాయ ధృవీకరణ పత్రం, భూ-పత్రాలు, నివాస ధృవీకరణ పత్రం, పాస్‌పోర్ట్ సైజు ఫోటోను కలిగి ఉండాలి. ఈ పథకం నుండి ప్రయోజనం పొందాలంటే, రైతులు తప్పనిసరిగా e-KYC పూర్తి చేయాలి.

ఈ ప్రక్రియను పూర్తి చేయడానికి, PM కిసాన్ యోజన అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించండి. మరొక విషయం ఏమిటంటే రైతులు తమ భూ పత్రాలను ఎప్పటికప్పుడు సరిచూసుకోవాలి. వచ్చే విడత కోసం ఇంకా దరఖాస్తు చేసుకోకుంటే, వెంటనే చేయండి. ఒకవేళ దరఖాస్తు చేసుకొని ఉంటే దరఖాస్తుదారులు వారి ప్రస్తుత స్థితిని చెక్ చేసుకోండి.

PM కిసాన్ సమ్మాన్ నిధి యోజన పథకానికి వీరు అనర్హులు..

  • భార్యాభర్తలిద్దరూ ఈ ప్రయోజనాలను పొందలేరు.
  • రైతు కుటుంబంలో పన్నులు కట్టే వారెవరూ ఈ పథకం వల్ల ప్రయోజనం పొందరు.
  • భర్త లేదా భార్య గత సంవత్సరంలో ఆదాయపు పన్ను చెల్లించినా, వారు ఈ పథకానికి అనర్హులు.
  • ఒక రైతు మరొక రైతు నుండి భూమిని కౌలుకు తీసుకొని సాగు చేస్తే, వారు ఈ పథకానికి అనర్హులు.
  • పీఎం కిసాన్‌లో భూమి యాజమాన్యం ముఖ్యం.ఒక రైతు లేదా కుటుంబంలో రాజ్యాంగ పదవిలో ఉన్న ఎవరైనా ప్రయోజనం పొందరు.

PM Kisan Yojana

Comments are closed.