PM Kisan Yojana 15th Instalment: PM కిసాన్ యోజన 15వ విడతలో మీ ఖాతాలకు ఇంకా డబ్బు జమ కాలేదా? అయితే ఇప్పుడే పిర్యాదు చేయండి.

PM కిసాన్ యోజన యొక్క 15వ విడత నవంబర్ 15న విడుదలయిన విషయం తెలిసిందే. అర్హత కలిగిన రైతుల ఖాతాల్లో ఇంకా డబ్బు జమ కాకపోతే ఏం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.

Telugu Mirror : ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి (PM కిసాన్ యోజన) యొక్క 15వ చెల్లింపును ఇటీవల అనగా నవంబర్ 15న, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (Prime Minister Narendra Modi) విడుదల చేసిన సంగతి అందరికీ తెలిసిందే. దీని ఫలితంగా ఈ కార్యక్రమానికి అర్హులైన రైతులు వారి బ్యాంకు ఖాతాలకు రూ. 18,000 కోట్లకు పైగా ఆర్థిక బదిలీ చేసారు. ప్రతి సంవత్సరం 4 విడతల్లో రూ.2000 చొప్పున మూడు సమాన వాయిదాల్లో చెల్లింపులు జరిపారు. దాదాపు 8 కోట్ల మంది అర్హత కలిగిన రైతులు ఈ పథకం ద్వారా లబ్ది పొందుతున్నారు. కేంద్ర ప్రభుత్వం చిన్న మరియు సన్నకారు రైతులకు మాత్రమే పెట్టుబడి అందిస్తున్నట్లు తెలిపింది.

అయితే, పథకం ప్రయోజనాలను సద్వినియోగం చేసుకోవడానికి అవసరమైన e- kyc ప్రక్రియను పూర్తి చేయకపోవడం వంటి వివిధ కారణాల వల్ల కొంతమంది రైతులకు డబ్బు అందకపోయి ఉండవచ్చు. కొందరికి బ్యాంకు సమస్యలతో ఆలస్యం అయినా లేదా మరింకేమైనా కారణం చేత కొందరికి డబ్బులు జమ కాలేదు.

ప్రధానమంత్రి కిసాన్ యోజన అధికారిక వెబ్‌సైట్ pmkisan.gov.in లో తమ ఆధార్ లేదా బ్యాంక్ ఖాతా నంబర్‌ ( Bank Account Number ) ను నమోదు చేసి, ఇంకా డబ్బు అందని లబ్ధిదారుల జాబితాలో తమ పేరు ఉందో లేదో తనిఖీ చేయవచ్చు.

PM Kisan Yojana 15th installment not credited to your accounts yet? But complain now.
image credit: Vakil Search

Also Read:Home Loan Offers : పండుగ సమయాలలో SBI నుండి HDFC వరకు, అలాగే ఇతర ముఖ్య బ్యాంక్ లు అందించే గృహ రుణాలపై ప్రత్యేక ఆఫర్ లు పొందండి

లబ్ధిదారుల జాబితాలోని పేర్లను ఎలా తనిఖీ చేయాలో ఇప్పుడు చూద్దాం :

ప్రధానమంత్రి కిసాన్ యోజన అధికారిక వెబ్సైటు అయిన PMkisan.gov.in ను తప్పకుండా సందర్శించండి.
‘ఫార్మర్స్ కార్నర్’ (Farmer’s Corner) విభాగంలో, ‘బెనిఫిషియరీ స్టేటస్’ (Benificiary Status) అనే ఆప్షన్ ని క్లిక్ చేయండి.
రాష్ట్రం, జిల్లా, ఉప జిల్లా మరియు పంచాయితీ వంటి మీకు సంబంధించిన సమాచారాన్నిఅక్కడ నమోదు చేయండి.
ఆ తర్వాత మీ బ్యాంక్ ఖాతా లేదా మీ నమోదిత ఆధార్ కార్డ్ నంబర్‌ను నమోదు చేయండి.
ఇన్‌స్టాల్‌మెంట్ యొక్క ప్రస్తుత స్థితిని వీక్షించడానికి, “గెట్ డేటా” అనే బటన్‌పై క్లిక్ చేయండి.

పీఎం కిసాన్ యోజన (PM Kisan Yojana) కు అర్హత ఉన్న రైతు తన బ్యాంకు ఖాతాలో ప్రోగ్రామ్ నుండి డబ్బు పొందకపోతే, ఆ రైతు పీఎం కిసాన్ యోజన హెల్ప్‌డెస్క్‌లో ఫిర్యాదు చేసే అవకాశం ఉంది.
ఫిర్యాదు చేయడానికి టోల్ ఫ్రీ నంబర్ 18001155266 లేదా టెలిఫోన్ నంబర్లు 011-24300606 మరియు 155261కి కాల్ చేయవచ్చు. అదనంగా, రైతులు pmkisan-ict@gov.in మరియు pmkisan-funds@gov.in చిరునామాలకు ఇమెయిల్ పంపడం ద్వారా ఫిర్యాదును ఫైల్ చేస్తారు.

Comments are closed.