Full Details Of pm kisan12000 Rupees : పీఎం కిసాన్ సాయం 12వేలకు పెంపు పై కేంద్రం ప్రకటన

పెంపుదల ఉన్నదా? లేదా? అసలు నిజం కేంద్ర వ్యవసాయ మంత్రి చెప్పారా ?

pm kisan12000 Rupees : కేంద్రంలోని మోడీ ప్రభుత్వం 2019లో ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి (పీఎం-కిసాన్)ని పథకాన్ని తీసుకొచ్చింది. ఈ పథకం ద్వారా రైతులకు ఆర్థిక సాయం అందిస్తున్నారు. రైతులకు తక్కువ భూమి ఉన్నా ఎక్కువ భూమి అన్నా తారతమ్యం లేకుండా అందరికీ ఒకే పెట్టుబడి సాయం చేస్తున్నది. ప్రతిఏడాది రైతులకు 6వేల రూపాయలు ఇస్తున్నారు. ఈ సాయాన్ని కూడా ప్రతి 4నెలలకు ఒక్కసారి 3 విడుతలుగా 2వేల రూపాయల చొప్పున రైతుల అకౌంట్లలో జమ చేస్తున్నారు. 2019 నుంచి ఇప్పటి వరకు 11కోట్ల మంది రైతులకు 15 విడతలుగా సుమారు 2.81లక్షల కోట్ల రూపాయలను చెల్లించారు.

త్వరలో జరగబోయే లోక్ సభ (Loksabha) ఎన్నికల్లో మెజార్టీ సీట్లు సాధించాలనే ఆలోచనలో ఉన్న బీజేపీ. పీఎం కిసాన్ సాయంను పెంపుదల చేస్తుందని ప్రచారం జరిగింది. ఇప్పుడు ఇస్తున్న 6వేల రూపాయలను 12వేల రూపాయలకు పెంచబోతున్నట్టు వార్తలొచ్చాయి. ఆ డబ్బులను నాలుగు విడుతలుగా 3వేల రూపాయల చొప్పున రైతుల అకౌంట్ లో వేయనున్నారని సోషల్ మీడియాలో ప్రచారం జోరందుకున్నది.

 

 

Center's announcement on increasing PM Kisan aid to 12 thousand

Also Read: Free current In Telangana : 06-02-2024 ఇకపై విద్యుత్ ఉచితమే, ఈ పని చేయండి

pm kisan12000 Rupees

అయితే ప్రస్తుతం జరుగుతున్న లోక్ సభ సమావేశాల్లో పీఎం కిసాన్ సాయం పెంపుదల చేస్తున్నారా? ఎంత సాయం పెంచుతున్నారని? లోక్ సభ సభ్యులు అడిగిని ప్రశ్నకు కేంద్ర వ్యవసాయ మంత్రి అర్జున్ ముండా లిఖిత పూర్వక సమాధానం ఇచ్చారు. పీఎం-కిసాన్ పథకం సాయాన్ని 6వేల రూపాయల నుంచి 12వేలకు పెంచే ప్రతిపాదన లేదని తేల్చిచెప్పారు. అలాగే, ఈ పథకం కింద మహిళా రైతులకు కూడా పెంచే ప్రతిపాదన ఏదీ పరిశీలనలో లేదని అన్నారు.

ఇది ఇలా ఉండగా ఈ ఏడాది ఫిబ్రవరిలో లోక్ సభ ఎన్నికలకు నోటిఫికేషన్ వచ్చే ఛాన్స్ ఉన్నది. మార్చి లేదా ఏప్రిల్ లో ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ సరికొత్త హామీలు ఇచ్చేందుకు సిద్ధం అయితున్నది. ఆ హామీల్లో భాగంగా పీఎం కిసాన్ సాయాన్ని పెంచుతామని ప్రకటన చేసే ఛాన్స్ ఉన్నది. ఈ మేరకు కాంగ్రెస్ అగ్రనాయకత్వం ఎన్నికల మేనిఫెస్టోను తయారు చేస్తున్నది. రైతులకు అందించే పీఎం కిసాన్ సాయం, రైతురుణమాఫీలకు సబంధించి కీలక హామీ ఇచ్చే చాన్స్ ఉన్నది..

Comments are closed.