PMFBY Excellent Scheme 2024 : పంట నష్టంతో రైతుల ఆవేదన.. ఫసల్ భీమా యోజనతో రైతులకు రూ.2 లక్షలు సాయం

ప్రధాన మంత్రి మోడీ ఫసల్ బీమా యోజన (PM FBY) అనే పథకం ద్వారా రైతులకు నష్ట పరిహారం అందుతుంది.

PMFBY Excellent Scheme 2024 : భారతదేశంలో ఏ కాలం వచ్చిన కూడా పంటలకు నష్టం వస్తూనే ఉంది. ప్రస్తుతం మన దేశంలో వేసవి కాలం నడుస్తుండడంతో రోజురోజుకూ ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. నీరు ఎండిపోతుండడంతో పలు ప్రాంతాల్లో పంటలు ఎండిపోయాయి. అధిక గాలులు మరియు అకాల వర్షాల కారణంగా కొన్ని ప్రాంతాలలో పంటలు కూడా దెబ్బతిన్నాయి.

ఇప్పటికే అప్పులతో సతమతమవుతున్న రైతులకు ఇది మరింత కోతను మిగిలిస్తుంది. పంటల బీమా ద్వారా పంట నష్టపోయిన రైతులకు పరిహారం అందుతుంది. ప్రధాన మంత్రి మోడీ ఫసల్ బీమా యోజన (PM FBY) అనే పథకం ద్వారా రైతులకు నష్ట పరిహారం అందుతుంది. దీని గురించిన పూర్తి సమాచారం ఇప్పుడు మనం చూద్దాం.

రైతులకు భరోసాగా ఉండేందుకు కిసాన్ ఫసల్ బీమా యోజన.

2016లో కిసాన్ ఫసల్ బీమా యోజన పేరుతో పంటల బీమా పాలసీని ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించారు. ఈ పథకం రైతులకు అనేక కొత్త ప్రయోజనాలను అందిస్తుంది.భారీ వర్షాలు, వడగళ్ల వానలు, తుపానులు వంటి ప్రకృతి వైపరీత్యాల వల్ల పంట నష్టపోయినప్పుడు రైతులు ఈ పథకం ద్వారా పరిహారం పొందుతారు.

మరి ఈ పథకం యొక్క ప్రత్యేకతలు ఏమిటి?

ప్రధాన్ మంత్రి ఫసల్ బీమా యోజన (PMFBY) ప్రణాళికలో, ఈ పరిస్థితులన్నీ స్థానిక విపత్తులుగా పరిగణించి పరిహారం అనేది నిర్ణయిస్తారు. కోత కోసిన తర్వాత వర్షాలు లేక ఇతర ప్రకృతి వైపరీత్యాల కారణంగా14 రోజుల్లో నష్టపోయినా రైతులకు పరిహారం అందజేస్తారు. ఈ పథకం యొక్క ప్రయోజనాలలో తక్కువ ప్రీమియం, సులభమైన దరఖాస్తు ప్రక్రియ మరియు త్వరిత పరిహార చెల్లింపులు ఉన్నాయి.

 PMFBY Excellent Scheme 2024

పంట నష్టం జరిగితే ఏం చేయాలి?

పంట బీమా నుండి ప్రయోజనం పొందేందుకు, పంట నష్టం జరిగిన 72 గంటలలోపు బీమా కంపెనీకి లేదా సమీపంలోని వ్యవసాయ కార్యాలయానికి తెలియజేయండి. అప్పుడే బ్యాంకు, బీమా కంపెనీ, వ్యవసాయ కార్యాలయం నష్టాన్ని కచ్చితంగా అంచనా వేస్తారు. ఆ తర్వాత పరిహారం చెల్లింపు ప్రక్రియ ప్రారంభమవుతుంది.

నష్టాన్ని సర్వే చేయడానికి బీమా కంపెనీ లేదా వ్యవసాయ కార్యాలయం నుండి ఒక బృందం పొలాన్ని సందర్శిస్తుంది. పరిహారం దరఖాస్తు ఫారమ్‌ను పూరించి అవసరమైన అన్ని డాక్యుమెంటేషన్‌లను సబ్మిట్ చేయాలి. బీమా కంపెనీ దరఖాస్తును సమీక్షించి నష్ట పరిహారం అందజేస్తుంది. పరిహారం అందించే ప్రక్రియకు కొంత సమయం పట్టవచ్చు.

వారికి మాత్రమే ఈ పథకం వర్తిస్తుంది.

పొలంలో పంట నష్టం కనీసం 33% ఉంటేనే పరిహారం కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. పంట బీమా గురించి అదనపు సమాచారం కోసం, బ్యాంకును సంప్రదించండి.లేదా, సమీపంలోని వ్యవసాయ శాఖ కార్యాలయం నుండి సమాచారాన్ని పొందవచ్చు. ఆన్‌లైన్‌లో సమాచారం కోరుకునే వారు PMFBYఅధికారిక https://pmfby.gov.in/ వెబ్‌సైట్‌ను సందర్శించవచ్చు.

PMFBY Excellent Scheme 2024

Comments are closed.