Voter Registration 2024 ,Useful Information : ఓటు ఇంకా నమోదు చేసుకోలేదా? ఈరోజే లాస్ట్ ఛాన్స్.

సార్వత్రిక ఎన్నికల్లో మీ ఓటు హక్కును వినియోగించుకోవాలి అంటే ముందుగా ఓటరు జాబితాలో పేరు ఉందా..? లేదా? అని చూసుకోవాలి. ఓటు లేకుంటే ఇంకా ఓటు నమోదు చేసుకునే అవకాశం ఉంది.

Voter Registration 2024 : రానున్న సార్వత్రిక ఎన్నికల్లో మీ ఓటు హక్కును వినియోగించుకోవాలి అంటే ముందుగా ఓటరు జాబితాలో పేరు ఉందా..? లేదా? అని చూసుకోవాలి. ఓటు లేకుంటే ఇంకా ఓటు నమోదు చేసుకునే అవకాశం ఉంది. ఈ నెల 15 వరకు ఓటరుగా (Voter) నమోదు చేసుకునేందుకు ఎన్నికల సంఘం అవకాశం కల్పిస్తోంది. తాత్కాలికంగా దరఖాస్తు చేసుకున్న ప్రతి ఒక్కరికీ ఓటు వేసే అవకాశం ఉంటుంది. ఆ గడువు ముగిసిన తర్వాత నమోదు చేసుకున్న వారు రానున్న సార్వత్రిక ఎన్నికల్లో ఓటు వేయలేరు.

జిల్లాల్లో ఎన్నికల అధికారులు ఓటర్ల నమోదు కార్యక్రమంలో పాల్గొంటున్నారు. వీలైనంత ఎక్కువ మందికి ఓటు హక్కు కల్పించేందుకు ఎన్నికల అధికారులు పని చేస్తున్నారు. అందుకనుగుణంగా అవగాహన కార్యక్రమాలను సిద్ధం చేస్తున్నారు. గడువులోగా సమర్పించిన దరఖాస్తులను పరిశీలించి, అదనపు ఓటర్ల జాబితాలో చేర్చుతామని ఎన్నికల అధికారులు పేర్కొన్నారు.

ఇంట్లో ఉండే నమోదు చేసుకోవచ్చు.

ఓటరుగా నమోదు చేసుకోవడానికి ఏ కార్యాలయాన్ని సందర్శించాల్సిన అవసరం లేదు. ఓటర్లు ఇంట్లోనే నమోదు చేసుకోవచ్చు. మీ కంప్యూటర్, ల్యాప్‌టాప్ లేదా సెల్ ఫోన్‌ని ఉపయోగించి సెకన్లలో మీ పేరు నమోదు చేసుకోని ఓటు వేయవచ్చు. సంబంధిత సమాచారాన్ని సమర్పిస్తే సరిపోతుంది. ఓటు హక్కు పొందడానికి, పూర్తి వివరాలు, ఫోటోగ్రాఫ్, పుట్టిన తేదీని అవసరమైన డాకుమెంట్స్ (Documents), చిరునామా మరియు ఆ చిరునామాలో అడ్రస్ డాక్యుమెంట్ అవసరం. అధికారుల ప్రకారం, మార్చి 31, 2006 కంటే ముందు జన్మించిన ఎవరైనా కొత్త విధానంలో ఓటు వేయడానికి అర్హులు. అధికారులు తెలిపిన వివరాల ప్రకారం ఓటు హక్కును పునరుద్ధరించుకోవాలంటే ఫారం 6ను తప్పనిసరిగా పూర్తి చేయాలి.

Voter Registration 2024

అధికారిక వెబ్‌సైట్ ద్వారా ఓటరు నమోదు ప్రక్రియ.

ఎన్నికల కమిషన్ అధికారిక వెబ్‌సైట్ ద్వారా మాత్రమే ఓటరు నమోదును పూర్తి చేయవచ్చు. అదే సమయంలో, ఓటర్లు  యాహెల్ప్ లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. మీ మొబైల్ లేదా PCలో https://voters.eci.gov.inని నమోదు చేయండి. లాగిన్ మరియు నమోదు చేసుకోడానికి వెబ్‌పేజీ యొక్క టాప్ లెఫ్ట్ కార్నర్ లో, రెండు ఆప్షన్ లు ఉంటాయి.

మీకు ఇప్పటికే ఖాతా లేకుంటే, సైన్ అప్ ఆప్షన్ ను (Sign up option) క్లిక్ చేయండి. ఖాతాను క్రియేట్ చేసిన తర్వాత లాగిన్ చేయాలి. దీంతో ఓటరు నమోదు ప్రక్రియ పూర్తవుతుంది. మీ మొబైల్ నంబర్ లేదా ఇమెయిల్ చిరునామా, పాస్‌వర్డ్ మరియు క్యాప్సాను నమోదు చేసిన తర్వాత OTP జనరేట్ అవుతుంది. దాన్ని నమోదు చేస్తే వెబ్‌పేజీ వస్తుంది. దరఖాస్తును పూర్తి చేయడానికి ఫారం 6పై క్లిక్ చేయండి. వివరాలను పూర్తి చేయడానికి, పాస్‌పోర్ట్ సైజ్ ఫోటో, పుట్టిన తేదీకి సంబంధించిన రుజువు మరియు చిరునామా రుజువు డిజిటల్‌గా ఇవ్వాలి.

దరఖాస్తులో అడిగిన సమాచారాన్ని అందించి కంటిన్యూ బటన్ ను క్లిక్ చేస్తే సరిపోతుంది. మళ్లీ వెరిఫై చేసి సబ్ మిట్ చేస్తే అప్లికేషన్ రిజిస్టర్ అయి… వెంటనే రిఫరెన్స్ నంబర్ వస్తుంది. మీ ఖాతాలోకి లాగిన్ అయిన తర్వాత, మీ ఓటరు నమోదు స్థితి గురించి మీకు తెలియజేయడానికి ట్రాక్ అప్లికేషన్ టాప్ లో చూపిస్తారు. మీరు దానిపై క్లిక్ చేసినప్పుడు, మీరు అప్లికేషన్ ఎక్కడ ఉందో చూడగలరు. కాగా, అర్హులైన ఓటర్ల అనుబంధ జాబితాను ఈ నెల 25న కేంద్ర ఎన్నికల సంఘం విడుదల చేయనుంది.

Voter Registration 2024

Comments are closed.