క్రెడిట్ కార్డ్‌ల వ్యాపారంపై ముఖేష్ అంబానీ గురి, త్వరలోనే రానున్న రిలయన్స్ ఎస్‌బీఐ కార్డ్స్

దేశీయ రూపే నెట్‌వర్క్‌లో రెండు క్రెడిట్ కార్డ్‌లను ప్రారంభించేందుకు రిలయన్స్ భారతదేశంలోని అతిపెద్ద బ్యాంకుల్లో ఒకటైన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(SBI)తో చేతులు కలిపింది. 'రిలయన్స్ SBI కార్డ్‌' పేరుతో ఇవి త్వరలోనే ప్రజలకు అందుబాటులోకి రానున్నాయని తెలుస్తోంది

Telugu Mirror : ప్రపంచం లో ప్రతి వ్యాపారంలోకి ప్రస్తుతం రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ ప్రవేశిస్తున్నారు. ఆసియాలో సంపన్నుడిగా కొనసాగుతున్న అంబానీ ఆన్‌లైన్ రిటైల్, ఫైనాన్షియల్ రంగాల్లో తన కంపెనీ వ్యాపార ప్రయోజనాలను విస్తరించడంలో బిజీగా ఉన్నారు. ఈ క్రమంలోనే భారతదేశపు రూ.1.33 లక్షల కోట్ల క్రెడిట్ కార్డు వ్యాపారంలోకి అడుగుపెడుతున్నారు. దీనిలో భాగంగా కో-బ్రాండెడ్ క్రెడిట్ కార్డ్‌లను (co-branded credit cards) ప్రారంభించేందుకు రిలయన్స్ గ్రూప్ పెద్ద అడుగు వేస్తోంది.

Also Read : Indira Gandhi : భారత దేశ ఉక్కు మహిళ మాజీ ప్రధాని స్వర్గీయ ఇందిరా గాంధీ వర్ధంతి నేడు. ఆమె స్మరణలో..

దేశీయ రూపే నెట్‌వర్క్‌లో రెండు క్రెడిట్ కార్డ్‌లను (Credit cards) ప్రారంభించేందుకు రిలయన్స్ భారతదేశంలోని అతిపెద్ద బ్యాంకుల్లో ఒకటైన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(SBI)తో చేతులు కలిపింది. ‘రిలయన్స్ SBI కార్డ్‌’ పేరుతో ఇవి త్వరలోనే ప్రజలకు అందుబాటులోకి రానున్నాయని తెలుస్తోంది. ఇవి రిలయన్స్ కస్టమర్లకు ప్రత్యేకమైన ప్రయోజనాలను  అందిస్తాయి. వీటిలో రిలయన్స్ రిటైల్ కోసం వోచర్‌లు, అలాగే రిలయన్స్ గ్రూప్‌లోని JioMart, Ajio, అర్బన్ లాడర్, ట్రెండ్స్‌పై డిస్కౌంట్స్ అందుబాటులోకి రానున్నాయి. ప్రస్తుతం దేశంలో వెస్ట్రన్ క్రెడిట్ కార్డ్ వినియోగం వేగంగా విస్తరిస్తోంది. గత ఏడాది దేశంలో డెబిట్ కార్డు ట్రాన్సాక్షన్లు రూ.53,000 కోట్ల వరకు జరగగా, క్రెడిట్ కార్డు చెల్లింపులు ఏకంగా రూ.1,33,000 కోట్లుగా నమోదయ్యాయి. దీంతో ఇంతపెద్ద క్రెడిట్ కార్డ్ మార్కెట్‌లోకి అడుగుపెట్టాలని రిలయన్స్ అధినేత నిర్ణయించారు.

reliance-has-joined-hands-with-one-of-indias-largest-banks-state-bank-of-india-sbi-to-launch-two-credit-cards-on-the-domestic-rupay-network

ఈక్రమంలోనే Jio ఫైనాన్షియల్ సర్వీసెస్ కూడా డెబిట్ కార్డ్ ఆఫర్లతో ముందుకు రావాలని ప్లాన్ చేస్తోంది. రిలయన్స్ వారు రెండు కార్డ్‌లను ప్రారంభించారు , రిలయన్స్ ఎస్‌బీఐ కార్డ్ ప్రైమ్ మరియు రిలయన్స్ ఎస్‌బీఐ కార్డ్. రిలయన్స్ ఎస్‌బీఐ కార్డ్ ప్రైమ్ వార్షిక పునరుద్ధరణ రుసుము రూ. 2,999 మరియు రిలయన్స్ ఎస్‌బీఐ కార్డ్ యొక్క రుసుము రూ. 499 గా ఉంది. రిలయన్స్ ఎస్‌బీఐ కార్డ్ ప్రైమ్‌లో రూ. 3,00,000 మరియు రిలయన్స్ ఎస్‌బీఐ కార్డ్‌పై రూ. 1,00,000 వార్షిక ఖర్చు మైలురాయిని సాధించడం ద్వారా కార్డ్ హోల్డర్‌లు పునరుద్ధరణ రుసుములో  మినహాయింపును పొందవచ్చు.

Also Read :నిరుపేదలకు శుభవార్త, ప్రధాన మంత్రి ఆవాస్ యోజన గడువు పొడిగింపు, వెంటనే దరఖాస్తు చేసుకోండి

ఎస్‌బీఐ కార్డ్ MD & CEO అభిజిత్ చక్రవర్తి మాట్లాడుతూ, భారతదేశం యొక్క గొప్ప వ్యవస్థీకృత రిటైల్‌ను రూపొందించిన రిలయన్స్ గ్రూప్స్ తో  భాగస్వామ్యం కావడం పట్ల కంపెనీ ఆనందంగా ఉందని అన్నారు.

Comments are closed.