Samantha : ఆలోచనలు లేకుండా ఉండటం అసాధ్యం అంటున్న సమంత..

Telugu Mirror : సమంత(Sam) ఈ పేరు వినని తెలుగు వారు ఉండరు. సినీ ప్రేక్షకులకు ఐతే చెప్పే పనే లేదు.ఏమాయ చేసావే తో తెలుగు సినిమా ప్రేక్షకులకు దగ్గరై, ఎంతో మంది సినీ ప్రేక్షకులకు అభిమాన నటిగా మారింది.టాప్ హీరియిన్ గా చలామణి అవుతున్న సమంత(Sam) ఇటీవల ఎక్కువగా వార్తల్లో నిలుస్తుంది. కొంత కాలం సినిమాలకు విరామం ఇస్తున్నట్లు తెలిపిన సామ్..వైద్యం కోసం అతి త్వరలో విదేశాలకు వెళ్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. సమంత గతంలో మయో సైటిస్(Myositis) వ్యాధికి గురి అయిన విషయం తెలిసిందే.

Diabetes-Control : షుగర్ ఉన్నవారు ఇవి తింటే షుగర్ లెవెల్స్ కంట్రోల్ అవ్వడం ఖాయం!

ఆమె అప్పట్లో చికిత్స కూడా తీసుకుంది. చికిత్స అనంతరం విజయ్ దేవరకొండ ప్రక్కన ఖుషీ సినిమాలో,సిటాడెల్ వెబ్ సిరీస్(Web Series) లో వరుణ్ ధావన్ సరసన నటించింది.అయితే ఇటీవలనే ఈ రెండు ప్రాజెక్టులకు సంబంధించిన షూటింగ్ లను పూర్తి చేసిన సమంత తన ఆరోగ్యాన్ని కాపాడుకోవడం కోసం పూర్తిగా దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది.ఈ కారణం చేతనే సినిమాలకు బ్రేక్ ఇచ్చి త్వరలోనే అమెరికా వెళుతున్నట్లు సినీ వర్గాల సమాచారం.

అయితే అమెరికా వెళ్ళటానికంటే ముందే సమంత ఆధ్యాత్మిక చింతనలో మునిగి పోయింది.తమిళనాడు లోని గోల్డెన్ టెంపుల్(Golden Temple) ని ఇటీవల దర్శించుకుని,ప్రత్యేక పూజలు చేసిన ఫోటోలను కూడా సోషల్ మీడియా(Social Media) ద్వారా అభిమానులతో పంచుకుంది. వైద్యం కోసం విదేశాలకు వెళుతున్నందున మనో ధైర్యం కోసం ఆలయాలను సందర్శిస్తుందని కొంతమంది కామెంట్ చేస్తున్నారు.

Quick MakeUp: క్విక్ మేకప్ కి లేడీస్ బ్యాగులో ఉండవలసిన ప్రొడక్ట్స్

ఇదిలావుండగా తాజాగా సమంత భక్తి చింతనలో తేలిపోయింది.ఇషా ఫౌండేషన్ (Isha Foundation)వ్యవస్థాపకుడు,ప్రముఖ యోగా గురువు సద్గురు ఆధ్వర్యంలో జరిగిన యోగా కార్యక్రమానికి సమంత హాజరు అయ్యారు. తమిళనాడు లోని కోయంబత్తూర్(Coimbatore) లో నిర్వహించిన యోగా శిబిరంలో సమంత ఒక మామూలు భక్తురాలిగా వచ్చారు.ఈ ప్రోగ్రాం లోని ఫోటోలను ఆమె ఇన్ స్టా అకౌంట్ లో పంచుకుంది. ఆ ఫోటోలు సోషల్ మీడియా లో వైరల్ గా మారాయి.

 

View this post on Instagram

 

A post shared by Samantha (@samantharuthprabhuoffl)


ఇన్ స్టాగ్రామ్ లో ఆమె “ఎలాంటి ఆలోచనలు,మెలికలు తిరగకుండా నిశ్చలంగా కూర్చోవడం దాదాపు అసాధ్యమని పించింది.” అంటూ రాసుకొచ్చింది.అలాగే ఈ రోజు ధ్యానం(Meditation) అంటే ‘ప్రశాంతత,శక్తి,స్పష్టత వీటన్నింటికి శక్తివంతమైన కేంద్రమని తెలిసింది అని.ఇంత తేలికగా ఉన్న ధ్యానం.. ఎంతో పవర్ ఫుల్ గా ఉంటుందని అనుకోరు’ అని తన ఇన్ స్టాగ్రామ్(Instagram) లో రాసుకొచ్చింది అభిమానులు ముద్దుగా పిలుచుకునే ‘సామ్’ అనే స్టార్ హీరోయిన్ సమంత.

Leave A Reply

Your email address will not be published.