Free current In Telangana : 06-02-2024 ఇకపై విద్యుత్ ఉచితమే, ఈ పని చేయండి

8వ తారీఖున అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఆ సమావేశాల్లో ఈ రెండు బిల్లును పెట్టి ఆమోదించబోతున్నది రేవంత్ రెడ్డి సర్కారు. 10వ తారీఖున బడ్జెట్ పెట్టబోతున్నారు.

free current in telangana: మొన్నటి మంత్రి వర్గ సమావేశంలో 500 రూపాయలకు గ్యాస్, 200 యూనిట్లలోపు విద్యుత్ వినియోగదారులకు ఉచిత విద్యుత్ (Free Electricity) ఇవ్వాలని కేబినెట్ ఆమోదించిన విషయం తెలిసిందే. 8వ తారీఖున అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఆ సమావేశాల్లో ఈ రెండు బిల్లును పెట్టి ఆమోదించబోతున్నది రేవంత్ రెడ్డి సర్కారు. 10వ తారీఖున బడ్జెట్ పెట్టబోతున్నారు. ఈ బడ్జెట్ లో కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలకు సైతం బడ్జెట్ కేటాయించబోతున్నారు.

తాజాగా అమలైతున్నవాటికి మరియు మంత్రివర్గంలో ఆమోదం పొందిన 500లకు గ్యాస్, 200యూనిట్ల లోపు విద్యుత్ వినియోగదారులకు ఉచిత్ విద్యుత్ కోసం కేటాయింపులు జరగనున్నాయి. అయితే 200లోపు యూనిట్ వినియోగదారులకు అలెర్ట్ అంటూ ఒక ప్రకటన తెగవైరల్ అయితున్నది. ఆ ప్రకటన సారాంశం ఏంటంటే. ప్రభుత్వం ఉచిత విద్యుత్ ఇవ్వనున్న నేపథ్యంలో ఆ పథకానికి అర్హులం కావాలంటే రేషన్ కార్డు, ఆధార్ కార్డు విద్యుత్ సిబ్బందికి ఇవ్వాలని ఆ ప్రకటనలో పేర్కొన్నారు.

అంతేకాకుండా మీటర్ రీడింగ్ తీయటానికి సిబ్బంది వస్తున్నారని, వారికి ఆధార్ కార్డు, రేషన్ కార్డు లు ఇవ్వాలని ఆ ప్రకటనలో తెలిపారు. మొబైల్ నెంబర్ కూడా ఇవ్వాలని, ఈ అవకాశం ఈనెల 15వరకే అని పేర్కొన్నారు. ఈ ప్రకటనకు సబంధించిన సమాచారం సోషల్ మీడియాలో వైరల్ అయితున్నది. దీంతో విద్యుత్ వినియోగదారులు ఆదార్ కార్డు (Aadhar Card) , రేషన్ కార్డు (Ration Card)ల జిరాక్స్ లను తెచ్చుకొని దగ్గర పెట్టుకుంటున్నారు.

 

free current in telangana
image credit : Informal Newz

Documents For Free Current in telangana:

200 యూనిట్ల లోపు విద్యుత్ వినియోగించే వారికి ఉచితంగా విద్యుత్ ఇస్తామని ఎన్నికల్లో ప్రకటించిన కాంగ్రెస్, మొన్నటి మంత్రి వర్గ సమావేశంలో ఆ హామీని ఆమోదించింది. వెంటనే పథకాన్ని అమల్లోకి తీసుకొచ్చింది ప్రభుత్వం. ఈ ప్రక్రియను విద్యత్ శాఖ ప్రారంభించింది. ఈ మేరకు విద్యుత్ సిబ్బంది రీడింగ్ తీసే క్రమంలో వినియోగదారుల ఆధార్ కార్డు, రేషన్ కార్డు, మొబైల్ నంబర్ అడుగుతున్నారు. ఆ వివరాలను కరెంట్ మీటర్ నంబర్ కు అనుసంధానం చేస్తున్నారు. అద్దె ఇంట్లో ఉంటున్న వారికి సైతం ఉచిత విద్యుత్ ఇస్తున్నారు. అయితే రేషన్ కార్డు లేని వారికి మాత్రం ఉచిత కరెంట్ పథకం ఇప్పటికైతే అమలు కాదని తేల్చి చెప్తున్నారు. దీంతో రేషన్ కార్డులేని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తమకు కూడా ఈ పథకాన్ని అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నారు.

Comments are closed.