New Ration Card : రేషన్ కార్డులపై ప్రభుత్వం కీలక నిర్ణయం. కొత్త రేషన్ కార్డుల జారీ ఎప్పుడు తెలుసా?

అర్హులైన వారు ప్రభుత్వ పథకాలు పొందాలంటే రేషన్ కార్డు తప్పనిసరి చేయడం వల్ల చాలా మంది రేషన్ కార్డుల కోసం దరఖాస్తు చేసుకున్నారు.

New Ration Card : కొత్త రేషన్ కార్డు కోసం ఎదురుచూస్తున్న వారికి కీలకమైన అప్డేట్ వచ్చింది. కొత్త కార్డుల కోసం ఇప్పటికే చాలా మంది దరఖాస్తు చేసుకున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో కొత్త రేషన్ కార్డుల (New Ration Card) కోసం దరఖాస్తులు వచ్చాయి. అయితే వీటిని ఇంకా జారీ చేయలేదు. ఈ క్రమంలో కొత్త రేషన్‌కార్డుల సమస్య తెరపైకి వచ్చింది. కొత్త రేషన్‌కార్డులు ఎప్పటి నుంచి ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. మరి కొత్త రేషన్ కార్డులు ఎప్పుడు వస్తాయో తెలుసుకుందాం.
అర్హులైన వారు  ప్రభుత్వ పథకాలు పొందాలంటే రేషన్ కార్డు తప్పనిసరి చేయడం వల్ల చాలా మంది రేషన్ కార్డుల కోసం దరఖాస్తు చేసుకున్నారు. ఉచిత విద్యుత్ మరియు రూ.500కే గ్యాస్ సిలిండర్ (Gas Cylinder) వంటి కార్యక్రమాలకు రేషన్ కార్డ్ తప్పనిసరి చేశారు. మిగిలిన అన్ని పథకాలకు రేషన్ కార్డు తప్పనిసరి అని ప్రభుత్వం ఇప్పటికే చెప్పింది.  చాలా మందికి రేషన్ కార్డులు అవసరం కాబట్టి రేషన్ కార్డులపై ప్రభత్వం నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది.
అర్హులు కాని వారు అక్రమంగా ప్రభుత్వ పథకాలను వినియోగించుకోవడం చట్ట విరుద్ధం. దీనిపై స్పందించిన ప్రభుత్వం ఆహార శాఖ ద్వారా అలాంటి వారి జాబితాను రూపొందిస్తూ, పథకానికి అనర్హులుగా ప్రకటిస్తోంది. నకిలీ రేషన్ కార్డులను తొలగించే లక్ష్యంతో ప్రభుత్వం రేషన్ ఈ-కేవైసీ (E-KYC) ప్రక్రియను తప్పనిసరి చేసింది.  రేషన్ హోల్డర్లు (Ration Holders) ప్రతి ఒక్కరు రేషన్ దుకాణాలకు వెళ్లి తమ బయోమెట్రిక్ (Biometric) ను వేయాలి.
New Ration Card
Image Credit : News 18
అయితే, లబ్దిదారుల్లో ఇప్పటివరకు 76 శాతానికి ఈ-కేవైసీ (E-KYC) ప్రక్రియ పూర్తి చేశారు. మిగిలిన వారు కూడా పూర్తి చేయాలనీ ప్రభుత్వం తెలిపింది. ఇంతక ముందు ఈ-కేవైసీ ప్రక్రియ పూర్తి చేయడానికి గడువు పెట్టలేదు కానీ ఇప్పడు తొందరగా ఈ పక్రియ పూర్తి చేసే దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తుంది.
రేషన్ కార్డుల్లో ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఉండేందుకు సాఫీగా రేషన్ కార్డులు సప్లై చేసేందుకు ప్రభుత్వం ఈ-కేవైసీ ప్రక్రియను ప్రారంభించింది. నకిలీ రేషన్ కార్డులను వెలికితీయడం కూడా ఇందులో ఒక భాగమే. ఈ-కెవైసీ ప్రక్రియ పూర్తి   కాగానే రేషన్ కార్డులు జారీ చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది.
వీలైనంత త్వరగా ఈ-కేవైసీ పూర్తి చేయాలి లేదంటే పేరు తొలిగించే అవకాశం ఉంటుంది.   బయోమెట్రిక్ వేసి రేషన్ కార్డును ఆధార్ నెంబర్ (Aadhaar Number) తో లింక్ చేయాల్సి ఉంటుంది. ఎవరైతే ఈ-కేవైసీ పూర్తి చేస్తారో వారి పేరు ఈపీఓఎస్ లో గ్రీన్ కలర్ లో కనిపిస్తుంటే లేదంటే రెడ్ కలర్ లో కనిపిస్తుంది.

New Ration Card

Comments are closed.