Raithu Barosa 10 Days: పది రోజుల్లో రైతు భరోసా నిధులు విడుదల, ఇదిగో వివరాలు ఇవే!

రైతులకు రైతు భరోసా ఆర్థిక సాయం ఇప్పటికే అందజేస్తున్నారు. ఎకరం లోపు భూమి ఉన్న వారికి డబ్బులు కేటాయించగా మిగిలినవారికి కూడా అందజేయనున్నారు.

Raithu Barosa 10 Days తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక 100 రోజులు పూర్తి అయ్యేలోగా ఇచ్చిన ఆరు హామీలను పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. అదే రీతిలో కాంగ్రెస్ ప్రభుత్వం అడుగులు వేస్తుంది. ఇటీవలే జరిగిన కేబినెట్ మీటింగ్ లో రేవంత్ రెడ్డి పలు విషయాల గురించి కీలక నిర్ణయాలు తీసుకున్నారని మనకి తెలుసు. అయితే, రైతు భరోసాపై ఒక కొత్త  అప్‌డేట్ అయితే వచ్చింది. కాంగ్రెస్ పథకం అధికారంలోకి వచ్చిన తర్వాత రైతు బంధుని రైతు భరోసాగా మార్చారు, కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత హామీ ఇచ్చిన పథకాలన్నింటినీ అమలు చేయడం ప్రారంభించింది. గత ప్రభుత్వ రైతుబంధు పథకం ద్వారా లబ్ధి పొందిన వారు కూడా రైతు భరోసా పథకానికి అర్హులుగా ఉంటారు.

ఎకరం లోపు భూమి ఉన్న వారికి డబ్బులు కేటాయించారు

అయితే రైతులకు రైతు భరోసా ఆర్థిక సాయం ఇప్పటికే అందజేస్తున్నారు. ఎకరం లోపు భూమి ఉన్న వారికి డబ్బులు కేటాయించగా మిగిలినవారికి కూడా అందజేయనున్నారు. 5 ఎకరాల వరకు భూమి ఉన్న రైతులకు రైతు భరోసా పథకం వర్తిస్తుంది. మూడు, నాలుగు ఎకరాలు ఉన్న రైతులకు నిధులు జమ చేసేందుకు అధికారులు శ్రీకారం చుట్టగా, ఐదెకరాల వరకు ఉన్న రైతులకు కూడా త్వరలో ఆర్థిక సాయం అందజేస్తామని మంత్రి పొంగులేటి ఇటీవల ప్రకటించారు.

పది రోజుల్లోగా రైతు భరోసా నిధలు విడుదల

రైతుల ఆందోళనలను విన్న సీఎం రేవంత్‌రెడ్డి రైతు భరోసాను పది రోజుల్లోగా విడుదల చేయాలని అధికారులను ఆదేశించారు. లోక్‌సభ ఎన్నికల కోడ్ అమల్లోకి రాకముందే ఆర్థిక సాయం విడుదలను పూర్తి చేయాల్సిన అవసరం ఉందని సీఎం చెప్పారు. తక్షణమే డబ్బు పంపిణీకి దాదాపు 3500 కోట్లు అవసరమని, వీటిని విడుదల చేస్తామని ముఖ్యమంత్రి హామీ ఇచ్చారు.

చాలా మంది రైతులు ఇప్పటికే హామీ మొత్తాన్ని అందుకున్నందున, 5 ఎకరాల కంటే తక్కువ ఉన్నవారికి మాత్రమే రైతు భరోసాకి అర్హులు. త్వరలోనే వారికి నిధులు జమ చేస్తామన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో ఐదెకరాల లోపు భూమి ఉన్న రైతులు 62.34 లక్షలు, ఒకటి నుంచి రెండు ఎకరాలు ఉన్న రైతులు 16.98 లక్షల మంది ఉన్నారు.

సార్వత్రిక ఎన్నికలు ముగిసే వరకు రైతు భరోసా నిధులను పంపిణీ చేయడం లేదని వార్తలు రాగా, ఎన్నికల కోడ్ రాకముందే నిధులు మంజూరు చేస్తామని మంత్రి పొంగులేటి రైతులకు తెలిపారు. సార్వత్రిక ఎన్నికల కోడ్ ప్రారంభం కావడానికి ముందు, అర్హులైన లబ్ధిదారులు రైతు భరోసా డబ్బును త్వరగా అందుకోవాలని ఎదురుచూస్తున్నారు.

Raithu Barosa 10 Days

 

 

 

Comments are closed.