చంద్రుని పైకి జపాన్ ప్రయోగించిన SLIM విజయవంతం

చివరి నిమిషాలలో వాయిదా పడుతూ వస్తున్న జపాన్ అంతరిక్ష నౌక ప్రయోగం ఎట్టకేలకు ఈ రోజు విజయవంతంగా ప్రయోగించబడింది. చంద్రుని ఉపరితలం పై ముఖ్యంగా చంద్రుని మూలాలను, ఆలివిన్ శిలల కూర్పు గురించి పరిశోధనలు సాగించడమే దీని లక్ష్యం.

Telugu Mirror : వచ్చే సంవత్సరం ఆరంభంలో చంద్రుని మీద అడుగుపెట్టిన ఐదవ దేశంగా నిలబడాలనే కాంక్షతో జపాన్ తన స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన H-IIA రాకెట్ లో తన చంద్ర అన్వేషణ అంతరిక్ష నౌకను గురువారం విజయవంతంగా ప్రారంభించింది. జపాన్ ఏరోస్పేస్ ఎక్స్ ఫ్లోరేషన్ ఏజెన్సీ (JAXA ) సౌత్ జపాన్ లోని తనేగాషిమా స్పేస్ సెంటర్ నుండి షెడ్యూల్ ప్రకారం రాకెట్ ప్రారంభించబడిందని మరియు స్మార్ట్ ల్యాండర్ ఫర్ ఇన్వెస్టిగేటింగ్ మూన్ (SLIM) ని విజయవంతంగా విడుదల చేసింది. వాతావరణ పరిస్థితులు అనుకూలించని కారణంగా పోయిన నెలలో వారంలో మూడుసార్లు ఈ ప్రయోగం వాయిదా పడింది.

“మూన్ స్నిపర్” గా పిలిచే జపాన్ చంద్రుని లూనార్ సర్ఫేస్ పై తను లక్ష్యంగా అనుకున్న ప్రదేశానికి 100 మీటర్ల దూరంలో SLIM ని దింపాలని ధ్యేయంగా పెట్టుకుంది. $100 మిలియన్ల మిషన్ సుదీర్ఘమై, ఇంధన – సమర్థవంతమైన విధానం తర్వాత ఫిబ్రవరిలో ల్యాండింగ్ ప్రారంభించే అవకాశం ఉంది.JAXA ప్రెసిడెంట్ హిరోషి యమకావ ఒక వార్తా సమావేశంలో మాట్లాడుతూ SLIM యొక్క అతి పెద్ద లక్ష్యం ఖచ్చితమైన ల్యాండింగ్ చేయడం మనం దింపగలిగిన చోట దింపడం కంటే చంద్రుని ఉపరితలం మీద మనకు కావాల్సిన చోట ల్యాండ్ అవ్వడం అని పేర్కొన్నారు. గురువారం ప్రారంభించిన కొన్ని గంటల తర్వాత SLIM నుండి అది అసాధారణంగా పనిచేస్తుందని తెలిపే సంకేతాలను అందించిందని JAXA తెలిపింది.

Image Credit : Yahoo news

Chandhrayaan 3: విజయవంతంగా జాబిల్లిని ముద్దాడిన ‘ల్యాండర్ విక్రమ్’, నింగికెక్కిన భారత్

చంద్రుని సౌత్ పోల్ పై చంద్రయాన్ 3 ప్రయోగంతో చంద్రునిపై అంతరిక్ష నౌకను విజయవంతంగా ల్యాండ్ చేసిన నాలుగో దేశంగా భారత అవతరించిన రెండు వారాల తర్వాత జపాన్ ఈ ప్రయోగాన్ని జరిపింది అయితే అదే సమయంలో రష్యా కు చెందిన లూనా- 25 ల్యాండర్ చంద్రుని సమీపంలో కూలిపోయింది. గత సంవత్సరంలో జపాన్ చేసిన రెండు ప్రయోగాలు విఫలమైనాయి.జపాన్ ప్రయోగించిన SLIM భూమి నుండి చూస్తే చీకటి ప్రదేశంగా ఉండే చంద్రుని సముద్రం అయిన మారే నెక్టారిస్ కు సమీపంలో చంద్రునికి దగ్గరగా ఉన్న వైపున టచ్ చేయడానికి సిద్ధంగా ఉంది.

సురక్షితంగా ల్యాండ్ అయిన తర్వాత అంతరిక్ష నౌక చంద్రుని యొక్క మూలాల గురించి పరిశోధించే ప్రదేశాలకు సమీపంలో ఉన్న అలివిన్ శిలల కూర్పు గురించి పరిశోధనలను చేయడమే లక్ష్యంగా పెట్టుకుంది. అయితే SLIM లో లూనార్ రోవర్ ని అమర్చలేదు.గురువారం నాడు జపాన్ ప్రారంభించిన H-IIA రాకెట్ లో X- రే ఇమేజింగ్ మరియు స్పెక్ట్రోస్కోపీ మిషన్ (XRISM) ఉపగ్రహాన్ని కూడా పంపించినారు. ఇది JAXA,NASA మరియు యూరోపియన్ స్పేస్ ఏజెన్సీలు కలసి చేపట్టిన ప్రాజెక్ట్.

 

Leave A Reply

Your email address will not be published.