అంబానీ కంటే అధిక ధనవంతుడు ఈ టీచర్

బిలియనీర్ ఉపాధ్యాయుడిగా మారి విద్యార్థులకు పాఠాలు నేర్పిస్తున్నాడు. ఒకప్పుడు ఆసియాలోనే అత్యంత ధనవంతుడు

Telugu Mirror: భారతదేశంలో ప్రతి సంవత్సరం సెప్టెంబర్ 5వ తారీఖున ఉపాధ్యాయ దినోత్సవంగా జరుపుకుంటారు. దేశ రెండవ రాష్ట్రపతి డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ (Doctor Sarvepalli Radhakrishna) జయంతిని పురస్కరించుకుని, ఉపాధ్యాయులు అందించిన సేవలను గౌరవించడానికి, గురువుల ఔన్నత్యాన్ని చాటిచెప్పడానికి ఉపాధ్యాయ దినోత్సవాన్ని జరుపకుంటారు ఉపాధ్యాయులు దేశంలోనే అత్యుత్తమంగా ఉండాలని డాక్టర్ రాధాకృష్ణన్ అభిలషించేవారు. అయితే ఒకప్పుడు ఆసియా లోని ధనవంతుల జాబితాలో అత్యంత ధనికుడిగా ఆధిపత్యం చెలాయించిన వ్యక్తి నేడు గౌరవ ప్రదమైన యూనివర్సిటీ అధ్యాపకుడిగా మారి పాఠాలతో పాటు తన అనుభవాలను యువతకు పంచుతున్నారు. ఆసియా కుబేరుడు ముఖేష్ అంబానీ కంటే ధనవంతుడు ఒకప్పుడు ఈ ప్రొఫెసర్.

ముఖేశ్ అంబానీ కంటే శ్రీమంతుడు ఈ టీచర్

ముకేశ్ అంబానీ ఆసియాలోనే అత్యంత ధనవంతుడు. ప్రస్తుతం అంబానీ రూ.8,15,515 కోట్లకు పైగా స్థిరమైన సంపద కలిగి ఉన్నాడు. అయితే ఇప్పుడు మనం చర్చిస్తున్న ఉపాధ్యాయుడు ఒకప్పుడు ముఖేష్ అంబానీ (Mukesh Ambani) మరియు గౌతమ్ అదానీ (Gowtham Adhani) కంటే ఆస్తిపరుడు. జపాన్ లోని టోక్యో విశ్వవిద్యాలయంలో ప్రొఫెసర్ గా పనిచేస్తున్న జాక్ మా (Jack Ma) సామాజిక సేవకుడు మరియు చైనీస్ వ్యాపారవేత్త. జాక్ మా ఒకప్పుడు భారతీయ సంపన్నుడు, బిలియనీర్ ముఖేశ్ అంబానీ కన్నా ధనవంతుడు. 2020లో జాక్ మా నికర ఆస్తుల విలువ ముఖేష్ అంబానీ కంటే రూ.18 వేల కోట్లు ఎక్కువ.

This teacher is richer than Ambani
image credit: CNBC

ఉపాధ్యాయుడు గా మారిన బిలియనీర్

జాక్ మా కొన్ని నెలల క్రిందట టోక్యో యూనివర్సిటీ (Tokyo University) లో విజిటింగ్ ప్రొఫెసర్‌ (Visiting Professor) గా జాయిన్ అయ్యారు. టోక్యో యూనివర్సిటీలో జాక్ మా చెప్పిన మొదటి స్పీచ్ యొక్క ఫోటోలు సామాజిక మాధ్యమాలలో వైరల్ అయ్యాయి.  బిలియనీర్ ప్రొఫెసర్ విద్యార్థులకు నిర్వహణ సామర్థ్యం గురించి బోధించాడు.  యూనివర్శిటీ ఆఫ్ టోక్యో లోనే కాకుండా జాక్ మా హాంకాంగ్ విశ్వవిద్యాలయంలో హానర్ బిజినెస్ ప్రొఫెసర్‌గా కూడా పనిచేశారు. రెండు సంవత్సరాల క్రితం జనాల చూపు నుండి దూరమైన జాక్ మా తిరిగి టీచర్‌గా మారాడు.

జాక్ మా చైనా లోని అత్యంత సంపన్నులలో ఒకరిగా నిలిచేందుకు తన ప్రయాణానికి ముందర హాంగ్‌జౌ డియాంజీ విశ్వవిద్యాలయంలో ఆంగ్ల ప్రొఫెసర్ గా ఉన్నారు. జాక్ మా అనేక వెంచర్ లలో విఫలమైన తరువాత  ప్రపంచంలోనే అతిపెద్ద ఇ-కామర్స్ కంపెనీలలో ఒకటైన అలీబాబాను స్థాపించాడు.

జాక్ మా నికర సంపద విలువ

ఫోర్బ్స్ పత్రిక ప్రకారం, జాక్ మా నికర ఆస్తుల విలువ ప్రస్తుతం $25.8 బిలియన్లు. 2019లో జాక్ మా అలీబాబా నుండి తొలగి పోయాడు. జాక్ మా ఫౌండేషన్ స్థాపించి బోర్డులో ఉన్నాడు. కొన్ని నెలల తరువాత చైనాకు తిరిగి వచ్చిన జాక్ మా 1.8m మెరైన్ టెక్నాలజీ అనే నూతన వ్యవసాయ సాంకేతిక సంస్థలో పెట్టుబడి పెట్టాడు.

Leave A Reply

Your email address will not be published.