Pakistan : వైరల్ అవుతున్న పాకిస్థానీ స్లాప్ కబడ్డీ..

Telugu Mirror : ప్రాచీన కాలంగా అందరికీ తెలిసిన క్రీడ కబడ్డీ. గ్రామాలలో అప్పటికీ ఇప్పటికీ ప్రసిద్ది చెందిన ఆటలలో ప్రథమంగా ఉండే ఆట కబడ్డీ మాత్రమే. చిన్నా పెద్దా తేడా లేకుండా ఆస్వాదించే ఆటగా కబడ్డీని పేర్కొనవచ్చు.ఇప్పటికీ గ్రామాలలో పండుగలకు మరియు ఇతర ప్రత్యేక సందర్భాలలో కబడ్డీ పోటీలను నిర్వహిస్తుంటారు. అంతగా ఆదరణ కలిగిన క్రీడ కబడ్డీ. కొన్ని ప్రాంతాలలో దీనినే చెడుగుడు అని కూడా అంటారు. అయితే చెడుగుడు ఆటకు కబడ్డీ కి నిభంధనలలో కొంత తేడాలను కలిగి ఉంటాయి.

ఇరువైపుల ఏడుగురు ఆటగాళ్లతో కూడిన జట్టు ఆడే క్రీడ కబడ్డీ. ఇది భారత ఉపఖండంలో ప్రముఖ ఆటగా చెలామణి అవుతుంది. భారత దేశంతో పాటు , బంగ్లాదేశ్,పాకిస్తాన్ ల,నేపాల్ ,జపాన్, శ్రీలంక ,మలేషియా, థాయిలాండ్ ,ఇరాన్, కెనడా ,యునైటెడ్ కింగ్ డమ్, చైనా ,ఇటలీ ,టోబాగో, ఆస్ట్రేలియా మరియు ఇంకా కొన్ని ఇతర దేశాలలో కూడా కబడ్డీ బాగా ప్రాచుర్యం పొందింది.ఇదిలా ఉండగా కబడ్డీ ఆట పాకిస్తాన్ లో చాలా ప్రత్యేక మైనది.పాకిస్తానీలు కబడ్డీ ఆట పట్ల చాలా విచిత్ర మైన పద్దతిని కలిగి ఉన్నారు.

Telugu Panchangam: మిర్రర్ తెలుగు న్యూస్ ఈరోజు 06 జూలై 2023 తిథి, పంచాంగం.

కబడ్డీ ఆట యొక్క పాకిస్తాన్ విధానాన్ని “తప్పడ్ కబడ్డీ ” లేదా స్లాప్ కబడ్డీ అని పిలుస్తారు. ఈ స్లాప్ కబడ్డీ అనే పద్దతిలో జట్టు గా ఆడే విధానం ఉండదు.ఒకరితో ఒకరు ముఖాముఖి ఆడుకునే ఆట, క్రీడా కారులు తమ ప్రత్యర్ధిని ఆటలో భాగంగా కనికరం లేకుండా కొట్టుకుంటారు.హాజీ తస్సావూర్ అనే పాకిస్తాన్ కబడ్డీ క్రీడాకారుడు బీబీసీ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో స్లాప్ కబడ్డీ యొక్క నియమాలను వివరించాడు. గేమ్ ఇద్దరి ఆటగాళ్ళ మధ్యన జరుగుతుంది అని, ఒక ఆట గాడు ప్రత్యర్ధి ఆట గాడిని కొట్టడం ద్వారా పాయింట్ లను పొందుతుంటే, ప్రత్యర్ధి ఆటగాడిని నిలువరించడం ద్వారా అతని పాయింట్ లను తగ్గిస్తుంటాడు.

ఇక్కడ ఆటలో చెంపదెబ్బల సంఖ్య సమస్య కాదని చెపుతూనే ఒక ఆటగాడు ఎదుటి ఆటగాడిని ఎన్ని సార్లు చెంప దెబ్బ కొత్తగలడో కూడా తెలిపాడు.బీబీసీతో తస్సావూర్ ఇంకా స్లాప్ కబడ్డీ గురించి మాట్లాడుతూ,”ఇక్కడి పరిసర ప్రాంత ప్రజలు సాంప్రదాయకమైన ఆట కబడ్డీని చెంపదెబ్బ కొట్టి ఆడితే చూడటానికి ఇష్టపడతారని,వారంతా ఆటను చూస్తూ ఆనందంతో, ఉత్సాహంగా చప్పట్లు కొట్టి సరదాగా ఆటను ఆస్వాదిస్తారని తెలిపాడు.

Delhi Metro : అందరి చూపూ ఢిల్లీ మెట్రో వైపు..యువకుడిని చెంపదెబ్బ కొట్టిన మహిళ..

అయితే @WonderW97800751 అనే ట్విట్టర్ వినియోగదారుడు ఈ స్లాప్ కబడ్డీ యొక్క వీడియోని ట్విట్టర్ లో షేర్ చేశాడు. ఇందులో ఇద్దరు ఆటగాళ్ళు ఒకరిని మరొకరు చెంపదెబ్బలు కొట్టుకోవడం కనిపిస్తుంది.అలాగే ఆటను చూస్తున్న ప్రజలు ఆటగాళ్లను ఉత్సాహ పరుస్తున్నారు. ట్విట్టర్ లో షేర్ అయిన కొద్దిసేపటికే ఈ వీడియో వైరల్ గా మారింది. దీనితో నెటిజన్ లు వివిధ రకాలుగా స్పందించారు. ఇప్పటి వరకు ఈ వీడియోని 220k మంది నెటిజన్ లు చూశారు.అలాగే సుమారు 1258 మంది ఈ వీడియోని ఇష్ట పడ్డారు.

Leave A Reply

Your email address will not be published.