DC vs RR, IPL 2024 : సంజూ శాంసన్ పోరాటం వృథా.. ఢిల్లీ ప్లే ఆఫ్ ఆశలు సజీవం.

ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో భాగంగా రాజస్థాన్ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్ లో ఢిల్లీ క్యాపిటల్స్ ఘన విజయం సాధించింది.

RR vs DC : రాజస్థాన్ రాయల్స్ పై ఢిల్లీ క్యాపిటల్స్ 20 పరుగుల తేడాతో గెలిచింది. ఢిల్లీ క్యాపిటల్స్ (DC), రాజస్థాన్ రాయల్స్ (RR) మధ్య జరిగిన మ్యాచ్ చివరి ఓవర్ వరకు ఉత్కంఠభరితంగా సాగింది. ప్లేఆఫ్ ఆకాంక్షలను సజీవంగా ఉంచుకోవాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో ఢిల్లీ రాజస్థాన్‌పై పంజా విసిరింది. తొలుత అద్భుత స్కోరు చేసిన ఢిల్లీ ఆ భారీ లక్ష్యాన్ని కాపాడుకుంది. ఈ సీజన్‌లో ఐపీఎల్‌లో వరుస విజయాలు సాధించిన రాజస్థాన్ ఈ మ్యాచ్ లో చివరి వరకు పోరాడినప్పటికీ ఓటమి తప్పలేదు.

టీ20 ప్రపంచకప్‌కు ముందు సంజూ శాంసన్ అద్భుత ఇన్నింగ్స్‌తో ఫామ్‌లోకి రావడం టీమిండియా అభిమానులను ఆనందపరిచింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఢిల్లీ మెక్‌గర్క్, అభిషేక్ పోరెల్ నిర్ణీత 20 ఓవర్లలో ఎనిమిది వికెట్లకు 221 పరుగులు చేశారు. 222 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన రాజస్థాన్ 201 పరుగులు మాత్రమే చేయగలిగింది. కెప్టెన్ సంజూ శాంసన్ 86 పరుగులతో ఒంటరి పోరాటం చేయగా, మిగిలిన రాజస్థాన్ బ్యాట్స్‌మెన్ చేతులెత్తేశారు.

మెక్‌గర్క్ మళ్లీ మెరిశాడు.

ఈ మ్యాచ్‌లో రాజస్థాన్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. మొదట బ్యాటింగ్ కి దిగిన ఢిల్లీకి ఓపెనర్లు జేక్ ఫ్రేజర్, అభిషేక్ పోరెల్ శుభారంభం అందించారు. అవేశ్ ఖాన్ వేసిన నాలుగో ఓవర్‌లో మెక్‌గుర్క్ నాలుగు ఫోర్లు మరియు రెండు సిక్సర్లు సాధించి, 19 బంతుల్లో అర్ధ సెంచరీని పూర్తి చేశాడు.

DC vs RR, IPL 2024

వెంటనే, అశ్విన్ వేసిన బౌలింగ్ లో ఫెరీరాకు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. తర్వాత వచ్చిన షై హోప్ ఒక్క పరుగుకే రనౌట్ కావడంతో ఢిల్లీ స్కోరు తొమ్మిదో ఓవర్లకు వంద పరుగులకు చేరుకుంది. అశ్విన్ బౌలింగ్‌లో అక్షర్ 15 పరుగుల వద్ద ఔటయ్యాడు. అశ్విన్ వేసిన తొమ్మిదో ఓవర్లో అక్షర్ భారీ షాట్‌కు ప్రయత్నించి పరాగ్ చేతికి చిక్కాడు.

అవేశ్ ఖాన్ వేసిన 11వ ఓవర్‌లో పోరెల్ హాఫ్ సెంచరీతో అదరగొట్టాడు. తర్వాత పోరల్ 65 పరుగుల వద్ద అవుట్ కాగా, 14వ ఓవర్లో పంత్ 15 పరుగులు మాత్రమే చేసి పెవిలియన్ చేరుకున్నాడు. చివరి ఓవర్‌లో స్టబ్స్ వరుసగా రెండు సిక్సర్లు బాదాడు. దీంతో ఢిల్లీ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 221 పరుగులు చేసింది.

పోరెల్ 65 పరుగులు, జేక్ ఫ్రేజర్ 50, స్టబ్స్ 41 పరుగులు చేశారు. తన తొలి మ్యాచ్ ఆడుతున్న గుల్బాదిన్ నైబ్ కూడా 15 బంతుల్లో ఒక ఫోర్, ఒక సిక్స్ సహా 19 పరుగులు చేశాడు. రాజస్థాన్ బౌలర్లలో అశ్విన్ మూడు వికెట్లు పడగొట్టగా, బౌల్ట్, సందీప్ తలా ఒక వికెట్ తీసుకున్నారు.

సంజూ శాంసన్ అద్భుతమైన ఇన్నింగ్స్ :

222 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన రాజస్థాన్ 201 పరుగులకే ఆలౌటైంది.కెప్టెన్ సంజూ శాంసన్ ఒంటరి పోరాటం చేశాడు. 46 బంతుల్లో ఎనిమిది ఫోర్లు, ఆరు సిక్సర్లతో 86 పరుగులు చేసిన సంజూ రాజస్థాన్ ను ఒక దశలో విజయానికి చేరుస్తాడు అనుకున్నారు. ర్యాన్ పరాగ్ 27 పరుగులు చేయగా, దూబే 25 పరుగులు చేశాడు. మిగతా బ్యాటర్‌లు అందరూ చేతులెత్తేశారు. రాజస్థాన్ 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 201 పరుగులు చేసింది. ఢిల్లీ బౌలర్లలో ఖలీల్ అహ్మద్, ముఖేష్ కుమార్ చెరో రెండు వికెట్లు తీశారు.

RR vs DC

Comments are closed.