Virat Kohli Record: విరాట్ కోహ్లీ సరికొత్త రికార్డ్..తొలి భారత ప్లేయర్‌గా రన్ మెషీన్..

T20 ఫార్మాట్‌లో 12000 పరుగులు చేసిన మొదటి భారతీయ ఆటగాడిగా విరాట్‌ కోహ్లి నిలిచాడు.

Virat Kohli Record : IPL 2024 మొదటి మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ మరియు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్లు పాల్గొన్నాయి. ఈ మ్యాచ్‌లో బెంగళూరు జట్టు టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. కెప్టెన్ ఫాఫ్ డుప్లెసిస్ తో క‌లిసి స్టార్ ప్లేయ‌ర్ విరాట్ కోహ్లీ ఆర్సీబీ (RCB) ఇన్నింగ్స్ ను ప్రారంభించాడు. ఈ మ్యాచ్ లో విరాట్ కోహ్లీ (Virat Kohli )పెద్ద ఇన్నింగ్స్ ఆడ‌లేక‌పోయాడు. 21 ప‌రుగులు చేసి ఔట్ అయ్యాడు.

కానీ ఈ మ్యాచ్ లో టీమిండియా బ్యాటర్‌ విరాట్‌ కోహ్లి మరో రికార్డు సృష్టించాడు. గతంలో అంతర్జాతీయ క్రికెట్‌లో వరుస రికార్డులు నెలకొల్పిన కింగ్ కోహ్లీ రెండు నెలల తర్వాత మళ్లీ T20 ఫార్మాట్‌ లో మరో మైలురాయిని అందుకున్నాడు. IPL 2024 ప్రారంభ మ్యాచ్‌తో, అతను T20 ఫార్మాట్‌లో 12000 పరుగులు చేసిన మొదటి భారతీయ ఆటగాడిగా నిలిచాడు.

Also Read : Two Free Cylinders 2024: హోలీ సందర్భంగా రెండు ఉచిత సిలిండర్లు, వారికి మాత్రమే!

ఇంతకు ముందు టీ20ల్లో కోహ్లీ 11994 పరుగులు చేశాడు. అయితే ఈ మ్యాచ్‌లో అతను చేసిన వ్యక్తిగత స్కోరుతో 12000 పరుగులకు చేరుకున్నాడు. ఈ మార్కును నెలకొల్పిన తొలి భారత క్రికెటర్‌గా విరాట్ నిలిచాడు. విరాట్ కోహ్లీ తర్వాత రోహిత్ శర్మ (11,156) రెండో స్థానంలో ఉన్నాడు. కోహ్లీ తన 12 వేల రన్స్‌లో 8 సెంచరీలు, 91 హాఫ్ సెంచరీలు స్కోరు చేశాడు.

Virat Kohli Recordఅందులో అంతర్జాతీయ క్రికెట్‌లో (International Cricket) 4037 రన్స్ ఉన్నాయి. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తరపున 7284 రన్స్ చేశాడు. మిగతావి రాష్ట్ర జట్టు అయిన దిల్లీ, ఇండియన్స్ తరఫున స్కోర్ చేశాడు. మొత్తంగా టీ20 కెరీర్‌లో అత్యధిక పరుగులు చేసి ఆటగాడిగా వెస్టిండీస్ క్రికెటర్, యూనివర్సల్ బాస్ క్రిస్ గేల్ (Chris Gayle) ఉన్నాడు. గేల్ 14,562 ప‌రుగులు చేశాడు. ఆ తర్వాతి స్థానాల్లో పాకిస్థాన్ మాజీ ఆల్‌రౌండ‌ర్ షోయ‌బ్ మాలిక్ (12,993), కీర‌న్ పోలార్డ్ (12,430) మూడో స్థానంలో ఉన్నారు. కోహ్లీ నాలుగో స్థానంలో నిలిచాడు.

Also Read : Samsung Galaxy Book 4 : ఏఐ ఫీచర్లతో శాంసంగ్ గెలాక్సీ బుక్ 4 ల్యాప్‌టాప్‌.. ధరెంతో తెలుసా..!

ఐపీఎల్ 2024 తొలి మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు టాస్ గెలిచి 20 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 173 పరుగులు చేసింది. అనూజ్ రావత్ (25 బంతుల్లో 48), దినేష్ కార్తీక్ (26 బంతుల్లో 38), ఫాఫ్ డుప్లెసిస్ (23 బంతుల్లో 35), విరాట్ కోహ్లీ (21) అద్భుత ప్రదర్శన చేశారు. చెన్నై బౌలర్లలో ముస్తాఫిజుర్ రెహ్మాన్ 4 వికెట్లతో సత్తాచాటాడు. దీపక్ చాహర్ 1 వికెట్ పడగొట్టాడు.

Virat Kohli Record

 

Comments are closed.