Gold And Silver Effective Rates Today : పండుగ పూట షాకిచ్చిన బంగారం ధరలు. హైదరాబాద్ లో కేజీ వెండి @90,600

Gold And Silver Effective RatesToday : బంగారం ధరలు రోజు రోజుకీ పెరిగి పోతున్నాయి. సామాన్యుడికి బంగారం కొనాలంటే కనుచూపుమేర ధర కనిపించడం లేదు. మరో వైపు పసిడి ప్రియులకు కూడా పెరుగుతున్న గోల్డ్ రేట్లు భారంగానే మారుతున్నాయి.

Gold And Silver Effective Rates Today : బంగారం ఈ పేరు చెబితేనే ఎగిరి గంతేస్తారు మహిళలు. బంగారం అంటే ఆసక్తి లేని వారు ఉండరు. భారతీయులకు అత్యంత ఇష్టమైన వస్తువు ఏది అంటే బంగారమే. సాధారణ రోజులలో వదిలేస్తే ముఖ్యమైన పండగలు, శుభకార్యాలు, ఇతర వేడుకల సమయాల్లో మహిళలు బంగారు ఆభరణాలు కొనుగోలు చేసేందుకు ఆసక్తిని కనబరుస్తారు. బంగారు ఆభరణాలను ధరించడం అంటే మహిళలు ఎంతో ఇష్టపడతారు. బంగారు ఆభరణాలను ధరించడం వలన వారి అందం, హోదా మరింత పెరుగుతుందని భావించడమే కారణం. అయితే ప్రస్తుతం బంగారం కొనాలంటే భయపడుతున్నారు, కారణం గోల్డ్ రేట్లు అంతటి స్థాయిలో పెరుగుతున్నాయి. సామాన్యులకు అయితే బంగారం అందనంత ఎత్తులో ఉన్నది. సామాన్యులు కొనుగోలు చేసేందుకు బంగారం కనుచూపుమేరలో అందుబాటులోనే లేదు. అయితే బంగారం ధరలు రికార్డు స్థాయిలో పెరిగి పోతున్నాయి. రోజురోజుకూ ఆల్ టైమ్ గరిష్ట ధరలు నమోదు అవుతున్నాయి. మంగళవారం మీద పోల్చితే బంగారం ధర ఒక్కరోజులోనే భారీగా రూ. 900 పెరగడం గమనించవలసిన విషయం.

దేశంలో బంగారం ధరలు బుధవారం మరోసారి భారీగా పెరిగాయి. 22క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ. 900 పెరిగి.. రూ. 67,960 కి చేరింది. నిన్నటి రోజు మంగళవారం నాడు ఈ ధర రూ. 67,060 గా ఉంది. అదే 22క్యారెట్ల గోల్డ్ 100 గ్రాముల రేటు రూ. 9000 పెరిగి, రూ. 6,79,600 పలుకుతోంది. 1 గ్రామ్​ గోల్డ్​ ధర ప్రస్తుతం రూ. 6,796గా కొనసాగుతోంది.

మరో ప్రక్క 10 గ్రాముల 24 క్యారెట్ల పసిడి ధర కూడా రూ. 980 ఎగసి రూ. 74,140 వద్దకు చేరింది. మంగళవారం రోజు ఈ ధర రూ. 73,160గా ఉంది. మరోవైపు 24క్యారెట్ల పుత్తడి 100 గ్రాముల ధర రూ. 9800 పెరిగి, రూ. 7,41,400 గా నమోదయింది.

Today Gold Rates In Telugu States

హైదరాబాద్​లో ప్రస్తుతం 22 క్యారెట్ల బంగారం ధర రూ. 67,960గా నమోదయింది. 24 క్యారెట్ల గోల్డ్ విలువ వచ్చేసి రూ. 73,140 గా పలుకుతుంది. విజయవాడలో 22 క్యారెట్ల గోల్డ్ ధర వచ్చేసి రూ. 67,960గానూ.. 24 క్యారెట్ల బంగారం విలువ రూ. 73,140 గా కొనసాగుతున్నాయి. ఇక విశాఖపట్నంలో కూడా ధరలు పై విధంగానే ఉన్నాయి.

Gold And Silver Effective Rates Today
Image Credit : Telugu Mirror

Gold Rate Today :

మరోవైపు..దేశంలోని పలు ముఖ్య ప్రాంతాలలో కూడా గోల్డ్ రేట్లు బుధవారం పెరిగాయి. దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల బంగారం ధర రూ. 68,110గాను, అదేసమయంలో 24 క్యారెట్ల బంగారం ధర రూ. 74,290 గా పలుకుతోంది. కోల్​కతాలో బంగారం ధరలు వచ్చేసి ప్రస్తుతం 22 క్యారెట్ల గోల్డ్ ధర రూ. 67,960 పలుకుతోంది. 24 క్యారెట్ల బంగారం ధర రూ. 74,140 గా ఉంది. ముంబై, బెంగళూరు, కేరళలోనూ ఎలాంటి మార్పులు లేకుండా ఇవే రేట్లు కొనసాగుతున్నాయి.

చెన్నైలో 22క్యారెట్ల బంగారం రూ. 68,710గాను, 24 క్యారెట్ల గోల్డ్ రేటు ధర రూ. 74,960 గా పలుకుతుంది. పూణె విషయానికి వస్తే 22 క్యారెట్ల గోల్డ్​ రూ. 67,960గానమోదయింది. అదే సమయంలో 24 క్యారెట్ల పుత్తడి విలువ రూ. 74,140 గాను ఉంది.

అహ్మదాబాద్​లో బంగారం ధరలు ఇలా ఉన్నాయి 22 క్యారెట్ల ధర రూ. 68,100గానూ, 24 క్యారెట్ల ధర రూ. 74,190 గా నమోదయ్యాయి. భువనేశ్వర్​లో 22 క్యారెట్ల గోల్డ్ ధర రూ. 67,960గా ఉంది. 24 క్యారెట్ల పుత్తడి ధర రూ. 74,140గా పలుకుతుంది.

Today Silver Rate

దేశంలో వెండి ధరలు మంగళవారంతో పోల్చితే బుధవారం స్వల్పంగా పెరిగాయి. 100 గ్రాముల వెండి ధర ప్రస్తుతం రూ. 8,710 గా ఉంది. మరో వైపు కేజీ వెండి ధర రూ. 100 ఎగిసి రూ. 87,100 వద్దకు చేరింది. క్రితం రోజు మంగళవారం నాడు ఈ ధర రూ. 87,000గా ఉన్నది..

Today Silver Rate In Hyderabad

హైదరాబాద్​లో కేజీ వెండి ధర రూ. 90,600 గా నమోదయింది. వెండి ధరలు కోల్​కతాలో రూ.​ 87,100 గానూ, బెంగళూరులో రూ. 86,600గా ఉన్నాయి.

Also Read : ola electric scooter s1x: ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ ధరలు భారీ రేంజ్ లో తగ్గింపు. కొత్త స్కూటర్ కొనే వారికి మంచి ఛాన్స్.

Gold And Silver Effective Rates Today

Comments are closed.