IPhone 13 : ఐఫోన్ ప్రియుల కోసం ఫ్లిప్ కార్ట్ ఆఫర్ ..

ఐఫోన్ యొక్క ధరలు ఎప్పుడు ఎక్కువగానే ఉంటాయి. ఎంత రేట్ ఉన్న ఐఫోన్ ప్రియులు మాత్రం ఐఫోన్ ను కొనుగోలు చేస్తారు. కానీ ఇది అందరికీ వర్తించదు, ధర ఎప్పుడు తగ్గితే అప్పుడు కొందాం అని ఎదురుచూస్తుంటారు. అయితే వాళ్ళకి ఒక పెద్ద ఆఫర్ ఫ్లిప్ కార్ట్ లో అందుబాటులో ఉంది. ఫ్లిప్ కార్ట్ లో ఐఫోన్ 13 పై పెద్ద తగ్గింపు లభిస్తుంది.

Jelly Star : ప్రపంచంలోనే అతి చిన్న స్మార్ట్ ఫోన్.

యాపిల్ యొక్క అధికారిక వెబ్ సైట్ లో ఐఫోన్ 13 యొక్క ధర రూ.69,000 ఉండగా ఫ్లిప్ కార్డ్ లో మాత్రం రూ.57,999 కే లభిస్తుంది. కానీ మీకు కొన్ని నెలల్లో రాబోతున్న ఐఫోన్ 15 ను కొనాలా లేదా తక్కువలో వస్తున్న ఐఫోన్ 13 ను కొనాలా అనే సందేహం మీకు రావచ్చు. ఈ రేట్ కు ఐఫోన్ 13 ను కొనడం కరెక్టేనా అనే సందేహాలు రావచ్చు. దీని పై ఒక క్లారిటీనీ తీసుకొచ్చాం. లీక్ ల ప్రకారం ఐఫోన్ 15 ను యాపిల్ కొత్తగా తీసుకురాబోతుంది. ఐఫోన్ 15 కొత్త డిజైన్, కెమెరా, చిప్ సెట్ లతో రాబోతుంది. కానీ ఇవి నిజమో కాదో తెలియదు. వీటి గురించి యాపిల్ ఇంకా అధికారికంగా కూడా ప్రకటించలేదు. ఐఫోన్ 15 లో ఇలాంటి కొత్త ఫీచర్ లు వస్తె కనుక దీని ధర రూ.90,000 ఉండచ్చు. లేదా అంత కంటే ఎక్కువ ధరతోనే రావచ్చు.

Apple Airtag: యాపిల్ ఎయిర్ ట్యాగ్..ఇక దొంగలు తప్పించుకోలేరు..

ఈ కొత్త ఫీచర్ లు కావాలనుకుని, ధర ఎక్కువ అయిన పర్వాలేదు అనుకుంటే ఐఫోన్ 15 ను కొనడం మంచిదే. కానీ మీకు ధర కొంచెం ఎక్కువ అనిపిస్తే, ఐఫోన్ 13 ను తీసుకోవడం అనేది గొప్ప అడుగు. ఐఫోన్ 13 5G ను సపోర్ట్ చేస్తుంది. అలానే ఐఫోన్ 13 మరియు ఐఫోన్ 14 ల మధ్య పెద్ద తేడా ఏమీ ఉండదు. ఐఫోన్ 13 అనేది పెర్ఫార్మెన్స్, డిస్ ప్లే , కెమెరా విషయంలో బాగా ఉంది. ప్రస్తుతం ఐఫోన్ 13 యొక్క ధర రూ.57,999 కే లభిస్తుంది. ఐఫోన్ 14 యొక్క ధర రూ.65,000. కానీ ఐఫోన్ 13 తీసుకోవడం అనేది మంచి విషయమే.

Leave A Reply

Your email address will not be published.