Google Gemini AI App : గూగుల్ జెమిని ఎఐ యాప్ వచ్చేసింది, తొమ్మిది భాషల్లో అందుబాటులో..!

భారతదేశంతో పాటు, టర్కీ, బంగ్లాదేశ్, పాకిస్తాన్ మరియు శ్రీలంకలో జెమిని మొబైల్ యాప్ ప్రారంభించారు. గూగుల్ సీఈఓ అయిన సుందర్ పిచాయ్, X వద్ద Google Gemini మొబైల్ యాప్‌ను ప్రారంభించినట్లు ప్రకటించారు.

Google Gemini AI App : ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న GenAI జెమిని ని గూగుల్ విడుదల చేశారు. గూగుల్ జెమిని మొబైల్ యాప్, జెనరేటివ్ AI చాట్ బాట్‌ను ఇంగ్లీష్ తో పాటు తొమ్మిది అదనపు భారతీయ భాషలలో ప్రకటించింది. జెమినీ మొబైల్ యాప్ హిందీ, బెంగాలీ, గుజరాతీ, కన్నడ, మలయాళం, మరాఠీ, తమిళం, తెలుగు మరియు ఉర్దూ భాషల్లో అందుబాటులో ఉంది అలాగే GPT లాంటి సేవలను అందిస్తుంది.

జెమిని అడ్వాన్స్‌డ్‌లో గూగుల్ తొమ్మిది స్థానిక భాషలకు మద్దతు ఇస్తుంది. అదనంగా, Google జెమిని అడ్వాన్సెస్ ఇప్పుడు కొత్త కార్యాచరణలను కలిగి ఉంది. ఇది కొత్త డేటా విశ్లేషణ క్యాపబిలిటీస్, ఫైల్ అప్‌లోడ్‌లు మరియు ఇంగ్లీష్ లో గూగుల్ మెస్సేజెస్ ద్వారా జెమినితో కమ్యూనికేట్ చేసే ఆప్షన్ ను అందిస్తుంది. ఇది అన్ని జాతీయ భాషలలో టైప్ చేయడానికి లేదా మాట్లాడటానికి వీలు కల్పిస్తుంది.

భారతదేశంతో పాటు, టర్కీ, బంగ్లాదేశ్, పాకిస్తాన్ మరియు శ్రీలంకలో జెమిని మొబైల్ యాప్ ప్రారంభించారు. గూగుల్ సీఈఓ అయిన సుందర్ పిచాయ్, X వద్ద Google Gemini మొబైల్ యాప్‌ను ప్రారంభించినట్లు ప్రకటించారు. మీరు ఏదైనా అంశాన్ని సెర్చ్ చేసేటప్పుడు టైప్ చేయవచ్చు. లేదా, మీరు వాయిస్ అసిస్టెంట్‌ని ఎంచుకోవచ్చు.

 Google Gemini AI App

లేదంటే, మీరు ఫోటోను ఉపయోగించి సెర్చ్ చేసుకోవచ్చు. ప్రస్తుతం ఆండ్రాయిడ్ వినియోగదారులకు ప్రత్యేకంగా అందుబాటులో ఉన్న ఈ సాఫ్ట్‌వేర్ రానున్న రోజుల్లో ఐఫోన్ వినియోగదారులకు అందుబాటులో ఉంటుందని గూగుల్ ప్రకటించింది. జెమిని అడ్వాన్స్ అనేది ప్రీమియం ఎడిషన్, ఇందులో అదనపు ఫీచర్లు ఉన్నాయి. దీనికి కొంత చెల్లింపు అవసరం. ఫైల్ అప్‌లోడింగ్ మరియు డేటా అనాలసిస్ వంటి కొత్త సేవలను కూడా అందిస్తామని గూగుల్ పేర్కొంది.

Google Gemini AI APP యాక్సెస్ విధానం ఏ విధంగా ఉంటుందో ఇప్పుడు చూద్దాం..

ముందుగా, ప్లే స్టోర్ నుండి లేదా Google అసిస్టెంట్ ద్వారా నేరుగా డౌన్‌లోడ్ చేసుకోండి.
జెమిని ‘కార్నర్ స్వైపింగ్’ ద్వారా లేదా ఫోన్‌లలో ‘పవర్ బటన్‌ను నొక్కడం’ లేదా “Ok Google” అని చెప్పడం ద్వారా ఉపయోగించవచ్చు.
iOSలో, జెమిని యాక్సెస్ Google యాప్‌ నుండి వస్తుంది, కాబట్టి మీరు చాటింగ్ ప్రారంభించడానికి జెమిని టోగుల్‌ని ట్యాప్ చేయాలి. కొన్ని వారాల తర్వాత, భారతదేశంలోని iPhone వినియోగదారులు Google Gemini యాప్‌ అందుబాటులోకి వస్తుంది.

Google Gemini AI App

Comments are closed.