Jelly Star : ప్రపంచంలోనే అతి చిన్న స్మార్ట్ ఫోన్.

చైనా స్మార్ట్ ఫోన్ ల తయారీ కంపెనీ యూనిహెర్ట్జ్ కొత్త స్మార్ట్ ఫోన్ ను తయారు చేసింది. దీని పేరు ‘ జెల్లీ స్టార్’. ఇది ప్రపంచంలోనే అతి చిన్న స్మార్ట్ ఫోన్. 3 అంగుళాల డిస్ ప్లే ను కలిగిన ఈ జెల్లీ స్టార్ లేటెస్ట్ ఆండ్రాయిడ్ వెర్షన్ 13 మీదా నడుస్తుంది. ఇది చిన్న ఫోన్ అనే కానీ, పెద్ద ఫోన్ లకు పోటీ అనేట్టుగా జెల్లీ స్టార్ ఉంది. జెల్లీ స్టార్ కేవలం చైనా మార్కెట్ లలోనే అందుబాటులో ఉంది.

Apple Airtag: యాపిల్ ఎయిర్ ట్యాగ్..ఇక దొంగలు తప్పించుకోలేరు..

జెల్లీ స్టార్ చిన్న ఫోన్ అయినప్పటికీ 60Hz రిఫ్రెష్ రేట్ తో కూడిన LCD డిస్ ప్లే తో లభిస్తుంది, 480 x 854 పిక్సెల్స్ రెజల్యూషన్ తో వస్తుంది. అలానే ఈ చిన్న ఫోన్ ఆండ్రాయిడ్ 13 మరియు గూగుల్ ఆపరేటింగ్ సిస్టమ్ తో నడుస్తుంది. జెల్లీ స్టార్ 8GB RAM మరియు 256GB ఇంటర్ నల్ స్టోరేజ్ తో వస్తుందీ, అలానే మైక్రో SD కార్డ్ సపోర్ట్ తో లభిస్తుంది. ఇలాంటి స్పెసిఫికేషన్ లు హై ఎండ్ ఫోన్ లలో ఉంటాయి కానీ జెల్లీ స్టార్ లో ఇలాంటి స్పెసిఫికేషన్ లు ఉండటం గ్రేట్ అనే చెప్పు కోవాలి.

ఈ చిన్న హ్యాండ్ సెట్ లో MediaTek Helio G-99 ఆక్టాకోర్ ప్రాసెసర్ తో అందుబాటులో ఉంది. ఈ ఫోన్ ను యూనిహెర్ట్జ్ కంపెనీ వారు ఒకే వేరియంట్ లో విడుదల చేశారు. జెల్లీ స్టార్ 48 – మెగా పిక్సెల్ రియర్ కెమెరా మరియు 8 – మెగా పిక్సెల్ ఫ్రంట్ కెమెరాలతో లభిస్తుంది. ఈ ఫోన్ కు ఇలాంటి కెమెరాలు ఉండటం గొప్ప అనుకోవాలి. ఈ ఫోన్ యొక్క బ్యాక్ సైడ్ కొంచెం ట్రాన్స్పరెంట్ గా ఉంటుంది, అలానే Nothing Phone (1) లో చూసిన డిజైన్ లాగా ఈ ఫోన్ కి కూడా LED లైట్ లను ఇచ్చారు. ఈ ఫోన్ కు ఫింగర్ ప్రింట్ సెన్సార్ కూడా ఉంది. అలానే ఈ ఫోన్ 2000mAh బ్యాటరీని కలిగి ఉంది.

Today Panchangam–శని ప్రదోష వ్రతం వేళ రవి యోగం …

ఇది USB Type-C పోర్ట్ తో లభిస్తుంది. ఈ ఫోన్ 166 గ్రాముల బరువును 18.7mm మందాన్ని కలిగి ఉంది. ఇది ఒక 4G ఫోన్, అలానే డ్యుయల్ సిమ్ సపోర్ట్ తో వచ్చింది. కానీ ఈ ఫోన్ చైనాలో తప్ప వేరే ఎక్కడ కూడా ఈ ఫోన్ కొనుగోలుకు అందుబాటులో లేదు. దీని ధర $140 అంటే దాదాపు రూ.14,000, ఈ చిన్న స్మార్ట్ ఫోన్ భారత దేశం లో అక్టోబర్ లో విడుదల కాబోతుందని వార్త. మన దగ్గర రూ.17,000 కు లభించవచ్చు. మరి చిన్నగా ఉన్న ఈ క్యూట్ ఫోన్ మీకు అందుబాటులో ఉంటే కొంటారా ?.

Leave A Reply

Your email address will not be published.