whats app automatic delete feature: వాట్సాప్ లో ఆటోమేటిక్ డిలీట్ మరియు ఫేవరెట్ చాట్ లిస్ట్ ఫీచర్

వాట్స్అప్ కంపెనీ ఇప్పుడు మరో కొత్త ఫీచర్స్ ను తీసుకొస్తుంది. బీటా వెర్షన్ యూజర్స్ కి మతమే అందుబాటులో ఉన్నాయి. వివరాల్లోకి వెళ్తే.

whats app automatic delete feature: స్మార్ట్ ఫోన్ ఉందంటే ఖచ్చితంగా వాట్స్ అప్ వినియోగిస్తారు. డైలీ లైఫ్ లో వాట్స్ అప్ కూడా ఒక భాగమైపోయింది. మెసేజెస్ (message) , కాల్స్ (calls) , వీడియో కాల్స్ (video calls) , స్టేటస్ (status) , ఫొటోస్ (photos) ఇంకా వీడియోస్ (videos) పంపడం వంటివి ఎక్కువగా వాట్స్ అప్ (whats app) నుండే చేస్తారు. ప్రజలు విరివిగా ఉపయోగించే వాటిల్లో వాట్స్ అప్ ముందంజలో ఉంటుంది అని చెప్పడంలో సందేహమే లేదు.

అయితే, వాట్సాప్ కంపెనీ ఇప్పుడు మరో కొత్త ఫీచర్స్ ను తీసుకొస్తుంది. మన వాట్సాప్ లో సాధారణంగా అనవసరమైన మెసేజస్ ఎక్కువగా ఉంటాయి. అయితే, వాట్స్అప్ కంపెనీ ఇప్పుడు చదవని మెసేజస్ ని ఆటోమేటిక్ గా డిలీట్ చేసే ఫీచర్ ను తీసుకురానుంది. ఈ ఫీచర్ బీటా వెర్షన్ యూజర్స్ (Beta Version Features) కి మతమే అందుబాటులో ఉన్నాయి. మరి ఈ మెసేజస్ ఎన్ని రోజులకి డిలీట్ అవుతాయి అనే విషయం గురించి ఇంకా స్పష్టంగా తెలీదు. అయితే, ప్రస్తుతం ఇది టెస్టింగ్ స్టేజ్ లో ఉంది. టెస్టింగ్ పూర్తి అయ్యాక ఇది అందుబాటులోకి వస్తుంది. ఈ ఫీచర్ చాలా మందికి ఉపయోగకరంగా ఉంటుందనే చెప్పాలి.

Also Read: Phone Pe Insurance: ఫోన్ పే నుండి సూపర్ గుడ్ న్యూస్, కేవలం రూ.500 చెల్లిస్తే చాలు, రూ.10 లక్షలు పొందొచ్చు

ఫేవరెట్ చాట్ ఫిల్టరింగ్ ఫీచర్:

బీటా టెస్టర్లు ఇప్పుడు యూజర్ ఫేవరెట్ చాట్స్ ని వేగంగా గుర్తించడానికి కొత్త చాట్ ఫిల్టర్‌ ఫీచర్ ని తీసుకొస్తుంది. వినియోగదారులు ఈ ఫీచర్ నుండి నేరుగా ఇష్టమైన వారిని యాడ్ చేసుకోవచ్చు యాప్ సెట్టింగ్‌లలో “ఫేవరెట్” ఆప్షన్ ని ఉపయోగించి యాడ్ చేయవచ్చు. ఈ ఫీచర్ వినియోగదారులు తమ ఫేవరెట్ చాట్స్ ని, యాడ్ చేయడానికి, తీసివేయడానికి మరియు చాట్స్ ని రీఆర్డర్ చేయడానికి ఉపయోగించవచ్చు. వినియోగదారులు చాట్ ఇన్ఫోర్మేషన్ ప్యానెల్ (information panel) నుండి మీకు ఇష్టమైన వారిని యాడ్ చేసుకోవచ్చు. కాంటాక్ట్స్ ని సర్చ్ చేయాల్సిన అవసరం లేకుండానే అవసరమైన చాట్‌లను ఫేవరెట్ లో యాడ్ చేసుకుంటే సరిపోతుంది. అయితే, ఈ ఫీచర్ కూడా ప్రస్తుతం టెస్టింగ్ లో ఉంది.

Comments are closed.