White Bread : దినచర్యలో వైట్ బ్రెడ్ వాడకం.. మన ప్రాణానికి పెను ప్రమాదం..

Telugu Mirror : కొంతమంది అల్పాహారంగా వైట్ బ్రెడ్(White bread) తినే అలవాటు ఉంటుంది .చాలామంది ఇళ్ళల్లో వైట్ బ్రెడ్ వినియోగం ఎక్కువగానే ఉంటుంది. దీనిని బ్రేక్ ఫాస్ట్ గా, టీ తో పాటు తింటూ ఉంటారు. లేదా పిజ్జా రూపంలో తీసుకున్న శరీరానికి అనేక రకాలుగా హానికరం.
డయాబెటిస్(Sugar) ఉన్నవారు వైట్ బ్రెడ్ రెగ్యులర్ గా తీసుకోకూడదని పరిశోధనలోతేలింది. ఇది మీరు ఎప్పుడైనా గమనించారా?

వాస్తవానికి వైట్ బ్రెడ్ ప్రాసెస్(Process) చేయబడిన పిండి నుండి తయారు చేస్తారు. అటువంటి పిండితో చేసిన ఆహార పదార్థాలను తినడం వల్ల ఆరోగ్యానికి నష్టం కలిగిస్తాయి అని పరిశోధనల ద్వారా కనుగొన్నారు.ప్రాసెస్ చేసిన పిండిలో ఎటువంటి పోషకాలు ఉండవు .ఎందుకంటే ప్రాసెస్ చేసినప్పుడు వాటిలో అవి తొలగించబడతాయి. అందువలన ప్రాసెస్ చేసిన ఆహారాన్ని తింటే కడుపు నిండిన భావన కలుగుతుంది. దీనిని తినడం వలన దేహానికి ఎటువంటి ఉపయోగం ఉండదు.

TVS iQube : తక్కువ ధరతో ఎలక్ట్రిక్ స్కూటర్ ఉండగా .. ఇంధనం ఖర్చు ఎందుకు దండగా..మీ కోసం అతి త్వరలో..

బ్రెడ్ అనేక రకాలుగా లభ్యమవుతుంది. బ్రెడ్ ని రకరకాల పదార్థాలను ఉపయోగించి వివిధ పద్ధతులలో తయారు చేస్తారు. వైట్ బ్రెడ్ ఆరోగ్యానికి హానికరం అని పరిశోధనకులు కనుగొన్నారు. అయితే వైట్ బ్రెడ్ కన్నా బ్రౌన్ బ్రెడ్(Brown Bread) ఆరోగ్యానికి మంచిదని దానివల్ల ఉపయోగాలు ఉన్నాయని, శరీరానికి మేలు చేస్తాయని కనుగొన్నారు.కాబట్టి ప్రతిరోజు వైట్ బ్రెడ్ తినే అలవాటు ఉంటే మానుకోవాలని నిపుణులు చెబుతున్నారు. అయితే వైట్ బ్రెడ్ ఆరోగ్యానికి ఎటువంటి హాని చేస్తుందో చూద్దాం.

Image Credit : TV9 Telugu

వైట్ బ్రెడ్ తినడం వల్ల బరువు పెరిగే అవకాశం ఎక్కువగా ఉంది. వైట్ బ్రెడ్ లో గ్లైసిమిక్ ఇండెక్స్(Glycemic index) ఎక్కువగా ఉండటం వలన బ్లడ్ షుగర్ మరియు బరువుని పెంచుతుందని పరిశోధనలో తేలింది. వైట్ బ్రెడ్ లో ఫైబర్ కూడా ఉండదు. బరువు తగ్గాలనుకునేవారు వైట్ బ్రెడ్ తినడం మానేయాలి.డయాబెటిస్(Sugar) ఉన్నవారు కూడా వైట్ బ్రెడ్ తినడం తగ్గించాలని ఆరోగ్య నిపుణులు వెల్లడించారు. గ్లైసమిక్ ఎక్కువగా ఉండటం వలన రక్తంలో గ్లూకోజ్ ను వేగంగా పెంచడానికి కారణం అవుతుంది. మరియు వైట్ బ్రెడ్ లో ఫైబర్ కూడా చాలా తక్కువ మోతాదులో ఉంటుంది.

Doctor Prescription : ఆరోగ్య సంరక్షణ మన బాధ్యత.. ప్రిస్క్రిప్షన్ తప్పనిసరి–ఆదేశాలు జారీ

దీని వలన రక్తంలో షుగర్ స్థాయి పెరుగుతుంది.బ్రిటిష్ మెడికల్ జర్నల్(Medical Journal) వారి అధ్యయనం ప్రకారం ప్రాసెస్ చేసిన ధాన్యాలను ఎక్కువగా తీసుకోవడం వల్ల గుండె సంబంధిత వ్యాధులు మరియు స్ట్రోక్ ప్రమాదాన్ని పెంచే అవకాశం ఎక్కువగా ఉంది. ప్రాసెస్ చేసిన ఆహార పదార్థాలను రోజూ తినే వాళ్ళకు స్ట్రోక్(Stock) ప్రమాదం 47% పెరిగి అవకాశం ఉందనే శాస్త్రవేత్తలు పేర్కొన్నారు.కాబట్టి వైట్ బ్రెడ్ వీలైనంతవరకు తీసుకోవడం తగ్గించాలి. వైట్ బ్రెడ్ బదులుగా బ్రౌన్ బ్రెడ్ తినడం వల్ల ఆరోగ్యానికి లాభదాయకంగా ఉంటుంది.

Leave A Reply

Your email address will not be published.