Vastu Tips : ఈ వాస్తు చిట్కాలు పాటిస్తే.. మీ ఇంట్లో డబ్బు, ఆనందానికి లోటే ఉండదు..

Telugu Mirror  : ప్రతి రోజూ ఇంటి ప్రధాన ద్వారం ఎదురుగా నీటిని చల్లడం ద్వారా అదృష్టం వస్తుందని వాస్తు శాస్త్రం చెబుతోంది.ఇంట్లో ఉన్నటువంటి సానుకూల శక్తిని కాపాడుకునేందుకు,.ఉదయాన్నే ఇంటి ప్రధాన ద్వారంలో నీటిని చల్లుకోవడం శుభకరం అని భావించుతారు.

వాస్తు చిట్కాలు:
వాస్తు శాస్త్ర ప్రకారంగా సాధారణంగా ఇంటిలో ప్రతి మూల నుంచి నెగటివ్ ఎనర్జీ అలాగే పాజిటివ్ ఎనర్జీ వస్తుంది.అందుకనే ఇంట్లోని ప్రతి మూలలోనూ వాస్తు పరంగా ఎటువంటి దోషాలు లేకుండా చూసుకోవాలి.వాస్తుశాస్త్రం లో ఇటువంటి క్రియలు అనేకం ఉన్నాయి,వాటిని పాటించడం ద్వారా ఒక వ్యక్తి చెడు శక్తులనే కాకుండా నెగటివ్ ఎనర్జీ నుండి విముక్తి పొందవచ్చు.ఇలాంటి పనులలో ఒకటి ఇంటికి ఉన్న ప్రధాన ద్వారంలో ప్రతిరోజూ నీటిని చిలకరించడం. దేవతలు వచ్చే ప్రధాన ద్వారం గుండానే ప్రతికూల శక్తులు కూడా లోపలికి ప్రవేశిస్తాయని సహజంగా నమ్ముతుంటారు.ఆ కారణం చేతనే ప్రధాన ద్వారం కి ఓం, స్వస్తిక్ గుర్తులను తయారుచేసి ముగ్గులను వేస్తారు.ఇలా కాకుండా మీరు కావాలనుకొంటే ప్రతిరోజూ నీటిని చల్లుకోవచ్చు. నీటిని చల్లుకోవడం వలన కలిగే లాభాలు మరియు ప్రధాన ద్వారం వద్ద నీటిని ఏవిధంగా చల్లుకోవాలో తెలుసుకుందాం.

ప్రతికూల శక్తిని వదిలించుకోండి ఇలా:
వాస్తు ప్రకారం,సింహ ద్వారం దగ్గర నీటిని చల్లుకోవడం వలన దుష్ట శక్తులు అలాగే నెగటివ్ ఎనర్జీని ఇంటి లోపలికి రాకుండా కవచంలా నిరోధిస్తాయి.

వాస్తు దోషాల నుండి విముక్తి కలగడం స్వేచ్ఛ:
తెల్లవారుజామునే మేల్కొని అరచేతితో నీటిని తీసుకుని ప్రధాన ద్వారం ఎదురుగా చల్లడం వలన వాస్తు ప్రకారమైన దోషాలు వుంటే తొలగి పోతాయి.

Image credit: kalam Times

కుటుంబ సభ్యులకు అదృష్టం కలుగుతుంది:
వాస్తు శాస్త్ర ప్రకారంగా,ఇంటి యొక్క సింహ ద్వారం (ప్రధాన ద్వారం) చాలా మంగళ కరమైనది.అది ఎల్లప్పుడూ శుభ్రంగా ఉండాలి.అటువంటి పరిస్థితులలో ఇంటిలోకి ఎటువంటి చెడు శక్తులు ప్రవేశించలేవు. ప్రతికూల శక్తులు ఇంటిలోకి రావడం ఆగిపోవడం వలన ఇంట్లో నివసించే వారికి అదృష్టం కలుగుతుంది.అలానే ఆర్ధిక పరిస్థితి కూడా వృద్ది చెంది కుటుంబ పురోగతి ఉంటుంది.

ఇల్లు కూడా శుభ్రంగా ఉంటుంది:
ఇంటి ప్రధాన ద్వారంలో వాస్తు శాస్ట్రాన్ని అనుసరించి ఉదయాన్నే నీటిని చల్లుకోవడం వలన ఎక్కువగా పాజిటివ్ ఎనర్జీని (సానుకూల శక్తి) ఆకర్షించుతుందని నమ్ముతారు.అలాగే నీటిని చిలకరించడం ద్వారా ఇల్లు కూడా శుభ్రంగా ఉంటుంది.

ఇంట్లో శాంతి మరియు ప్రశాంతత లభిస్తుంది:
ఇంటి సింహ.(Main Door) ద్వారంలో నీటిని చల్లుకోవడం వలన నెగటివ్ ఎనర్జీ (Negative Energy ) మరియు వాస్తు ప్రకారం ఉన్న దోషాలు తొలగి పోవడానికి దోహదం చేస్తుంది.ప్రతికూల,వాస్తు దోషాలు తొలగి పోవడం వలన ఇంట్లో కష్టాలను కూడా తొలగిస్తుంది.

ప్రధాన ద్వారం లో నీళ్ళు ఇలా చల్లాలి:
తెల్లవారి లేచి మీ చేతిలో శుభ్రంగా ఉన్న నీళ్ళను తీసుకుని ఇంటి ప్రధాన ద్వారంలో చల్లిన తరువాత నీరు ఉన్న చేతిని సవ్య దిశలో తిప్పండి అంటే తలుపు పై నుంచి క్రిందకు వచ్చి నేలపై పడే విధంగా చేయండి.అదేవిధంగా తలుపుకు రెండు ప్రక్కలా నీరు చల్లండి.తరువాత ఆరనివ్వాలి.

Leave A Reply

Your email address will not be published.