అక్టోబర్ నెలలో OTT లో సందడి చేయనున్న తెలుగు సినిమాలు, ఆ సినిమాల జాబితాను ఇప్పుడు తెలుసుకుందాం
ఈ నెలలో వచ్చే సినిమాల జాబితానూ మరియు అవి ఏ ప్లాట్ ఫారంలో విడుదల అవనున్నాయో పూర్తిగా వివరిస్తున్నాము. ఈ నెలలో మీరు చూడాలనుకున్న సినిమాలపై ఓ లుక్కేయండి..
Telugu Mirror : ప్రతి ఒక్కరు తమ పనుల్లో బిజీ అయిపోయి కాస్త విశ్రాంతి దొరికితే ఎంటర్టైన్ (Entertain) అవ్వాలని కోరుకుంటారు. ఈ మధ్య కాలంలో ప్రజలు ఎక్కువగా OTT లో మూవీస్ చూసేందుకు ఇష్టపడుతున్నారు . OTT లో జరుగుతున్న హవా అంతా ఇంతా కాదు . OTT లో వచ్చిన సినిమాలకి క్రేజ్ బాగా పెరిగిపోతుంది. ఇక కొన్ని సినిమాలు అయితే నేరుగా OTT లోనే విడుదల చేస్తున్నారు. సినిమా థియేటర్ కి వెళ్లినప్పటికీ OTT లో విడుదలయ్యే సినిమాల కోసం ఎంతో మంది ఎదురుచూస్తుంటారు. సాధారణంగా , ఎక్కువగా తెలుగు కంటెంట్ ఉన్న సినిమాలు అమెజాన్ ప్రైమ్ , ఆహా , నెట్‌ఫ్లిక్స్, SUN NXT మరియు హాట్‌స్టార్ యాప్‌లలో కనిపిస్తాయి. అయితే ఒక మంచి సినిమాని చూసేందుకు మీరు కూడా OTT లో విడుదలయ్యే మూవీ కోసం ఎదురుచూస్తున్నారా? అయితే మీ కోసం తాజాగా ఈ నెలలో వచ్చే సినిమాల జాబితానూ మరియు అవి ఏ ప్లాట్ ఫారంలో విడుదల అవనున్నాయో పూర్తిగా వివరిస్తున్నాము. ఈ నెలలో మీరు చూడాలనుకున్న సినిమాలపై ఓ లుక్కేయండి..
OTT లోకి విడుదలవనున్న సినిమాలు ..
1. ది గ్రేట్ ఇండియన్ సూసైడ్
మంచి థ్రిల్ ఉన్న సినిమా “ది గ్రేట్ ఇండియన్ సూసైడ్” . విప్లవ్ కోనేటి దర్శకత్వం వహించిన ఈ చిత్రం లో రామ్ కార్తీక్ మరియు హెబ్బా పటేల్ ముఖ్య పాత్రల్లో నటించారు. ఈ సినిమా కచ్చితంగా మంచి థ్రిల్ ని ప్రేక్షకులకి ఇస్తుంది అని మేకర్స్ చెప్పుకొచ్చారు. OTT లో త్వరలోనే రిలీజ్ అవనున్న ఈ సినిమాను వీక్షించండి.
ది గ్రేట్ ఇండియన్ సూసైడ్ OTT రిలీజ్ డేట్ : 6 అక్టోబర్ 2023
ప్లాట్ ఫారం : ఆహా
2.మిస్టర్ ప్రెగ్నెంట్
బిగ్ బాస్ ఫేమ్ అయినా సోహెల్ నటించిన ఈ సినిమా ప్రజలను అంతగా ఆకట్టుకోలేకపోయింది . ప్రస్తుతం ఈ సినిమా OTT లో సందడి చేసేందుకు సిద్దమవుతుంది. ఎమోషనల్ డ్రామా తో కూడిన ఈ సినిమా ఆహాలో సందడి చేయనుంది.
మిస్టర్ ప్రెగ్నెంట్ OTT రిలీజ్ డేట్ : 06 అక్టోబర్ 2023
ప్లాట్ ఫారం : ఆహా
3. ప్రేమ విమానం
శాన్వి మేఘన మరియు సంగీత్ శోభన్ కలిసి జంటగా నటించిన సినిమా ప్రేమ విమానం. ఎమోషనల్ మరియు ఎంతో ఫన్ తో రూపొందిన ఈ సినిమా త్వరలోనే OTT లోకి రానుంది. అనసూయ , వెన్నెల కిషోర్ , దేవాన్ష్ నామా, అనిరుద్ నామా ముఖ్య పాత్రల్లో నటించారు. ఈ సినిమా ట్రైలర్ కూడా వచ్చేసింది. ప్రస్తుతం OTT లోకి వచ్చేందుకు సిద్ధంగా ఉంది.
ప్రేమ విమానం OTT రిలీజ్ డేట్ : 13 అక్టోబర్ 2023
ప్లాట్ ఫారం : Zee5 సినిమా
4. మాన్షన్ 24
బుల్లి తెర పై పేరు సంపాదించుకున్న ఓంకార్ తన దర్శకత్వం లో “మాన్షన్ 24” అనే సిరీస్ ను తెరకెక్కించారు . మాన్షన్ 24 సిరీస్ కి ఓంకార్ దర్శకత్వం వహించగా ఈ హర్రర్ సిరీస్ లో వరలక్ష్మి శరత్ కుమార్, అవికా గోర్ ప్రధాన పాత్రలుగా నటించారు. ఈ సిరీస్ యొక్క ట్రైలర్ ఇప్పటికే వచ్చేసింది. అయితే మాన్షన్ 24 ప్రస్తుతం OTT లోకి వచ్చేందుకు సిద్ధంగా ఉంది .
మాన్షన్ 24 OTT రిలీజ్ డేట్ : 17 అక్టోబర్ 2023
ప్లాట్ ఫారం : డిస్నీ+ హాట్‌స్టార్
5. ఏజెంట్
అఖిల్ అక్కినేని నటించిన యాక్షన్ థ్రిల్లర్ మూవీ ‘ఏజెంట్ ‘ ప్రస్తుతం’ OTT లోకి వచ్చేందుకు సిద్ధంగా ఉంది. సురేందర్ రెడ్డి దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా సెప్టెంబర్ 29 న సోనీ లివ్ లో రిలీజ్ కావాల్సి ఉంది. కానీ కొన్ని కారణాల చేత వాయిదా పడిన విషయం అందరికి తెలిసిందే. అయితే ఈ సినిమా కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న అభిమానులకు ఈ సినిమా త్వరలో సోని లివ్ లో విడుదల కానుంది.
ఏజెంట్ మూవీ రిలీజ్ డేట్ : త్వరలో
ప్లాట్ ఫారం : సోని లివ్
Comments are closed.