Ola Electric Bikes: లక్ష లోపు Ola కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ Ola S1 X.. సరికొత్తగా ఆగష్టు 15 న మార్కెట్ లోకి

Telugu Mirror: దేశంలోని అగ్రశ్రేణి ఎలక్ట్రికల్ టూ వీలర్(two wheeler) తయారీదారు అయిన Ola ఎలక్ట్రిక్ భారత E2W మార్కెట్ లోకి మరో కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్‌ను విడుదల చేయడానికి సిద్ధంగా ఉంది మరియు దాని విస్తృత శ్రేణి ఎలక్ట్రిక్ స్కూటర్లకు కొత్త మోడల్‌ను జతచేయడానికి సిద్ధంగా ఉంది. Ola ఎలక్ట్రిక్ ప్రస్తుతం S1 ప్రో, S1 మరియు S1 ఎయిర్ E2W స్కూటర్లను అందిస్తోంది.

ధర

Ola Electric S1 X అనే పేరుతో ఒక ఎంట్రీ-లెవల్ ఎలక్ట్రిక్ స్కూటర్‌ను ప్రారంభం చేయడానికి సన్నాహాలు చేస్తుంది., దీని స్టార్టింగ్ ప్రైస్ వచ్చేసి రూ.1 లక్ష కంటే తక్కువ.

ప్రారంభ తేదీ

Ola S1 X ఎలక్ట్రిక్ స్కూటర్ ఈ స్వాతంత్ర్య దినోత్సవం, 15 ఆగస్టు 2023 నాడు లాంఛ్ అవుతుందని భావిస్తున్నారు.

Also Read:Vijay Sales: దుమ్ము రేపుతున్న విజయ్ సేల్స్.. Apple iPhone ల పై భారీ తగ్గింపు..

Ola launches new electric bikes
Image Credit: E-Vehicle info

Ola S1 ఎయిర్

Ola ఈ మధ్యనే S1ఎయిర్‌ను ప్రారంభించింది, ఇది ఇప్పటికే దాని ప్రత్యర్థి EV ల కంటే చాలా అనువైన ధరను కలిగి ఉంది.

S1 X ధర రూ. 1 లక్షలోపు ఉంటుంది, ఇది ఓలా శ్రేణి లోఅత్యంత సరసమైన స్కూటర్‌గా మారుతుంది. ఇది ఇప్పటికే దేశంలోనే అత్యధిక అమ్మకాలు కలిగిన ఎలక్ట్రిక్ టూ వీలర్ తయారీ కంపెనీ మరియు ఎలక్ట్రిక్ వాహనాలను మరింత చేరువలోకి తీసుకు వచ్చేందుకు మరియు విస్తృత శ్రేణి కొనుగోలుదారులను ఆకర్షించడంలో సహాయపడటానికి దీనితో ఎలక్ట్రిక్ వాహనాల యొక్క వినియోగాన్ని పెంచడంతో పాటు వినియోగ దారులు ఎలక్ట్రిక్ వాహనాలకి ఆకర్షితులు అవడానికి సహాయపడుతుంది.

Ola కంపెనీ ఇప్పటివరకు ఏ మోడల్ గురించీ వివరాలను వెల్లడించలేదు.  అయితే, ప్రస్తుత S1 X ధర, స్పెసిఫికేషన్‌లు, శ్రేణి మొదలగు వివరాలను  విడుదల తేదీ దగ్గర అవుతున్న కొద్దీ టీజ్ చేస్తుందని భావిస్తున్నారు.

ICE KILLER S1 X 

Ola ఇచ్చిన ప్రెజెంటేషన్ లో కొత్త S1 Xని ‘ICE కిల్లర్’గా హైలైట్ చేసింది, ఇక ICE స్కూటర్‌లకు ముగింపు అనే విధంగా సూచించింది. భారతీయ ఎలక్ట్రిక్ వెహికల్స్ విపణి లో విప్లవాత్మక మార్పులు కలిగించడానికి మరియు గ్రీన్ మొబిలిటీని అంతటా వాస్తవంగా మార్చడానికి ఓలా యొక్క మిషన్‌లో భాగంగా ఈ ప్రయోగం మరో మైల్ స్టోన్ ని సూచిస్తుందని కంపెనీ భావిస్తుంది.

S1 ప్రో GEN 2

S1 X విడుదలతోపాటు ఇప్పటికే మార్కెట్ లోఉన్న Ola S1 ఎలక్ట్రిక్ స్కూటర్‌లో కూడా కొన్ని మార్పులను చేస్తోంది. ముందస్తుగానే  ప్రారంభమైన కొన్ని రూమర్ల ప్రకారం, Ola S1 ప్రోలో ప్రధానంగా రెండు మార్పులను చేయాలనే ఆలోచనలలో ఉన్నట్లు అంచనా.

1• ముందు టెలిస్కోపిక్ సస్పెన్షన్ జోడించడం

2• ఫ్లాట్ ఫుట్‌బోర్డ్‌ను జోడించడం

ప్రస్తుతం, Ola ఎలక్ట్రిక్ స్కూటర్లలో ముందు టెలిస్కోపిక్ సస్పెన్షన్‌ను ప్రస్తుతం Ola S1మాత్రమే కలిగి ఉంది. Ola S1 ప్రో మాత్రం సంప్రదాయ ప్రకారం లేని సింగిల్-సైడెడ్ ఫ్రంట్ ఫోర్క్‌ని ఉపయోగిస్తుంది. కానీ రీ డెవలప్ చేసిన S1Pro లో టెలిస్కోపిక్ సస్పెన్షన్‌ను కూడా కంపెనీ జతపరుస్తుంది.

ఇది కాకుండా Ola S1 ప్రో ఒక కర్వ్డ్ డిజైన్ ఫ్రంట్ ఫుట్‌బోర్డ్‌ను కలిగి ఉంటుంది, ఇప్పుడు దీనిని ఫ్లాట్ ఫుట్‌బోర్డ్‌తో భర్తీ చేయబడుతుంది.

Leave A Reply

Your email address will not be published.