Bank Holidays in July: 15 రోజులు బ్యాంకులు బంద్.. లిస్ట్ ఇదే..

--ఆ పనులన్నీ వెంటనే చూస్కొండి!..

Telugu Mirror : భారత దేశంలో బ్యాంకింగ్ వ్యవస్థ మొత్తం RBI కనుసన్నలలో నడుస్తుంది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) భారత దేశంలోని బ్యాంకుల యొక్క కార్యకలాపాలను పర్యవేక్షిస్తుంది. బ్యాంక్ ల యొక్క సంవత్సర కాలం పని విధానాన్ని ఏటా నిర్దేశిస్తుంటుంది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇచ్చిన మార్గదర్శకత్వంలోనే బ్యాంకులకు సెలవులు ఉంటాయి. RBI ద్వారా బ్యాంక్ లకు నిర్దేశించిన సెలవులే కాకుండా ఆయా రాష్ట్రాల్లోని అధికారికంగా ఉండే పండుగలు మరియు ఇతర ప్రత్యేక సందర్భాలలో అదనపు సెలవులను కలిగి ఉంటాయి.

అదేవిధంగా జూలై 2023లో వివిధ రాష్ట్రాలలోని బ్యాంకులన్నిటికీ ఆదివారాలు అలాగే రెండవ మరియు నాలుగవ శనివారాలను కలుపుకుని మొత్తం 15 రోజులు సెలవులు ఉన్నాయి. అయితే రాష్ట్రాలలోని వివిధ ప్రాముఖ్యతలను బట్టి బ్యాంక్ సెలవులు మారతాయని పాఠకులు గమనించగలరు.

బ్యాంక్ సెలవులను గమనిస్తే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) గైడ్ లైన్స్ ప్రకారం, ప్రభుత్వరంగ బ్యాంక్ లు అలాగే ప్రైవేట్ బ్యాంక్ లు ప్రస్తుతం ప్రతినెలలో ఆదివారాలు మరియు రెండవ శనివారం తో పాటు నాలుగవ శనివారం పనిచేయవు. దీనికి తోడు రాష్ట్ర ప్రభుత్వాలు ప్రకటించిన ప్రాంతీయ సెలవులకు అదనంగా ప్రభుత్వ సెలవు రోజులలో కూడా బ్యాంకులు తెరచుకోవు.

Princess of Wales : టెన్నిస్ కోర్ట్ లో బాల్ గర్ల్ గా బ్రిటన్ యువరాణి..

ప్రస్తుత జూలై నెలలో మొత్తంగా 16 రోజులే బ్యాంకులకు పనిదినాలు. మిగతా 15 రోజులు సెలవులు ఉన్నాయి. జూలై 5 వ తేదీన గురు హర గోవింద్ జయంతి నుంచి ప్రారంభమై మధ్యలో పనిదినాలుతో జూలై 29 న మొహర్రం పండుగ సెలవుతో ముగుస్తాయి. అయితే ఈ సెలవులు కొన్ని రాష్ట్రాలలో మినహా భారతదేశ వ్యాప్తంగా మిగిలిన బ్యాంక్ లకు వర్తిస్తాయి. ముఖ్యమైన పనులకోసం జూలై నెలలో బ్యాంక్ లకు వెళ్ళాలనుకునేవారు. ఈ నెలలోని బ్యాంక్ సెలవులను తనిఖీ చేసుకుని, బ్యాంక్ పనులను ముందస్తుగా ప్లాన్ చేసుకోవటం ఉత్తమం.

Bank Holidays

రాష్ట్రాల వారీగా జూలై నెలలో బ్యాంక్ లకు సెలవులజాబితా:

5 జూలై 2023 – బుధవారం – గురు గోవింద్ సింగ్ జయంతి – జమ్మూ మరియు కాశ్మీర్ కు మాత్రమే సెలవు.06 జూలై 2023- గురువారం-MHIP డే, కేవలం మిజోరామ్ లో సెలవు.08 జూలై 2023- శనివారం- రెండవ శనివారం – అన్ని రాష్ట్రాలకు సెలవు.11జూలై 2023- మంగళ వారం- కేర్ పూజ- త్రిపుర రాష్ట్రం లో సెలవు.13 జూలై 2023- గురువారం- భానుజయంతి- సిక్కిం రాష్ట్రం లో సెలవు.
17 జూలై 2023- సోమవారం- యు టిరోట్ సింగ్ డే- మెఘాలయ లో మాత్రమే.22 జూలై 2023- శనివారం-నాలుగవ శనివారం – అన్ని రాష్ట్రాలకు సెలవు.

Telugu panchangam Today: నేటి పంచాంగం… 2 జూలై 2023 వివరాలు ఇవే…

29 జూలై 2023- శనివారం – మొహర్రం – అన్ని రాష్ట్రాలలో సెలవు దినం.31జూలై 2023- సోమవారం- బలిదాన్ దివస్- హర్యానా మరియు పంజాబ్ రాష్ట్రాలకు మాత్రమే సెలవు.
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా క్యాలండర్ ను అనుసరించి వీకెండ్స్ లో కాకుండా జూలై నెలలో 8 బ్యాంకులకు సెలవులు ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వ నెగోషియబుల్ ఇనుస్ట్రుమెంట్స్ చట్టం 1881ప్రకారం సెలవులను మూడు వర్గాలుగా విభజించారు. బ్యాంక్ లకు సెలవులు ఉన్నా ATM కేంద్రాలు,నగదు డిపాజిట్ సౌకర్యం,ఆన్ లైన్ బ్యాంకింగ్,మొబైల్ బ్యాంకింగ్ వంటి బ్యాంక్ సేవలు అందుబాటులోనే ఉంటాయి కనుక బ్యాంక్ లకు సంబంధించిన పనులలో ఎక్కువ మంది ప్రజలకు ఎటువంటి అసౌకర్యం కలుగదు.

Leave A Reply

Your email address will not be published.