Gold Rates Today 04-04-2024 : రికార్డు సృష్టిస్తున్న గోల్డ్ ధరలు.. ఇక బంగారం ఏం కొంటాం.

22 క్యారెట్ల 10 గ్రాముల బంగారంపై రూ.500 పెరగ్గా, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారంపై రూ.600 పెరిగింది. కిలో వెండిపై రూ.1000 పెరిగింది. 

Gold Rates Today 04-04-2024 : బంగారం కొనాలని ఆలోచిస్తున్నారా? ఈ మధ్య బంగారం రేట్లు ఆకాశాన్ని తాకుతున్నాయి. నేడు బంగారం ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. గతంలో కొన్ని రోజులుగా బంగారం ధర భారీగా పెరుగుతున్న విషయం తెలిసిందే. ఈరోజు కూడా ధరలు బాగా పెరిగాయి.

22 క్యారెట్ల 10 గ్రాముల బంగారంపై రూ.500 పెరగ్గా, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారంపై రూ.600 పెరిగింది. కిలో వెండిపై రూ.1000 పెరిగింది.

దేశ ప్రధాన నగరాల్లో Gold Rates Today 04-04-2024 ధరలు ఇలా ఉన్నాయి.

మన దేశ రాజధాని అయిన ఢిల్లీలో 22 క్యారట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.64,750 నమోదు కాగా, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.70,620 వద్ద నమోదయింది.

దేశంలో ప్రధాన నగరాలు అయిన కోల్కత్తా, ముంబై, బెంగుళూరు నగరాల్లో 22 క్యారెట్ల 10 గ్రాముల రూ.64,600 ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.70, 470గా నమోదయింది. చెన్నైలో 22 క్యారట్ల 10 గ్రాముల ధర రూ.65,450, 24 క్యారట్ల బంగారం ధర రూ.70,420 వద్ద నమోదయింది.

Gold Rates Today 04-04-2024

వెండి ధరలు ఇలా : 

దేశంలో పలు ప్రధాన నగరాల్లో వెండి ధర భారీగా పెరిగింది. తెలుగు రాష్ట్రాల్లో ప్రధాన నగరాలు అయిన హైదరాబాద్, విజయవాడ మరియు విశాఖపట్నంలో నమోదయిన వివరాల ప్రకారం, కిలో వెండి ధర రూ.85,300 వద్ద నమోదయింది. దేశంలోని ప్రధాన నగరాల్లో వెండి ధర పరిశీలించినట్లయితే, కోల్కతా, ముంబై నగరాల్లో వెండి  ధర రూ.85,300 వద్ద నమోదయింది. బెంగుళూరులో రూ.79,750 నమోదు అయింది. చెన్నైలో వెండి ధర 81,000 ఉంది. ఢిల్లీలో కిలో వెండి ధర రూ.82,000 వద్ద ఉంది.

తెలుగు రాష్ట్రాల్లో బంగారం, వెండి ధరలు : 

మన తెలుగు రాష్ట్రాల విషయానికి వస్తే బంగారం ధర భారీగా పెరిగింది. ఇవాళ నమోదయిన వివరాల ప్రకారం, హైదరాబాద్, విజయవాడ మరియు విశాఖపట్టణాలలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.64,600 వద్ద నమోదయింది. అయితే, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ. 70,470గా నమోదయింది.

పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు ఒకేరోజులో అనేక మార్పులు చోటు చేసుకుంటాయి. దీనికి తోడు అనేక ప్రాంతాల్లో బంగారం, వెండి ధరలు మారుతూ ఉంటాయి. అందువల్ల, బంగారం కొనుగోలు చేసే సమయంలో ప్రత్యక్షంగా ధరలు ట్రాక్ చేస్తే కచ్చితమైన ధరలు తెలుసుకోవచ్చు.

Gold Rates Today 04-04-2024

Comments are closed.