Curd Face Pack : పెరుగు తో అద్దిరిపోయే ముఖ సౌందర్యం ఇప్పుడు మీ సొంతం..

Telugu Mirror : ప్రతి ఒక్కరి ఇంట్లో పెరుగు ఉంటుంది. రోజువారి ఆహారంలో పెరుగును తీసుకుంటూ ఉంటారు. పెరుగు తినడం వల్ల శరీరానికి ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. పెరుగు అనేక అనారోగ్య సమస్యలు నుండి కాపాడుతుంది. పెరుగు తినడానికి మాత్రమే కాకుండా చర్మాన్ని సంరక్షించుటలో కూడా సహాయపడుతుంది.కొంతమందికి చర్మంలో తేమ తక్కువగా ఉంటుంది. తేమ తక్కువగా ఉండడం వల్ల చర్మ సమస్యలు వస్తాయి. పెరుగును వివిధ రకాలుగా వాడవచ్చు. కానీ ఎలా వాడాలో చాలామందికి తెలియదు.

పెరుగునుచర్మానికి అప్లై చేయడం వలన తేమ అలానే ఉంటుంది. చర్మం కాంతివంతంగా మారుతుంది. పొడి చర్మం ఉన్నవారు ఇంటి చిట్కాలను అనుసరించండి. చర్మంలో తేమ లోపం ఉన్నవారు పెరుగును ఉపయోగించి ఎటువంటి ఫేస్ ప్యాక్ లు చేయాలో తెలుసుకుందాం .

పెరుగు మరియు శనగపిండి: ఒక స్పూన్ పెరుగులో , ఒక స్పూను శనగపిండి వేసి కలపాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి రాయాలి ఆరిన తర్వాత సాధారణ నీటితో కడగాలి. ఈ ప్యాక్ మీ ముఖాన్ని మెరిసేలా చేస్తుంది మరియు చర్మం యొక్క లోపాన్ని నిరోధిస్తుంది.

పెరుగు మరియు తులసి:పది తులసి ఆకులను తీసుకొని ముద్దలా చేయాలి. ఈ పేస్ట్ కు సరిపడినంత, పెరుగు కలిపి ముఖానికి అప్లై చేయాలి. ఆరిన తర్వాత సాధారణ నీటితో కడగాలి. తులసిలో యాంటీ బ్యాక్టీరియల్ మరియు యాంటీ సెప్టిక్ గుణాలు ఉండటం వల్ల మొటిమల్ని కూడా నివారిస్తుంది.

Image credit:Telugu Stop

Pumpkin Seeds: గుమ్మడి గింజల ఆరోగ్య ప్రయోజనాలు తెలిస్తే అస్సలు వదిలిపెట్టరు..!

పెరుగు మరియు బియ్యం పిండి:ఒక స్పూన్ పెరుగులో ఒక స్పూన్ బియ్యప్పిండి వేసి కలిపి పేస్ట్ లా చేయాలి. తర్వాత ముఖానికి అప్లై చేయాలి. ఆరిన తర్వాత సున్నితంగా రుద్దుతూ కడగాలి.

పెరుగు మరియు ఆర్గానిక్ పసుపు:పసుపులో, పెరుగు వేసి పేస్ట్ లాగా చేయాలి‌ దీన్ని ఫేస్ కి అప్లై చేయాలి. ఆరిన తర్వాత కడగాలి. ఈ ప్యాక్ టాన్ ను కూడా నిరోధిస్తుంది.

పెరుగు మరియు తేనె:తేనెలో సహజంగానే తేమ గుణాలు ఉంటాయి‌. పెరుగులో తేనె వేసి మిక్స్ చేసి ముఖానికి అప్లై చేయాలి‌ .ఆరిన తర్వాత కడగాలి.

Natural Face Pack : మచ్చలు పోయి సహజత్వం ఉట్టిపడాలంటే.. ఈ నాచురల్ ఫేస్ ప్యాక్ ట్రై చేయాల్సిందే ..

పెరుగు మరియు ఊక:పిండిని జల్లించిన తర్వాత వచ్చే పొట్టును ఊక అంటారు పెరుగులో ఊక వేసి కలిపి మీ ముఖానికి అప్లై చేయండి .ఆరిన తర్వాత కడగాలి.
ఈ ప్యాక్ లను వాడి మీ చర్మం కోల్పోయిన తేమను తిరిగి పొందండి .ఈ ప్యాక్ లలో ఏది మీ చర్మానికి సరిపోతుందో వాటిని మాత్రమే అనుసరించండి.

Leave A Reply

Your email address will not be published.