April OTT Movies 2024 : వేసవిలో వినోదాల విందు.. ఏప్రిల్‏లో ఓటీటీ లోకి వచ్చే సూపర్‌ హిట్‌ సినిమాలు ఇవే.

ఏప్రిల్ నెలలో మరికొన్ని సినిమాలు ఓటీటీలోకి అందుబాటులోకి రానున్నాయి. వివిధ ప్లాట్‍ఫామ్‍ల్లో అడుగుపెట్టనున్నాయి. ఈనెల ఓటీటీల్లోకి వచ్చే టాప్ తెలుగు చిత్రాలు ఇవే.

April OTT Movies 2024 : ఈసారి సమ్మర్ బొనాంజా అనేది ఓటీటీలోకి వచ్చేసింది. ఎందుకంటే, అసలే ఎగ్జామ్స్ రాసి సమ్మర్ హాలిడేస్ ఎంజాయ్ చేస్తున్న విద్యార్థులకు ఈనెల ఓటీటీలో (OTT) డజన్ల కొద్ది సినిమాలు, వెబ్ సిరీస్ అనేవి అలరించనున్నాయి. అసలే ఎండలతో బయట కాలు పెట్టాలన్న బయపడుతున్న వారికి ఇది ఒక మంచి ఆవకాశమనే చెప్పవచ్చు. అందుచేత చక్కగా ఇంట్లో నుంచే హాయిగా ఈ సినిమాలు, వెబ్ సిరీస్ అనేవి చూసి ఎంటర్టైన్మెంట్ (Entertainment) పొందవచ్చు. ఈ క్రమంలోనే ఈనెల వివిధ రకాల జోనర్ సినిమాలు, ఆకట్టుకునే వెబ్ సిరీస్ అనేవి ప్రేక్షకులనే సందడి చేయడానికి ఓటీటీలోకి రాబోతున్నాయి. మరి వాటిలో థియేటర్లలో కలెక్షన్స్ ను కొల్లగొట్టిన ప్రేమలు, భీమా మరియు ఓం భీమ్ బుష్ వంటి సినిమాలు కూడా ఉన్నాయి.

1. భీమా 

మ్యాచో స్టార్ గోపీచంద్ (Gopichand) హీరోగా ఎన్నో అంచ‌నాల న‌డుమ శివ‌రాత్రి పండుగ‌ను పురస్క‌రించుకుని మార్చి 8న ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చిన చిత్రం ‘భీమా’ (Bheema) ఇప్పుడు డిజిట‌ల్ స్ట్రీమింగ్‌కు రెడీ అవుతోంది. అవుట్ అండ్ మాస్ ,యాక్ష‌న్ జాన‌ర్‌లో వ‌చ్చిన ఈ సినిమా మిక్స్‌డ్ టాక్ తెచ్చుకుంది. ఈ చిత్రానికి కన్నడ దర్శకుడు ఏ హర్ష ద‌ర్శ‌క‌త్వం వహించ‌గా శ్రీసత్యసాయి ఆర్ట్స్‌ బ్యానర్‌పై కేకే రాధామోహన్ ఈ సినిమాను నిర్మించారు.

కేజీఎఫ్‌, సలార్ చిత్రాల‌ ఫేమ్‌ రవి బస్రూర్‌ సంగీతం అందించాడు.  ఈ సినిమా డిజిట‌ల్ రైట్స్‌ను డిస్నీ ఫ్ల‌స్ హాట్‌స్టార్ (Disney Plus Hotstar) ద‌క్కించుకోగా ఈ ఈ సినిమాను ఏప్రిల్ 5 న రిలీజ్ చేయనున్నారు.

2. ప్రేమలు

April OTT Movies 2024

ఇటీవల విడుదలైన ప్రేమలు (Premalu) అనే చిన్న సినిమా సంచలనం సృష్టించింది. మలయాళంలో ఘనవిజయం సాధించిన ఈ యూత్ కంప్లీట్ ఎంటర్ టైనర్ (Entertainer) తెలుగు ప్రేక్షకులను కూడా థ్రిల్ చేసింది. హైదరాబాదు నేటివిటీ నేపథ్యంలో సాగే ప్రేమకథ కావడంతో యువతరం ఈ చిత్రాన్ని ఆస్వాదిస్తున్నారు. ఈ చిత్రాన్ని తెలుగులో చిత్ర నిర్మాత రాజమౌళి తనయుడు కార్తికేయ విడుదల చేయడం గమనార్హం.

ప్రముఖ OTT ప్లాట్‌ఫారమ్ అయిన డిస్నీ ప్లస్, హాట్ స్టార్ ప్రేమలు డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను సొంతం చేసుకుంది. అయితే ఆహా (Aha) తెలుగు వెర్షన్ హక్కులను సొంతం చేసుకుంది. ఈ రొమాంటిక్ లవ్ స్టోరీ ఏప్రిల్ 12 నుండి OTT వీక్షణకు అందుబాటులో ఉంటుంది.

3. ఓం భీమ్ బుష్

April OTT Movies 2024

విలక్షణ నటుడు శ్రీవిష్ణు, ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ ప్రధాన పాత్రలలో నటించిన సినిమా ఓం భీమ్ బుష్. మార్చి 22న థియేటర్లలో రిలీజ్ అయిన ఈ కామెడీ ఎంటర్టైనర్ సూపర్ హిట్ అయ్యింది. ఈ చిత్రానికి శ్రీహర్ష కొనుగంటి దర్శకత్వం వహించారు. ఇప్పుడు ఈ మూవీ ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ అమెజాన్ ప్రైమ్ వీడియోలో (Amazon Prime Video) స్ట్రీమింగ్ కానుంది. అయితే త్వరలోనే స్ట్రీమింగ్ డేట్ అనౌన్స్ చేయనున్నట్లు తెలుస్తోంది.

April OTT Movies 2024

 

Comments are closed.