రోగాల నిలయం ఏసీ రూమ్, అధికంగా ఏసీ వాడితే అంతే సంగతులు

విలాసవంతమైన జీవితానికి అలవాటుపడిన ప్రజలు ఎయిర్ కండిషనర్ గదులలో నివసించటానికి అలవాటుపడి ఏసీ లేనిదే ఉండలేని పరిస్థితిలో ఉంటున్నారు. కానీ చల్లదనం మాటున ఎంతటి అనారోగ్యానికి గురావుతున్నారో గ్రహించలేక పోతున్నారు. ఆరోగ్య రంగా నిపుణులు మాత్రం ఎక్కువ సమయం ఏసీ వాడకూడదు అని అంటున్నారు.

నేటి కాలంలో కొంతమంది ప్రజలు ఎండాకాలంలో మాత్రమే కాకుండా చలికాలం మరియు వర్షాకాలంలో కూడా AC ని ఉపయోగించే వారి సంఖ్య చాలా పెరిగింది. ఇంట్లో, ఆఫీసులలో ఏసీ (Air Conditioner) ని పెట్టించడం అలవాటుగా మారింది. కానీ కొందరు వ్యక్తులు మాత్రం రోజంతా ఏసీ లోనే గడపడం అలవాటు చేసుకుంటున్నారు. బయట వాతావరణంలో కొద్దిసేపు కూడా ఉండలేని పరిస్థితి వారిది. కొద్ది వేడిని కూడా వారి శరీరం (Body) తట్టుకోలేక పోతుంది.

అటువంటి వారు ఎప్పుడూ ఏసి రూమ్ (AC Room) లోనే ఉండడానికి ఇష్టపడుతుంటారు కానీ రోజంతా ఏసీ గదిలో ఉండటం వల్ల అనేక రకాల ఆరోగ్య సమస్యలు (Health Problems) వచ్చే అవకాశం ఉంది. ఏసీ గాలి వల్ల మరియు తేమ ఉన్న వాతావరణం (Weather) లో ఉండటం వల్ల చర్మం పొడిబారుతుంది దీంతోపాటు శ్వాస కోస వ్యాధులు, తలనొప్పి (Head Ache) అవకాశం ఉంది. కాబట్టి ఏసీలో అధిక సమయం గడపడం వల్ల చాలా తేమ (Humidity) ఉంటుంది. కాబట్టి శరీరం నీటిని కోల్పోతుంది‌. అప్పుడు అలసటగా అనిపిస్తుంది. కనుక నీటి (Water) ని అధికంగా తీసుకోవాలి.

AC room is the home of sick people, if AC is used too much, the same thing
image credit : Technical Services Ltd

ఏసీలో వచ్చే చల్లటి గాలి వల్ల శరీరంలో రక్తం గడ్డ కట్టే (Blood Clotting) అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఇది దమనులలో అడ్డంకులు ఏర్పడడానికి కారణం అవుతుంది. ఏసీ గాలి స్వచ్ఛమైన గాలి కాకపోవడం వల్ల ఆక్సిజన్ కొరతను కలుగజేస్తుంది. అలాగే ఏసీలో ఉన్న వ్యక్తులకు మరింత అలసిపోయినట్లుగా అనిపిస్తుంది. రీనైటిస్ (Rhinitis), ముక్కు మూసుకుపోవడం వంటి శ్వాస కోశ (Respiratory) ఇబ్బందులు వస్తాయి. ఏసీ గాలి చల్లగా మరియు పొడిగా ఉండటం వల్ల ముక్కు, గొంతుకు ప్రమాదకరమైనది అని వైద్యులు అంటున్నారు. ఏసీలో ఎక్కువసేపు ఉండటం వలన చర్మం (Skin) పొడిబారుతుంది. దీంతో దురద, చిరాకు వంటివి కూడా వచ్చే అవకాశం ఉంటుంది. చర్మం పొడి బారటం వల్ల ఎప్పుడూ చర్మానికి మాయిశ్చరైజర్ (Moisturizer) ని వాడాలి.

Also Read : రెగ్యులర్ గా సెక్స్ లో పాల్గొనకపోతే ఏం జరుగుతుందో మీకు తెలుసా ?

 దానిమ్మ పండు చేస్తుంది ఆరోగ్యానికి ఎంతో మేలు

ఏసీ లో ఎక్కువసేపు గడిపే వారికి తలనొప్పి కి గురవుతుంటారు. ఎందుకంటే ఏసీ (AC) లో తేమ ఉండటం వల్ల తలనొప్పి, జలుబు (Cold) వంటివి ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది. అందుకే ఆరోగ్య నిపుణులు (Health Professionals) ఏమంటున్నారంటే ఎయిర్ కండీషనర్ (Air Conditioner) ని వాడవచ్చు కానీ అధిక సమయం ఏసీలో గడప వద్దు అంటున్నారు.

కాబట్టి రోజు మొత్తంలో ఏసీలో ఐదు గంటల (Five Hours) కంటే ఎక్కువ సేపు ఉండటం ఆరోగ్యానికి అంతా మంచిది కాదు.

Comments are closed.