whats app heart emoji:వాట్సాప్ లో హార్ట్ ఎమోజీ పంపిస్తే ఇక జైలు కే

Telugu Mirror: ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్(what’s app). ప్రపంచం మొత్తం అందుబాటులో ఉన్న మెసేజింగ్ యాప్ అంటే వాట్సాప్.అయితే వాట్సాప్ ఎప్పటికప్పుడు నూతన అప్డేట్స్ తో వినియోగదారులందరినీ ఆకర్షిస్తుంది. ప్రస్తుత కాలంలో ప్రతి ఒక్కరూ స్మార్ట్ ఫోన్ కలిగి ఉన్నవారే, వాట్సాప్ వాడకుండా ఏ ఒక్కరు ఉండరు. యూత్ లోను వాట్సప్ మంచి క్రేజ్ ని కలిగి ఉంది. గతంలో ఇతరులతో ఏదైనా చెప్పాలన్న, రియాక్ట్ అవ్వాలి అన్నా మెసేజ్ రూపంలో పంపించేవారు కానీ ఇప్పుడు ఎమోజీ(emoji)ల రూపంలో మెసేజ్ లను పంపిస్తున్నారు. ఏ ఫీలింగ్ అయినా ఎమోజీ లోనే చెబుతున్నారు. అయితే ఎమోజీలను ఎలా పడితే అలా వాడితే జైలుకు వెళ్లాల్సి వస్తుంది. వినటానికి ఆశ్చర్యంగా ఉన్న ఈ కొత్త విషయం ఎక్కడ నుంచి వచ్చింది అనేది తెలుసుకుందాం.

వాట్సాప్ ను ఉపయోగించకుండా రోజు ముగియటం కష్టంగా ఉన్న పరిస్థితులలో మనం జీవిస్తున్నాం. కుటుంబంతో లేదా ఇతరులు ఎవరితోనైనా ఏదైనా విషయం పై సంభాషించాలన్న మెసేజ్ రూపంలో చెప్పాలి అన్నా కానీ వాట్సాప్ ని ఎక్కువగా ఉపయోగిస్తున్నాం. ఇక ప్రేమికుల సంగతి అయితే చెప్పే పని లేదు. సంభాషణల కంటే ఎక్కువగా ఎమోజీలతోనే తమ ప్రేమ సందేశాలను చెప్పుకుంటూ ఉంటుంటారు. ఎక్కువగా హార్ట్ సింబల్ ఎమోజీలను వాడటం ద్వారా ఎదుటి వ్యక్తులను ఇంప్రెస్ చేస్తుంటారు. అయితే హార్ట్ సింబల్(heart symbol) ఎమోజీలను ఎలా పడితే అలా ఇష్టం వచ్చినట్లు పంపిస్తే జైలుకు పోవలసి వస్తుందట.

Image credit:Zee news india

వాట్సాప్ లో రెడ్ హార్ట్ సింబల్ ఎమోజీని ఉపయోగిస్తే అది వేధింపులతో సమానమని సౌదీ అరేబియా ఇటీవల కఠిన నిర్ణయం తీసుకుంది. హార్ట్ సింబల్ ఎమోజిని ఎవరికైనా పంపితే రెండేళ్ల జైలు శిక్ష మరియు రూ. 20 లక్షల జరిమానా విధిస్తామని ప్రకటించింది. ఎదుటి వ్యక్తి అనుమతి లేకుండా వాట్సాప్ లో హార్ట్ సింబల్ ఎమోజి పంపిస్తే కఠిన చర్యలను ఎదుర్కొవలసిందేనని తెలిపింది. అంతేకాకుండా ఇదే నేరాన్ని పునరావృతం చేస్తే రూ.60 లక్షల జరిమానా తో పాటు ఐదేళ్ల వరకు జైలు శిక్ష విధిస్తామని సౌదీకి చెందిన యాంటీ ఫ్రాడ్ అసోసియేషన్ సభ్యుడు అల్ ముతాజ్ కుత్బీ అధికారికంగా ప్రకటించాడు. కఠినమైన ఆంక్షలు,రూల్స్ అమలు అయ్యే సౌదీ అరేబియాలో(saudi arabia) ఇలాంటి కొత్త తరహా నిభంధనలను తెచ్చిపెట్టింది అక్కడి ప్రభుత్వం. దీంతో అపరిచిత వ్యక్తులతో చాటింగ్ చేయడం, అనవసరమైన చిక్కుల్లో పడకుండా వాట్సాప్ వినియోగాన్ని మరింత సురక్షితంగా మార్చేందుకు ఈ కొత్త ప్రయత్నం అని వివరించారు.

Leave A Reply

Your email address will not be published.