కర్వా చౌత్‌ లో నోరూరించే రవ్వ కేసరి, ఇంట్లోనే చాలా సులువుగా తయారు చేసుకోండి

కర్వా చౌత్‌ సందర్భంగా భార్యలు తమ జీవిత భాగస్వాముల కోసం సౌత్ ఇండియన్ స్వీట్ అయిన రవ్వ కేసరిని తయారు చేయవచ్చు. ఈ అద్భుతమైన రవ్వ కేసరి తయారు చేయడం చాలా సులభం మరియు కర్వా చౌత్‌కు సరైన వంటకం.

Telugu Mirror : రవ్వ కేసరి అనేది పూజలు, పండుగలు మరియు శుభ సందర్భాలలో అందించే తీపి పదార్ధం. ఉత్తర భారతదేశంలోని వివాహిత స్త్రీలు తమ భర్తల ఆయుశ్హును (జీవితకాలం) పెంచడానికి కర్వా చౌత్‌లో సూర్యోదయం నుండి చంద్రోదయం వరకు ఉపవాసం ఉంటారు. ఉత్సాహంగా జరుపుకునే ఈ వేడుకకు ప్రత్యేకమైన వంటకాలు తయారు చేస్తారు. ఈ సందర్భంగా భార్యలు తమ జీవిత భాగస్వాముల కోసం సౌత్ ఇండియన్ స్వీట్ అయిన రవ్వ కేసరిని తయారు చేయవచ్చు. ఈ అద్భుతమైన వంటకం తయారు చేయడం చాలా సులభం మరియు కర్వా చౌత్‌కు సరైన వంటకం.

రవ్వ కేసరి తయారు చేయడానికి కావాల్సిన పదార్ధాలు మరియు తయారీ విధానం తెలుసుకుందాం..

కావాల్సిన పదార్ధాలు :

1. రవ్వ – 100 గ్రాములు
2. చెక్కర / పంచదార – 1/4 కప్పు
3. పాలు – అర లీటర్
4. గుమ్మడి కాయ గింజలు – ఒక టీ-స్పూన్
5. నెయ్యి – ఒక టేబుల్ స్పూన్
6. యాలుకల పొడి – ఒక టీ-స్పూన్
7. డ్రై -ఫ్రూట్స్ – 100 గ్రాములు .
8. కుంకుమ పువ్వు – కొద్దిగా

Also Read : Cinnamon : వారెవ్వా! దాల్చిన చెక్క, మేని నిగారింపులను ఇస్తుంది పక్కా. అబ్బురపరచే ప్రయోజనాల దాల్చిన చెక్క

rava-kesari-in-karva-chauth-very-easy-to-make-at-home
Image Credit : Youtube

తయారీ విధానం ఇప్పుడు చూద్దాం:

1. ముందుగా , ఒక పాన్‌లో నెయ్యి (Ghee) వేసి వేడి చేయండి. నెయ్యి వేడెక్కిన తర్వాత అందులో బాదం, జీడిపప్పు వేసి అవి బంగారు రంగు వచ్చేవరకు ఒక 2 నిముషాల పాటు వేయించాలి. తర్వాత వేయించిన డ్రై ఫ్రూట్స్ ని ఒక ప్లేట్ లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి.

2. అదే పాన్‌లో 1 కప్పు రవ్వను ఒక 5 నిమిషాల వరకు బంగారు గోధుమ రంగు వచ్చేవరకు వేయించాలి. రవ్వ మరీ ఎక్కువుగా వేగకుండా ఉండటానికి క్రమం తప్పకుండా రవ్వను కలుపుతూ ఉండాలి.

3.వేయించిన రవ్వలో పాలు (Milk) పోసి ముద్దలు లేకుండా బాగా కలుపుకోవాలి. రవ్వ మృదువుగా మరియు మొత్తం పాలను పీల్చుకునే వరకు ఆ మిశ్రమాన్ని కొన్ని నిమిషాలు ఉడికించాలి.

4. ఆ తర్వాత 1 కప్పు చక్కెర (Sugar) తీసుకొని ఆ రవ్వ మిశ్రమంలో కలపండి. రవ్వ గడ్డలు ఉండకుండా మంచిగా మృదువుగా ఉండడానికి కొంచెం సేపు కలుపుతూ ఉండండి.కొద్దిగా కుంకుమపువ్వు మరియు కొంచెం యాలకుల పొడిని కలపండి.

5. పంచదార పూర్తిగా కరిగి ఈ రవ్వ మిశ్రమం మొత్తం దగ్గరకి అయ్యేదాకా ఒక 10 నిముషాలు సన్నని మంటపై ఉడికించండి. మరో రెండు నిమిషాలు ఉంచి వేయించిన డ్రై ఫ్రూట్స్‌ మరియు గుమ్మడి గింజలు వేసి ఒకసారి కలిపి స్టవ్ ఆఫ్ చేసి ఒక బౌల్ లో సర్వ్ చేయండి. టేస్టీ టేస్టీ గా ఉండే రవ్వ కేసరి రెడీ.

Also Read : Papaya : మీకు తెలుసా? బొప్పాయి పండు తిన్న తరువాత అస్సలు తినకూడని పదార్ధాలు

Comments are closed.