Vaastu Tips : ఇంటి ప్రధాన ద్వారం వద్ద ఇలా చేయండి లక్ష్మీ కటాక్షం పొందండి

వాస్తు శాస్త్రం ఇంట్లో మరియు జీవితంలో మంచి, చెడులను నిర్ధారిస్తుంది. ఇది శాస్త్రం కాబట్టి దీనిని పాటించడం అవసరమైనది గా పరిగణించవచ్చు.  వాస్తు శాస్త్ర ప్రకారం ఇంటి ప్రధాన ద్వారం వద్ద కొన్ని నియమాలను ఆచరించినట్లయితే జీవితంలో సుఖ,సంతోషాలను పొందవచ్చు.

వాస్తు శాస్త్రం ఇంట్లో మరియు జీవితంలో మంచి, చెడులను నిర్ధారిస్తుంది. ఇది శాస్త్రం కాబట్టి దీనిని పాటించడం అవసరమైనది గా పరిగణించవచ్చు.

వాస్తు శాస్త్ర (Vaastu Shastra) ప్రకారం ఇంటి ప్రధాన ద్వారం వద్ద కొన్ని నియమాలను ఆచరించినట్లయితే జీవితంలో సుఖ,సంతోషాలను పొందవచ్చు. అంతేకాకుండా వీటిని పాటించడం వలన జీవితంలో ఆర్థిక అభివృద్ధి (Economic development), సిరిసంపదలు వచ్చేలా చేస్తాయి.
ప్రధాన ద్వారం అనగా సింహద్వారం దగ్గర ఇటువంటి వస్తువులను ఉంచినట్లయితే లక్ష్మీదేవి ఆ ఇంట్లో ఉన్నవారికి లభిస్తుంది. లక్ష్మీదేవి అనుగ్రహం పొందడం కోసం ఏయే వస్తువులను ఉంచాలో తెలుసుకుందాం.

Also Read : Vistu tips for house: ఈ వాస్తు చిట్కాలు పాటించండి.. అదృష్టాన్ని స్వాగతించి సుఖ సంతోషాలకు వారధి కట్టండి..

దైవం అనుగ్రహం పొందాలంటే ఇంటి ప్రవేశద్వారం దగ్గర లక్ష్మి పాదాల స్టిక్కర్ లను అతికించాలి. ఇలా చేయడం వల్ల ఇంట్లో సంపద, శ్రేయస్సు (Prosperity), అభివృద్ధి పెరుగుతుంది. ఈ పాదాలను అతికించడం వల్ల దైవం అనుగ్రహం ఆ ఇంటిపై ఎల్లప్పుడూ ఉంటుంది. గ్రహ దోషాలను, దుష్ప్రభావాలను కూడా తొలగిస్తుంది.

Vaastu Tips : Do this at the main entrance of the house to get Lakshmi Kataksha
Image Credit : Zee News -india.com

ఒక గాజు గిన్నె (glass bowl) తీసుకొని దానిలో నిండుగా నీళ్ళు పోయాలి అందులో కొన్ని పూలరేకులను వేయడం వలన సంపద శ్రేయస్సును ఆకర్షిస్తుంది ఇలా ఉంచడం వలన ప్రవేశ ద్వారం దగ్గర చాలా అందంగా మరియు అది చూసిన వారిని ఆకట్టుకునేలా ఉంటుంది. గాజు గిన్నెలో నీళ్లు ఉండటం వలన వేడి మరియు విద్యుత్ లకు వ్యతిరేక వాహకం కాబట్టి ఇంటిలో ప్రవేశించే ప్రతికూల శక్తిని (Negative energy) అడ్డుకునే వాహకం గా నీరు పనిచేస్తుంది. ఈ విధంగా చేయడం వల్ల కుటుంబ సభ్యులు ఆరోగ్యంగా ఉండటంలో సహాయపడుతుంది.

ఇంట్లో ఉన్న మిగిలిన తలుపుల కంటే ప్రవేశద్వారం తలుపు పెద్దదిగా ఉంటే శుభప్రదంగా పరిగణించబడుతుంది. తలుపుని సవ్య దిశ (clockwise direction) లో తెరవడం వలన ప్రతికూల శక్తిని అడ్డుకుంటుంది. ఇంట్లోకి ఎప్పుడూ గాలి, వెలుతురు వచ్చేలా గుమ్మం ను కొద్దిగా ఎత్తుగా ఉండేలా ఏర్పాటు చేసుకోవాలి.

Also Read : Vastu tips for your house: మీ ఇంట్లో ప్రతికూల శక్తిని తరిమేసి..సానుకూల శక్తి ని ఆహ్వానించాలంటే ఈ వాస్తు టిప్స్ పాటించాల్సిందే..

గుమ్మాలకు చెట్టు ఆకులతో తయారు చేసిన తోరణాలను వ్రేలాడ దీయాలి. మామిడి ఆకులు లేదా రావి, అశోక చెట్టు ఆకులతో తోరణాలను ఏర్పాటు చేయడం వలన ఇంటిలో ఉన్న నెగిటివ్ ఎనర్జీ ని అరి కడుతుందని నమ్మకం. ఆకులు ఎండిపోయిన తర్వాత వాటిని తీసేసి కొత్త ఆకులను పెట్టవచ్చు. ఇలా చేయడం వలన చెడు దృష్టి (bad vision) నుండి ఇంటిని రక్షించడానికి సహాయపడతాయి.

ఇంట్లో గడియారం ఏ దిశలో పెట్టడం మంచిది? వాస్తు శాస్త్రం ఏం చెబుతోంది.

ఇంటి ప్రవేశ ద్వారం (the entrance) వద్ద స్వస్తిక్ ను ఏర్పాటు చేసుకోవడం చాలా శుభప్రదంగా పరిగణించబడుతుంది. ఈ విధంగా చేయడం వలన ఆ ఇంటిలో నివసించే వారికి అదృష్టం మరియు శ్రేయస్సును తీసుకువస్తుంది. స్వస్తిక్ గుర్తు వ్యాధులను, దుఃఖాన్ని కూడా తగ్గించడంలో ఉపయోగపడుతుంది. ఆ ఇంటిలో ఉన్న వారికి ఆనందం, శ్రేయస్సును అందిస్తుంది. కాబట్టి వాస్తు శాస్త్రం పై నమ్మకం ఉన్నవారు ఇటువంటి కొన్ని పనులు చేయడం వలన శుభ ఫలితాలను పొందవచ్చు

Comments are closed.