VAASTU TIPS : లక్ష్మీ కటాక్షం పొందాలంటే ఈ మూడు వస్తువులు ఇంట్లో ఇలా ఉండాలి!

వాస్తు శాస్త్రం ప్రకారం ఇంట్లో ఉండే వస్తువుల విషయంలోనూ తప్పకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. లేకపోతే లక్ష్మీదేవికి కోపం వస్తుందని పెద్దలు కూడా చెబుతుంటారు. కాబట్టి ఇంట్లో ప్రతి వస్తువును వాస్తు నియమాలకు అనుగుణంగా ఏర్పాటు చేసుకోవడం మంచిది.

హిందూ ధర్మంలో వాస్తుకు ప్రథమ స్థానం ఉందని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. వాస్తు శాస్త్రం ప్రకారం ఇంటి నిర్మాణం (Construction) సమయంలోనే కాదు, ఇంట్లో ఉండే వస్తువుల విషయంలోనూ తప్పకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. లేకపోతే లక్ష్మీదేవికి కోపం వస్తుందని పెద్దలు కూడా చెబుతుంటారు. కాబట్టి ఇంట్లో ప్రతి వస్తువును వాస్తు నియమాలకు అనుగుణంగా ఏర్పాటు చేసుకోవడం మంచిది.

వాస్తు పండితులు (Scholars) చెప్పిన ప్రకారం, ఇంట్లో కొన్ని రకాల వస్తువులు ఎప్పుడూ ఖాళీగా ఉండకూడదని చెబుతున్నారు. అలా ఉంటే ఇంట్లో ఆర్థిక ఇబ్బందులు కలుగుతాయి అని హెచ్చరిస్తున్నారు.

ప్రతి ఇంట్లో ఎప్పుడూ ఖాళీగా ఉండకూడని మూడు వస్తువులు ఉన్నాయి. అవి ఏమిటో తెలుసుకుందాం.

VAASTU TIPS : To get Lakshmi Kataksha these three things should be in the house!
image credit : Telugu Mirror

లాకర్ :

డబ్బులు దాచుకునే లాకర్ (Locker) లేదా పర్స్ ఎప్పుడూ కూడా ఖాళీగా ఉండకూడదు. వీటిలో లక్ష్మీదేవి నివాసం ఉంటుంది. లక్ష్మీదేవి నివాసం ఉండే ప్రదేశాలు ఖాళీగా ఉన్నట్లయితే ఆ దేవతకు ఆగ్రహం వచ్చి మీ నుంచి దూరంగా వెళ్లిపోతుంది.

ధాన్యం:

ఇంట్లో ధాన్యం (grain) నిలువ చేసుకునే సంచి లేదా పాత్ర ఎప్పుడు ఖాళీగా ఉండకూడదు. ఇలా ఉంటే ప్రతికూలతకు గుర్తు. ఇంట్లో ధాన్యం లేకపోతే ఆ ఇంట్లో కరువు వచ్చే అవకాశం ఉంటుందని, కరువు ఉన్నచోట లక్ష్మి దేవి నివాసం ఉండదని వాస్తు శాస్త్ర నిపుణులు చెబుతున్నారు.

త్రాగు నీరు:

ఇంట్లో మంచినీళ్ల పాత్రలు ఎప్పుడూ ఖాళీగా ఉండకూడదు. నీటి పాత్రలు ఖాళీగా ఉంటే ఆ ఇంట్లో ప్రతికూల ప్రభావం ఏర్పడుతుంది. అలాగే పేదరికం వస్తుందని వాస్తు నిపుణులు (Experts) చెబుతున్నారు.

Also Read : Vaastu Tips : ఇంటి ప్రధాన ద్వారం వద్ద ఇలా చేయండి లక్ష్మీ కటాక్షం పొందండి

నీటి పాత్రలు ఖాళీగా ఉండే ఇంట్లోనే కాకుండా, నీటిని వృధాగా పార బోసే వారి ఇంట్లో కూడా లక్ష్మీదేవి అనుగ్రహం (grace) ఉండదు.

Also Read : Vaastu Tips : ఏ దిక్కున ఏ రంగు డోర్ మ్యాట్ ఉంచితే లక్ష్మీ దేవి అనుగ్రహిస్తుంది? తెలుసుకోండి!

కాబట్టి వాస్తు శాస్త్రం అంటే నమ్మకం ఉన్నవారు వీటిని పాటించండి. శుభ ఫలితాలను పొందండి. ఆర్థికం (financial) గా అభివృద్ధి (Development) పొందండి.

గమనిక:
ఈ కథనం వాస్తు శాస్త్రంలో పేర్కొన్న వివరాల ఆధారంగా వ్రాయబడినవి. వీటికి ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి.

Comments are closed.