Thai N. Gok : 60 సంవత్సరాలుగా నిద్రపోని వియత్నాం వాసి ..

Telugu Mirror : మానవజీవన విధానంలో ఒక మనిషి సంపూర్ణ ఆరోగ్య వంతునిగా జీవించాలంటే ఆరోగ్యకరమైన జీవనశైలిని కలిగి ఉండాలి.ఆహారం,వ్యాయామం, వత్తిడి లేని జీవితం,వేళకు నిద్ర ఇది ఆరోగ్య కరమైన జీవన శైలి.అయితే శరీరానికి విశ్రాంతి ఇవ్వడం ప్రాధాన్యత కలిగిన అంశం.దేహానికి నిద్ర ఎంతో అవసరం.నిద్ర లేమి వలన ఎన్నో అనారోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఉంది.నిద్ర ద్వారానే శరీరం పునరుత్తేజం కలిగి మనల్ని ముందుకు నడుపుతుంది.సరైన నిద్ర లేకుండా మానవ దేహం పనిచేయడం చాలా ఇబ్బందికరమైన విషయం.ఏదో అప్పుడప్పుడు నిద్ర పోకుండా ఉంటేనే తరువాత రోజు శరీరం అల్లకల్లోలం అవుతుంది.

అటువంటిది 60 సంవత్సరాలుగా నిద్రపోని వ్యక్తి ఉన్నాడంటే ? నమ్మశక్యం కాని ఈ విషయాన్ని తెలుసుకుందాం.వియత్నాం కి చెందిన థాయ్ ఎన్ గోక్ అనే వ్యక్తి తాను 60 సంవత్సరాలుగా మెలకువగానే ఉంటున్నట్లు ఒక యూట్యూబ్ వీడియోలో చెప్పినాడు.థాయ్ ఎన్ గోక్ ప్రస్తుత వయస్సు 80 సంవత్సరాలు. కొన్ని దశాబ్దాల క్రితం, అతను 20 సంవత్సరాల వయసులో ఉండగా తీవ్ర జ్వరంతో బాధపడ్డానని,అప్పటి నుంచి నిద్రపట్టదని ఎన్ గోక్ తెలిపాడు.1962 నుండి అవిశ్రాంతంగా ఉంటున్న ఒక అరుదైన కేసు గా అతనిని చూడవచ్చు.

OnePlus Nord 3 5G : వన్‌ప్లస్ నార్డ్ 3 సిరీస్ 5G ఫోన్ …

కొన్ని మీడియా సంస్థలు వెలువరించిన నివేదికల ప్రకారం,థాయ్ ఎన్ గోక్ నిద్ర పోవడం ఇంతవరకు అతని కుటుంబం,అతని భార్య,పిల్లలు మరియు అతని స్నేహితులతో సహా ఎవ్వరూ చూసిన వాళ్ళు లేరు.అలాగే ఇప్పటి వరకు ఎంతోమంది వైద్య నిపుణులు కూడా ఎన్ గోక్ ని పరీక్షించారు కానీ ఎవరూ అతను నిద్ర పోయాడని నిరూపించలేకపోయారు. ఎన్ గోక్ ఇన్ సోమ్నియా అనే నిద్రలేమి వ్యాధితో శాశ్వతంగా బాధపడుతున్నాడని,తన నిద్రలేమి తనం తాత్కాలికమైనదని అతను ఆశిస్తున్నాడు కానీ ఆరు దశాబ్దాలుగా అతను నిద్రలేకుండా ఉన్నానని తెలిపాడు.

సరైన నిద్ర లేకపోతే ఏ పని చేయాలన్నా ఎంతో అసౌకర్యంగా ఉంటుంది కానీ ఆశ్చర్య కరంగా 80 సంవత్సరాల వృద్దుడు నిద్రలేమి వలన ఏ విధమైనటువంటి వైద్య పరమైన సమస్యలను ఎదుర్కోలేదు.థాయ్ ఎన్ గోక్ ఎంతో ఆరోగ్యంగా ఉన్నాడు,మంచి పౌష్టికాహారంతో తన ఆరోగ్యాన్ని కాపాడుకోవడం అలానే తనకు ఇష్టమైన వైన్ ని తాగుతున్నాడు కానీ వైన్ తాగిన తరువాత కూడా మత్తుగా ఉన్నట్లు లేదా నిద్రలోకి జారుకున్నట్లు కూడా ఎప్పుడూ కనిపించలేదు.

వియత్నాం కి చెందిన న్యూస్ వెబ్ సైట్ థాన్ నీన్ తో మాట్లాడుతూ, నా ఆరోగ్యం పై నిద్రలేమి ప్రభావం ఉందో లేదో తెలియదు కానీ నేను ఇప్పటికీ ఆరోగ్యంగానే ఉన్నానని ఇప్పటికీ ఇతరులవలె వ్యవసాయ పనులను చేయగలను అని థాయ్ ఎన్ గోక్ తెలిపాడు.డ్రూ బిన్ స్కీ అనే యూట్యూబర్ వియత్నాంలో థాయ్ ఎన్ గోక్ కోసం వెతికాడు చివరికి అతనిని ట్ర్రాక్ చేయగలిగాడు. థాయ్ ఎన్ గోక్ ని విపులంగా ఇంటర్వ్యూ చేశాడు.థాయ్ ని చేసిన ఇంటర్వ్యూ ని డ్రూ బిన్ స్కీ ఫిబ్రవరి 2 న యూట్యూబ్ లో పోస్ట్ చేయగా 3.6 మిలియన్లకు పైగా ప్రజలుఈ వీడియోని చూశారు.ఒక మనిషి ఏ కారణం చేత నిద్రపోలేడో ఎవరికీ అంతుచిక్కదని ఈ వీడియో వలన తెలుస్తుంది.

Iscon Golden Temple : హైదరాబాద్ లో హరే కృష్ణ దేవాలయం.. అద్భుత చరిత్ర

యూట్యూబర్ డ్రూ బిన్ స్కీ వృద్దుడైన వియత్నామీ థాయ్ ఎన్ గోక్ ని ఇంటర్వ్యూ చేసిన వీడియోని చూసిన ప్రజలు ఆశ్చర్యపోయి వారి అభిప్రాయాలను కామెంట్ బాక్స్ లో వ్రాశారు.ఒక యూట్యూబ్ వీక్షకుడు తన అభిప్రాయాన్ని “మొదటిగా ఈ వ్యక్తి భూమిపై బ్రతికిన వారిలో ఎక్కువ సమయం కలిగి ఉన్నాడు.” అని కామెంట్ వ్రాశాడు. మరొక వ్యక్తి ఆ వృద్దునిపై తన అభిప్రాయాన్ని ఇలా వ్యక్తపరిచాడు. “మనిషి జీవిత కాలాన్ని మేల్కొని వుండే సమయంతో లెక్కిస్తారు.ఈ లెక్కన ఈ వ్యక్తి ఇప్పటివరకు జీవించిన వారిలోకెల్లా అత్యంత వృద్దుడు.అతను ప్రపంచంలో ఉన్నవారందరికంటే ఎక్కువ జీవితాన్ని కలిగి ఉన్నాడు,అని కామెంట్ బాక్స్ లో స్పందించాడు.

Leave A Reply

Your email address will not be published.