Eye Glasses : మీ కళ్ళద్దాలను సురక్షితంగా మరియు పరిశుభ్రంగా ఎలా శుభ్రం చేయాలో తెలుసుకోండి

కళ్లద్దాలపై పడిన గీతలను, మరకలను తొలగించడానికి ఇంటి చిట్కాలను తెలియజేస్తున్నాం. వీటిని ఉపయోగించి కళ్లద్దాలపై ఉన్న గీతలను, మరకలను తొలగించుకోవచ్చు.

ప్రస్తుత రోజుల్లో అందరూ కళ్లద్దాలను (Eye Glasses) వాడుతున్నారు. ఎందుకంటే ప్రతి ఒక్కరు ఎక్కువగా మొబైల్స్ (Mobiles) మరియు లాప్ టాప్ (Lap Top), వీడియో గేమ్స్ వాడకం వలన చిన్న వయసు నుండే కళ్ళజోడు వాడాల్సిన పరిస్థితి వచ్చింది. అయితే కొందరు ఫ్యాషన్ కోసం కళ్లద్దాలను వాడుతుంటారు. మరి కొందరు కాంటాక్ట్ లెన్స్ ని వాడుతుంటారు. అయితే వాటి వల్ల కళ్లకు చికాకు అనిపిస్తుంది. కాబట్టి ఎక్కువ మంది కళ్ళజోడు వాడటానికే ఆసక్తి చూపుతుంటారు.

ప్రతిరోజు కళ్లద్దాలు పెట్టుకుంటూ ఉండటం వల్ల వాటిపై దుమ్ము,ధూళి పేరుకుపోతుంది. అయితే వీటిని క్లాత్  (Cloth) తో తుడిస్తే పోతాయి.కానీ కళ్లద్దాలపై గీతలు, మచ్చలు కూడా పడుతుంటాయి. వీటిని క్లాత్ తో తుడిస్తే అంత తేలికగా వదలవు. వీటిని శుభ్రం  (Clean) చేయడం కొంచెం కష్టమే. ఇలా గీతలు మచ్చలు పడినప్పుడు పోవడం కష్టం కాబట్టి కొంతమంది కొత్తవి కొనుక్కుంటూ ఉంటారు.

కాబట్టి ఈరోజు కథనంలో కళ్లద్దాలపై పడిన గీతలను, మరకలను తొలగించడానికి ఇంటి చిట్కాలను (Home Remedies) తెలియజేస్తున్నాం. వీటిని ఉపయోగించి కళ్లద్దాలపై ఉన్న గీతలను (Scratches), మరకలను తొలగించుకోవచ్చు.

Also Read : Dazzler Eyes : చిన్న కళ్ళ కోసం పెద్ద టిప్స్ .. ఇక అందరి చూపు ఇప్పుడు మీ వైపు..

Eye Brows : మహిళల అందాన్ని మరింత పెంచే ఒత్తైన కనుబొమ్మలు కావాలంటే ఇలా చేస్తే సరి!

ఆ చిట్కాలు ఏమిటో తెలుసుకుందాం.

బేకింగ్ సోడా:

బేకింగ్ సోడా (Baking Soda) ని ఉపయోగించి కళ్లద్దాలపై ఉన్న మరకలు, గీతలను తొలగించవచ్చు. ఒక చిన్న గిన్నె తీసుకొని అందులో కొద్దిగా నీళ్లు మరియు కొద్దిగా బేకింగ్ సోడా వేసి కలపాలి. ఒక కాటన్ క్లాత్  (Cotton Cloth) తీసుకొని ఈ మిశ్రమంలో ముంచి కళ్ళద్దాలపై నెమ్మదిగా తుడవాలి. ఇలా చేయడం వల్ల కళ్లద్దాలపై ఉన్న గీతలు, మరకలు తొలగిపోతాయి.

టూత్ పేస్ట్:

కళ్లద్దాల మీద ఉన్న గీతలను తొలగించుకోవడం కోసం ఉపయోగపడుతుంది టూత్ పేస్ట్ (Tooth Paste) దంతాలను ఎలా తెల్లగా మారుస్తుందో కళ్లద్దాలను కూడా అలాగే తెల్లగా మారుస్తుంది. కాటన్ క్లాత్ తీసుకొని దానిపై టూత్ పేస్ట్ వేసి కళ్లద్దాలపై సున్నితంగా రుద్దాలి. ఆ తర్వాత వేరొక కాటన్ క్లాత్ తీసుకొని నీళ్లలో నుంచి కళ్ళద్దాలను శుభ్రం చేస్తే సరి. కళ్లద్దాలపై ఉన్న గీతలు, దుమ్ము, మరకలు పోయి అద్దాలు తెల్లగా, శుభ్రంగా కనిపిస్తాయి.

డిష్ సోప్:

Eye Glasses : Learn how to clean your glasses safely and hygienically
Image Credit : Insight Vision Center

పాత్రలు శుభ్రం చేసే సబ్బు (Soap) ని ఉపయోగించి కూడా లెన్స్ (Lens) మరియు కళ్లద్దాలను శుభ్రపరచుకోవచ్చు. ఇలా చేయడం వల్ల ఎటువంటి ఇబ్బంది ఉండదు అని నిపుణులు చెబుతున్నారు. డిష్ సోప్ ను చేతివేళ్ల కు అంటించుకొని నెమ్మదిగా లెన్స్ లేదా కళ్ళద్దాలపై రుద్దాలి. తర్వాత మెత్తటి క్లాత్ సహాయంతో తుడవాలి. ఈ విధంగా చేయడం వల్ల లెన్స్ లేదా కళ్లద్దాలపై ఉన్న గీతలు, మరకలను తొలగించుకోవచ్చు. అయితే డిష్ సోప్ వాడేటప్పుడు “సిట్రస్” (Citrus) తో తయారు చేసిన సబ్బుని ఉపయోగించకూడదు.

Comments are closed.