నింగిలోకి దూసుకెళ్లిన ఆదిత్య -L1 సూర్యుని రహస్యాలను చేదించడమే తరువాయి.

భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ సూర్యుని పై జరిపే పరిశోధనలకు తొలి అడుగు వేసింది. ఇస్రో ఈ రోజు ప్రయోగించిన మిషన్ త్వరలో నిర్దేశించిన లక్ష్యాలపై పరిశోధన చేస్తుంది.

Telugu Mirror: భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ సూర్యుడి పై భారత ప్రయోగాలకు తొలి అడుగు విజయ వంతంగా వేసింది. నేడు ప్రయోగించిన ఆదిత్య -L1 ప్రయోగం విజయవంతం అయింది. నిర్దేశించిన కక్ష్యలో ఉపగ్రహాన్ని పీఎస్ఎల్వీ ప్రవేశపెట్టిందని ఇస్రో ఛైర్మన్ సోమనాథ్ (Isro Chairman Somanadh) ప్రకటించారు. సుమారు గంట ప్రయాణం తరువాత రాకెట్ నుంచి ఉపగ్రహం విడిపోతుందని ఇస్రో పేర్కొంది.

సూర్యుని యొక్క వివిధ అంశాలను అన్వేషించడం లక్ష్యంగా భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ PSLV-C57.1 రాకెట్ ఆదిత్య-L1 ఆర్బిటర్‌ను ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీహరికోటలోని సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం నుండి ఉదయం 11:50 గంటలకు ప్రారంభించింది. చంద్రుని దక్షిణ ధృవం దగ్గరిలో ల్యాండ్ అయిన మొదటి దేశంగా చరిత్ర సృష్టించిన కొద్ది రోజులలోనే భారత దేశం సూర్యునిపై తన మొదటి పరిశీలన మిషన్ ను ప్రయోగించింది. ఈ మిషన్ సూర్యుని అంతుచిక్కని విశ్వ రహస్యాలను లోతైన అధ్యయనం చేయడం కోసం తయారు చేయబడిన ఏడు వేర్వేరు పేలోడ్‌లను కలిగి ఉంటుంది. వీటిలో నాలుగు పేలోడ్‌లు సూర్యుని యొక్క కాంతిని గమనిస్తాయి, మిగిలిన మూడు ప్లాస్మా మరియు అయస్కాంత క్షేత్రాల ఇన్-సిటు నిర్ణీత పరిమితులను(పారామితులను)కొలుస్తాయి

భూమి నుండి సూర్యుని దిశలో 1.5 మిలియన్ కి.మీ దూరంలో ఉన్న లాగ్రాంజియన్ పాయింట్ 1 (L1) చుట్టూ ఒక హాలో కక్ష్య కోసం ఆదిత్య -L1 నిర్దేశించబడింది. ఈ దశను చేరుకునేందుకు సుమారు నాలుగు నెలల సమయం పడుతుందని అంచనా

ఆదిత్య – L1 విజిబుల్ ఎమిషన్ లైన్ కరోనాగ్రాఫ్ (VELC) , ISRO సహకారంతో హోసాకోట్‌లోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఆస్ట్రోఫిజిక్స్ సెంటర్ ఫర్ రీసెర్చ్ అండ్ ఎడ్యుకేషన్ ఇన్ సైన్స్ టెక్నాలజీ (CREST )క్యాంపస్‌లో సమన్వయం చేయబడింది. పరీక్షించబడింది మరియు ప్రామాణికతను నిర్ధారించబడింది. ఇది అతిపెద్దది మరియు టెక్నాలజీ పరంగా సవాలుగా ఉండే పేలోడ్ ఆదిత్య-L1.

భారతదేశం యొక్క సౌర మిషన్ సూర్యుని యొక్క కరోనా యొక్క భౌతిక శాస్త్రం మరియు దానియొక్క సౌర వాతావరణ విధానం, సౌర గాలి పంపిణీ మరియు ఉష్ణోగ్రత అనిసోట్రోపి మరియు కరోనల్ మాస్ ఎజెక్షన్స్ (CME) మూలాలు మరియు సౌర మంటలు, అలాగే భూమికి సమీపంలోని అంతరిక్ష వాతావరణం తో పాటు వివిధ అంశాలను అన్వేషిస్తుంది.

ఇస్రో ఛైర్మన్ ఎస్ సోమనాథ్ ప్రకారం, మిషన్ ఎల్ 1 చుట్టూ దాని నిర్దేశించిన కక్ష్యను చేరుకోవడానికి 125 రోజులు పడుతుందని అంచనా వేస్తున్నారు. ఇది ప్రారంభంలో 16 రోజుల పాటు భూమికి సంబంధించిన కక్ష్యలలో ఉంటుంది, ఆన్‌బోర్డ్ ప్రొపల్షన్‌ని ప్రయోగించడం ద్వారా అవసరమైన వేగాన్ని సాధించేందుకు ఐదు విన్యాసాలకు గురి అవుతుంది.

L1కి చేరుకున్న తరువాత ఆదిత్య -L1  భూమి మరియు సూర్యుడు రెంటినీ కలిపే రేఖకు దాదాపు(90డిగ్రీల) సూటిగా, సరిగాలేని లేని ఆకారపు కక్ష్యలోకి మార్చబడుతుంది, ఇక్కడ అది తన మిషన్ జీవితాన్ని గడుపుతుంది.

సూర్యుడిని వివరంగా అధ్యయనం చేయడం వల్ల పాలపుంత మరియు ఇతర గెలాక్సీలలోని నక్షత్రాలపై విలువైన సమాచారాలు లభిస్తాయని ఇస్రో పేర్కొంది.  ఆదిత్య-L1 యొక్క ప్రాధమిక పేలోడ్, విజిబుల్ ఎమిషన్ లైన్ కరోనాగ్రాఫ్ (VELC), విశ్లేషించడం కోసం భూమికి రోజుకు 1,440 చిత్రాలను ప్రసారం చేస్తుంది.

భారత దేశం యొక్క సౌరమిషన్ భూమి నుండి సుమారు 1.5 మిలియన్ కిలోమీటర్ల దూరంలో ఉంటుంది, నిరంతరం సూర్యునికి ఎదురుగా ఉంటుంది, ఇది భూమి-సూర్యుడు దూరంలో 1% ఉంటుంది.

ఆదిత్య-ఎల్1 మిషన్ ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీహరికోట (Sri Hari Kota) లో ఉన్న సతీష్ ధావన్ (Satish Dhawan) స్పేస్ సెంటర్‌ నందు గల రెండవ లాంచ్ ప్యాడ్ నుండి సెప్టెంబర్ 2, 2023 ఉదయం 11:50 గంటలకు లిఫ్ట్‌ఆఫ్‌కు షెడ్యూల్ చేయబడింది.

Leave A Reply

Your email address will not be published.