PM Vishwakarma Yojana : చేతి వృత్తుల వారికి మొదటి సారి కేంద్రం చేయూత..అర్హులు వీరే

Telugu Mirror : కేంద్ర ప్రభుత్వం((Central Government)) చేతివృత్తుల మీద ఆధారపడి జీవిస్తున్న వారికి శుభవార్తను చెప్పింది. భారతదేశంలోని గ్రామీణ మరియు పట్టణ ప్రాంతాల్లోని సాంప్రదాయ చేతివృత్తుల వారికి మరియు కళాకారులకు మద్దతుగా ‘పీఎం విశ్వకర్మ’ పథకానికి(PM Vishwakarma Scheme) కేంద్ర మంత్రివర్గం బుధవారం ఆమోదం తెలిపింది. ఈ పథకం కింద 5 శాతం వడ్డీ రేటుతో ఎటువంటి ఆంక్షలు లేని నిబంధనలతో లక్ష రూపాయల వరకు రుణాలు ఇవ్వనున్నట్లు కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్(Central Minister Ashwini Vyshnav)   తెలిపారు. ఈ పథకం రూ.13,000 కోట్లు ఆర్థిక వ్యయం చేస్తారు.

Nippon India Small Cap Fund: నెలకి 10వేల పెట్టుబడితో.. లక్షాధికారి అవడం ఎలా? నిప్పాన్ ఇండియా లో SIP చేయండిలా

ప్రధాని నరేంద్ర మోదీ(Narendra Modi) స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా చేసిన ప్రసంగంలో, విశ్వకర్మ జయంతి సందర్భంగా తమ ప్రభుత్వం చేతివృత్తుల వారికి ఒక పథకాన్ని ప్రారంభిస్తుందని, సంప్రదాయ చేతి వృత్తులలో నైపుణ్యం(Skill) కలిగి ఉన్న వారికి ముఖ్యంగా OBC కులాల వారికి ప్రయోజన కరం గా ఉంటుందని పేర్కొన్న మరుసటి రోజే ఈ పథకాన్ని కేంద్రం కేబినెట్ ఆమోదం తెలిపింది.దాదాపు 13 నుంచి 15 వేల కోట్ల రూపాయల అంచనాలతో ప్రారంభం అవుతున్న విశ్వకర్మ యోజన పధకం(Vishwakarma Yojana) ద్వారా చేనేత, స్వర్ణకారులు, కమ్మరి, లాండ్రీ కార్మికులు, క్షురకులతో సహా 30 లక్షల చేతివృత్తుల కుటుంబాలకు స్వయంప్రతిపత్తి కల్పిస్తామని చెప్పారు.

Image Credit : SSA Tripura

PM విశ్వకర్మ పథకం కింద, కళాకారులు మరియు చేతి వృత్తుల వారికి PM విశ్వకర్మ సర్టిఫికేట్ మరియు ID కార్డ్ , మొదటి విడత రూ.1 లక్ష వరకు క్రెడిట్ మద్దతు మరియు 5 శాతం రాయితీ వడ్డీ రేటుతో రెండవ విడత రూ. 2 లక్షలు 5 శాతం వడ్డీ రేటు తో అందించబడుతుంది. ఈ పథకం స్కిల్ డెవలప్మెంట్(Skill Development) మరియు టూల్‌కిట్ ప్రోత్సాహకం, డిజిటల్ లావాదేవీలను పెంపొందించడం మరియు మార్కెటింగ్ సపోర్ట్ ను అందిస్తుంది.సెప్టెంబర్ 17న విశ్వకర్మ జయంతి సందర్బంగా ఈ పథకం అమలులోకి వస్తుంది.

ఈ పథకం భారతదేశంలోని గ్రామీణ మరియు పట్టణ ప్రాంతాల్లోని కళాకారులు మరియు హస్త కళల వారికి ప్రయోజనం చేకూరుస్తుంది. ప్రధానమంత్రి విశ్వకర్మ పథకంలో పద్దెనిమిది సంప్రదాయ వ్యాపారాలు మొదటి సందర్భంలో కవర్ చేయబడతాయి.

Runa Mafi: తెలంగాణ రైతుల రుణమాఫీ పై సందేహాల వర్షం.. పూర్తి వివరణ మీ కోసం

ఈ ట్రేడ్ లలో

 • కార్పెంటర్
 • బోట్ తయారీ దారుడు
 • ఆర్మర్
 • కమ్మరి (లోహర్)
 • హామర్ మరియు టూల్ కిట్ మేకర్
 • తాళాలు వేసేవాడు
 • గోల్డ్ స్మిత్ (సోనార్)
 • కుమ్మరి (కుమ్హార్)
 • శిల్పి, స్టోన్ బ్రేకర్
 • చెప్పులు కుట్టేవాడు (చర్మ కార్)/ షూస్మిత్/ పాదరక్షల కళాకారుడు
 • మేసన్ (రాజ్ మిస్ట్రీ)
 • బాస్కెట్/ చాప/ చీపురు మేకర్/ కాయిర్ నేత
 • డాల్ & టాయ్ మేకర్ (సాంప్రదాయ)
 • బార్బర్ (నాయి)
 • గార్ల్యాండ్ మేకర్ (మల కార్)
 • వాషర్ మన్ (ధోభి)
 • టైలర్ (దర్జి) మరియు
 • ఫిషింగ్ నెట్ మేకర్.
Leave A Reply

Your email address will not be published.