SCR Extends Special Trains : రైల్వే ప్రయాణికులకు గుడ్ న్యూస్.. ప్రత్యేక రైళ్లను పొడిగించిన దక్షిణ మధ్య రైల్వే..!

హైదరాబాద్ నుండి వివిధ ప్రాంతాలకు రైలులో ప్రయాణించే ప్రయాణికులకు దక్షిణ మధ్య రైల్వే ఒక వార్తను ప్రకటించింది. ప్రత్యేక రైళ్ల సేవలను పొంగించినట్టు తెలిపింది.

SCR Extends Special Trains : చాలా మంది ప్రయాణికులు రైలు ప్రయాణం చేయడానికి ఇష్టపడతారు. అంతే కాదు, అవి చాలా సౌకర్యవంతంగా ఉంటాయి. తొందరగా గమ్యాన్ని చేరుకుంటారు. రైలు ప్రయాణం ప్రతి ఒక్కరి జీవితంలో ఒక ప్రత్యేకమైన అనుభవం. ప్రతిరోజు లక్షలాది మంది ప్రజలు రైలులో ప్రయాణిస్తున్నారు. ప్రతిరోజు, లక్షలాది మంది ప్రయాణికులు భారతీయ రైల్వే రైలులో ప్రయాణిస్తున్నారు. అయితే, ప్రజలకు దక్షిణ మధ్య రైల్వే గుడ్ న్యూస్ చెప్పింది. మరి ఆ గుడ్ న్యూస్ ఏంటి? అనే విషయం ఇప్పుడు తెలుసుకుందాం.

హైదరాబాద్ నుండి వివిధ ప్రాంతాలకు రైలులో ప్రయాణించే ప్రయాణికులకు దక్షిణ మధ్య రైల్వే ఒక వార్తను ప్రకటించింది. ప్రత్యేక రైళ్ల సేవలను పొడిగించినట్టు తెలిపింది. వేసవి కలం కారణంగా, 8 ప్రత్యేక రైలు సర్వీసులను జూన్ చివరి వరకు పొడిగించారు. ప్రతి సోమవారం, కాచిగూడ-మధురై ఎక్స్‌ప్రెస్ (ట్రైన్ నెం. 07191) జూన్ 24 వరకు పొడిగించారు.

దక్షిణ మధ్య రైల్వే అధికారులు రైళ్లను పొడిగించారు

  • ప్రతి బుధవారం, మధురై-కాచిగూడ ఎక్స్‌ప్రెస్ (ట్రైన్ నంబర్. 07192) జూన్ 26 వరకు పొడిగించారు.
  • శుక్రవారం కాచిగూడ-నాగర్‌కోయిల్ ఎక్స్‌ప్రెస్ (ట్రైన్ నంబర్. 07435) జూన్ 28 వరకు పొడిగించారు.
  • ఆదివారం నాగర్‌కోయిల్-కాచిగూడ (ట్రైన్ నంబర్. 07436) జూన్ 30 వరకు పొడిగించారు.
  • HSNanded-Erod-HSNanded మరియు Jalna-Chapra-Jalna రైళ్లను కూడా పొడిగించినట్లు దక్షిణ మధ్య రైల్వే అధికారులు వెల్లడించారు.

SCR Extends Special Trains

 

ఆంధ్రప్రదేశ్‌లో అనేక రైలు సర్వీసులు పొడిగించారు

ఆంధ్రప్రదేశ్‌లో అనేక రైలు సర్వీసులు కూడా పొడిగించారు . విజయవాడ మీదుగా హిసార్, తిరుపతి ప్రత్యేక రైళ్లను పొడిగించినట్లు దక్షిణ మధ్య రైల్వే తెలిపింది. ఈ ప్రత్యేక రైళ్లు విజయవాడ మరియు ఉజ్జయిని వంటి ముఖ్యమైన స్టేషన్లలో ఆగుతాయి. హౌరా-యశ్వంత్‌పూర్ మధ్య వారానికి ఒక రోజు ఏసీ ప్రత్యేక రైలు నడుస్తుందని వాల్తేరు డివిజన్ అధికారి ఒకరు తెలిపారు.

02863 హౌరా మరియు యశ్వంత్‌పూర్ (Howrah – Yeswantpur) మధ్య వారపు ఏసీ ప్రత్యేక రైళ్లను నడపాల్సి ఉంది. ఈ ప్రత్యేక రైలు హౌరా నుంచి మధ్యాహ్నం 12.40 గంటలకు బయలుదేరుతుందని ఆయన పేర్కొన్నారు. ఏప్రిల్ 4 మరియు 11 తేదీలలో, మరియు 12.15 గంటలకు యశ్వంత్‌పూర్ చేరుకుంటారు.

SCR Extends Special Trains

Comments are closed.