Paytm: పేటీఎం కొత్త ఫీచర్.. ‘పిన్‌ రీసెంట్‌ పేమెంట్స్‌’ ఫీచర్‌ లాంచ్‌..

--బెనిఫిట్స్‌ ఇవే..

Telugu Mirror : ఏ దేశం అని లేదు ఏ ప్రాంతం అని లేదు ప్రస్తుతం ప్రపంచం మొత్తం సాంకేతిక వినియోగం తోనే నడుస్తుంది. ప్రతి పనిలోనూ టెక్నాలజీ సాయంతో స్మార్ట్ వర్క్ కి అలవాటు పడిపోయింది ప్రపంచం. డబ్బు చెల్లింపులు కూడా ఆన్ లైన్ లోనే జరుగుతున్నాయి.అయితే 197 కమ్యూనికేషన్ లిమిటెడ్ సంస్థ Pin Recent Payments అనే కొత్త ఫీచర్ ని డబ్బు చెల్లింపుల యాప్ Paytm లో  ప్రవేశ పెట్టింది.

IPhone 13 : ఐఫోన్ ప్రియుల కోసం ఫ్లిప్ కార్ట్ ఆఫర్ ..

ఈ ఫీచర్ ద్వారా నగదు బదిలీ సేవలు సులభంగా మారతాయని సంస్థ అభిప్రాయపడినది. ప్రస్తుతం దేశంలో ప్రతి చోట,ఏదో ఒక సందర్భంలో డిజిటల్ గా నగదు బదిలీలు జరుగుతున్నాయి. UPI చెల్లింపులు ట్రెండింగ్ గా మారాయి. అయితే ప్రముఖ డిజిటల్ చెల్లింపులు,ఆర్ధిక సేవల సంస్థ Paytm యాప్ లో కస్టమర్ ల కోసం కొత్త ఫీచర్ ని జోడించింది. ఇది పేటిఎం యాప్ లో ‘Pin Recent Payments’ ఫీచర్ గా అందుబాటులోకి వచ్చింది. దీని ద్వారా UPI చెల్లింపులను సులభంగా మరియు వేగంగా చేయవచ్చు. ఈ కొత్త యాప్ సహాయంతో, Paytm వినియోగదారులు రిపీటెడ్ చెల్లింపులను పిన్ చేయగలుగుతారు.

పిన్ చేసిన ప్రొఫైల్ స్క్రీన్ పై భాగాన ఉంటుంది తద్వారా చెల్లింపులు సులభంగా మరియు వేగంగా చేయవచ్చు. Pin Recent Payments ఫీచర్ ద్వారా వినియోగదారు పైన ఉన్న 5 కాంటాక్ట్ లను మాత్రమే పిన్ చేసే సౌలభ్యం ఉంది. Paytm సంస్థ ప్రతినిధి తెలిపినట్లు వచ్చిన కధనాలలో, Paytm మొబైల్ చెల్లింపులలో అగ్రస్థానంలో ఉందని,దాని కారణంగా యూజర్ ల అనుభవాలను పరిగణనలోకి తీసుకుని మెరుగుపరచాలని భావించి ఎప్పటికప్పుడు యాప్ లో కొత్త ఫీచర్ లను తెస్తున్నామని తెలిపినారు.

Jelly Star : ప్రపంచంలోనే అతి చిన్న స్మార్ట్ ఫోన్.

paytm ‘పిన్ సంపర్క్’ సౌకర్యం యొక్క ఉద్దేశ్యం కస్టమర్ లు వేగంగా UPI చెల్లింపులు చేయడానికి వీలుగా ఉంటుంది. దీని ద్వారా వినియోగదారుల సమయాన్ని,వారి ప్రయత్నాన్ని ఆదా చేయడతో పాటు వేగంగా UPI చెల్లింపులు చేయవచ్చునని కంపెనీ ప్రతినిధి తెలిపారు.

Paytm లో కాంటాక్ట్ ని Pin చేసే విధానం:

• మొదటగా మీయొక్క Paytm యాప్ ని ఓపెన్ చేయండి.
• తెరచిన పేటిఎం యాప్ లో ఇప్పుడు UPI మనీ ట్రాన్స్ ఫర్ లో మొబైల్ లేదా కాంటాక్ట్ పై క్లిక్ చేయండి.
• ఇప్పుడు సింబల్స్ పై లేదా సెర్చ్ ఫలితాల పై ఎక్కువ సమయం నొక్కండి.
• ఇప్పుడు చివరిగా Pin మీద నొక్కండి.

Leave A Reply

Your email address will not be published.