Poco C61 Smartphone : క్రేజీ ఫీచర్స్‌ తో పోకో నుంచి అదిరిపోయే మొబైల్‌.. ధర చూస్తే షాక్ అవ్వాల్సిందే..!

పోకో సంస్థ భారత్‌ మార్కెట్‌లో త్వరలో C సిరీస్‌ స్మార్ట్‌ఫోన్ ను విడుదల చేయనుంది. పోకో C61 మొబైల్‌ భారత్‌లో మార్చి 26న లాంచ్‌ కానుంది.

Poco C61 Smartphone : పోకో సంస్థ భారత్‌ మార్కెట్‌లోకి త్వరలో C సిరీస్‌ స్మార్ట్‌ఫోన్ను విడుదల చేయనుంది. పోకో C61 హ్యాండ్‌సెట్‌ భారత్‌లో మార్చి 26న లాంచ్‌ కానుంది. ఈ ఫోన్‌ డిజైన్‌, కలర్‌, ర్యామ్‌ మరియు ఇతర స్పెసిఫికేషన్లు ఇప్పటికే లీక్ అయ్యాయి. అయితే ఈ పోకో C61 హ్యాండ్‌సెట్‌ రెడ్‌మి A3 ఫోన్‌కు రీబ్రాండెడ్‌ వెర్షన్‌గా వచ్చినట్లు తెలుస్తోంది. పోకో గత ఏడాది విడుదల చేసిన పోకో సి51 కు నెక్ట్స్ జనరేషన్ ఫోన్ పోకో C61.

Also Read : Bajaj CNG Bike : పెట్రోల్‌ కష్టాలకు ఇక చెక్‌..బజాజ్ నుంచి CNG బైక్.. జూన్ లో ఆవిష్కరణ..!

బ్లాక్, బ్లూ, గ్రీన్ రంగుల్లో అందుబాటులో ఉండే ఈ స్మార్ట్‌ఫోన్ సన్నటి డిజైన్ కలిగి ఉండటం వల్ల చాలా ఆకర్షణీయంగా ఉంటుంది. 90 HZ రిఫ్రెష్ రేట్ కలిగి 6.71 ఇంచెస్ హెచ్‌డి ప్లస్ ఎల్‌సీడీ డిస్‌ప్లే ఉంటుంది. ఫోన్ త్వరగా డ్యామేజ్ కాకుండా ఉండేందుకు గొరిల్లా గ్లాస్ 3 ప్రొటెక్షన్ కూడా ఉంటుంది. ఈ స్మార్ట్ ఫోన్ మీడియాటెక్ హీలియో జి36 ఎస్ఓసి చిప్‌సెట్ పై పనిచేస్తుంది. 5000 ఎంఏహెచ్ బ్యాటరీ తో USB C టైప్ ఛార్జింగ్ పోర్టు ఉండి 10 వాట్స్ ఛార్జింగ్ కు సపోర్ట్ చేస్తుంది.

Poco C61 Smartphone

ఫోన్ వెనుక భాగంలో సర్కిల్ ఆకారంలో కెమేరా సెటప్ ఉంటుంది. ఇందులో 8 మెగాపిక్సెల్ కెమేరా, 0.08 సెకండరీ కెమేరా ఉంటాయి ఇక సెల్ఫీ లేదా వీడియో కాలింగ్ కోసం 5 మెగాపిక్సెల్ కెమేరా ఉంటుంది. సెక్యూరిటీ కోసం సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఉంటుంది. పోకో C61 రెండు వేరియంట్లలో అందుబాటులో ఉంటుంది. ఒకటి 4 జీబీ ర్యామ్-64 జీబీ స్టోరేజ్ అయితే రెండవది 6జీబీ ర్యామ్-128 జీబీ స్టోరేజ్. పోకో సి61 4జీబీ ర్యామ్-64 జీబీ స్టోరేజ్ వెర్షన్ ధర కేవలం 7,499 రూపాయలు మాత్రమే. ఇందులోనే 6జీబీ ర్యామ్, 128జీబీ స్టోరేజ్ ధర కాస్త ఎక్కువగా ఉంటుంది.

Also Read : BMW iX50 Magnificent EV: BMW నుంచి కొత్త ఎలక్ట్రిక్ వెహికల్, దాని వివరాలు మీ కోసం.

ఈ పోకో మెుబైల్‌లో Wi-Fi 802.11 a/b/g/n/ac, Bluetooth 5.3, GPS, GLONASS, GALILEO, BDS, USB Type-C 2.0 వంటి కనెక్టివిటీ ఫీచర్లు ఉండనున్నాయి. అలాగే యాక్సిలోమీటర్‌ (Accelerometer), కంపాస్ (Compass) వంటి సెన్సార్లు కూడా ఫోన్‌తో పాటు రానున్నాయి.

Poco C61 Smartphone

Comments are closed.