Salt Control: ఉప్పు కంట్రోల్ లో లేకపోతే పెను ప్రమాదమే.. తీసుకోవలసిన జాగ్రత్తలు ఏంటో తెలుసుకొండి

Telugu Mirror: మనం రోజువారి ఆహారంలో ఎక్కువగా ఉపయోగించేవి పంచదార మరియు ఉప్పు. ఈ రెండు ఎక్కువగా తీసుకోవడం వల్ల శరీరానికి అత్యంత ప్రమాదకరం. చక్కెరను ఎక్కువగా తీసుకోవడం వల్ల క్యాన్సర్(cancer) మరియు ఊబకాయం వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

ఉప్పును(salt) ఆహారంలో అధిక మోతాదులో తీసుకోవడం వల్ల అధిక రక్తపోటు ప్రమాదాన్ని పెంచుతుంది. అధిక రక్తపోటు(blood pressure) వలన గుండె సంబంధిత వ్యాధులు వచ్చే అవకాశం ఎక్కువగా ఉందని అధ్యయనాలు పేర్కొన్నాయి.

Also Read:Unwanted Hair : అవాంఛిత రోమాలు మీ ముఖ సౌందర్యాన్ని చెడగొడుతుందా ? అయితే ఈ టిప్స్ మీ కోసం..

ప్రపంచవ్యాప్తంగా జరిపిన పరిశోధనలో ఆహారంలో సోడియం యొక్క పరిమాణం పెరగడాన్ని గమనిస్తున్నారు. అమెరికా ప్రజల(American Citizens) పై జరిగిన అధ్యయనాల ప్రకారం చాలా మంది ప్రజలు రోజువారి ఆహారంలో భాగంగా సోడియంను రెండు రెట్లు ఎక్కువ మోతాదులో వాడుతున్నారని గుర్తించారు.

ఆహారంలో ఉప్పు ఎక్కువగా తీసుకోవడం వల్ల గుండె వ్యాధులే కాకుండా ఇంకా అనేక రకాల తీవ్రమైన జబ్బులు వచ్చే అవకాశం ఉందని వైద్యులు పేర్కొన్నారు. కాబట్టి ఉప్పు వాడకాన్ని సాధ్యమైనంత వరకు తగ్గించండి.

మానవ దేహానికి చాలా కొద్ది మొత్తంలో మాత్రమే సోడియం అవసరం. సగటున 3,400 మిల్లీగ్రాముల ఉప్పును వాడుతున్నారు. అయితే ఆరోగ్యంగా ఉన్న వారికి రోజు మొత్తంలో సుమారు 1,500 మిల్లీగ్రాముల ఉప్పు సరిపోతుంది. ఉప్పుని ఎక్కువగా తీసుకోవడం వల్ల స్ట్రోక్ మరియు గుండె వ్యాధులు అలాగే అధిక రక్తపోటు వస్తాయి. అయితే మీరు ఎంత ఎక్కువ వాడుతున్నారో మీకు ఎలా తెలుస్తుంది ? దీన్ని తెలుసుకోవడం కోసం (ఫిజికల్ సింబల్స్) భౌతిక సంకేతాలు తెలుసుకోవడం చాలా అవసరం.

Image Credit:News Medical

Also Read:Diabetes: శరీరం లో ఇన్సులిన్ కొరత వలన డయాబెటిస్ కాకుండా వచ్చే ఇతర వ్యాధులు తీసుకోవలసిన జాగ్రత్తలు.

* మీకు పొట్ట ఉబ్బరంగా అనిపిస్తే మీరు సాధారణం కంటే ఎక్కువ మోతాదులో సోడియం తీసుకుంటున్నారని అర్థం అని వైద్యులు చెబుతున్నారు.

* ఉప్పగా లేని ఆహారాలు చాలా ఉన్నాయి. కానీ నిజానికి వాటిలో సోడియం పరిమాణం అధికంగా ఉంటుంది. వాటిల్లో పిజ్జా ,శాండ్విచ్ లు, సూప్ లు వీటిలో సోడియం దాగి ఉంటుంది. ఇవి మీ దేహంలో సోడియం ను పెంచుతాయి. తరచుగా కాళ్లు మరియు చేతులలో వాపు అనిపిస్తే మీరు సోడియం అధికంగా వాడుతున్నారని అర్థం .

*మీ బాడీలో ఉప్పు ఎక్కువ అయితే మీ చేతులు ,పాదాలు, ముఖం, చీలమండలం వంటి శరీర భాగాలు ఎక్కువగా వాపును కలిగి ఉంటాయి‌.

* మీకు చాలా ఎక్కువ దాహం అనిపిస్తే మీరు సోడియం అధికంగా వాడుతున్నారని అర్థం. మీ శరీరంలో ఎక్కువ మొత్తంలో సోడియం ఉన్నప్పుడు మీ శరీరంలోని కణాల ద్వారా నీటిని బయటకు తెస్తుంది. అప్పుడు మీకు చాలా దాహం వేసినట్లు అనిపిస్తుంది. నీరు త్రాగడం వల్ల ఉప్పును బ్యాలెన్స్ చేసి మీ కణాలను రిఫ్రెష్ చేయడంలో ఉపయోగపడుతుంది.

మీకు మరల దాహం అనిపించినప్పుడు దాని కారణాలను నిర్ధారించడం చాలా అవసరం.

కాబట్టి ప్రతి ఒక్కరూ దీనిని దృష్టిలో ఉంచుకొని ఉప్పును తగిన మోతాదులో తీసుకునే ప్రయత్నం చేయాలి.

గమనిక :ఈ కథనం పాఠకులకు జ్ఞానం మరియు అవగాహన పెంచడానికి తయారు చేయబడింది. పూర్తి సమాచారం కోసం మీ వైద్యుడిని సంప్రదించండి.

Leave A Reply

Your email address will not be published.