Dandruff Remedies: ఈ చిట్కాలు ఉండగా మీ చెంత..”చుండ్రు” గురించి ఎందుకు చింత.. సింపుల్ గా చుండ్రును వదిలించు కోండి

Telugu Mirror: ప్రస్తుతం వర్షాకాలం జరుగుతుంది. ఎండలు నుంచి ఉపశమనం పొందడానికి వర్షాకాలం కోసం అందరూ ఎదురు చూస్తుంటారు. అయితే వర్షం వల్ల కొన్ని ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. వర్షాకాలంలో చర్మవ్యాధులు మరియు అంటువ్యాధులు ఇలాంటివి సాధారణంగా వచ్చే సమస్యలు. అయితే వర్షంలో తడవడం వల్ల చర్మం మరియు తలపై దురద వంటి ఇబ్బందులు ఖచ్చితంగా వస్తాయి. దీనితో పాటు జుట్టు రాలిపోవడం, చుండ్రు సమస్యలు ఎక్కువగా బాధిస్తాయి. తలపై చుండ్రు వస్తే అది అంత త్వరగా పోదు. దీనివల్ల జుట్టు కూడా విపరీతంగా రాలిపోతుంది. వర్షాకాలంలో చుండ్రు సమస్యల నుంచి బయటపడడానికి పార్లర్ కు వెళ్లి డబ్బులు మరియు సమయం వృధా చేసుకోకుండా ఇంట్లోనే కొన్ని చిట్కాల ద్వారా ఈ చుండ్రు సమస్య నుంచి బయటపడవచ్చు. దీనికోసం మీరు పెద్దగా శ్రమించాల్సిన అవసరం కూడా లేదు .ఇప్పుడు చుండ్రు నివారణ కోసం ఇంటి చిట్కాలను తెలుసుకుందాం.

Also Read:Sugar Patients: మధుమేహ బాధితులు పండ్లు తిన్నా ప్రమాదమే..ఈ పండ్లు తింటే ఏమవుతుందో  తెలుసా ?

నిమ్మకాయ(Lemon) :

Natural remedies for drandruff
Image credit: health line

నిమ్మకాయను ఉపయోగించి చుండ్రు సమస్య నుండి బయటపడవచ్చు. నిమ్మకాయ కొంతమందికి పడదు .వాళ్ళు టెస్ట్ చేసుకొని ఉపయోగించాల్సిన అవసరం ఉంది. మీకు ఒకవేళ నిమ్మకాయ వాడటం వల్ల ఏ ఇబ్బంది ఉండదు అనుకున్న వారు ఈ విధంగా ట్రై చేయండి . తలలో చుండ్రు ఉన్నవారు నిమ్మ రసాన్ని తల మొత్తానికి పట్టించి, మృదువుగా మసాజ్(massage) చేయాలి. పది నుంచి పదిహేను నిమిషాలు అలాగే ఉంచాలి. తర్వాత మీరు వాడే షాంపూ(shampoo)తో తలస్నానం చేయాలి. ఇలా తరచుగా చేయడం వల్ల చుండ్రు సమస్య తగ్గుతుంది.

కలబంద(Alovera):

Image credit:original

కలబందను ఉపయోగించి కూడా చుండ్రు సమస్య నుండి బయటపడవచ్చు. దీనికోసం ఫ్రెష్ కలబంద గుజ్జును తీసుకొని నేరుగా తలకి రాయాలి. 30 నిమిషాల తర్వాత తల స్నానం చేయాలి. ఇది కూడా చుండ్రును నివారించడానికి చాలా బాగా పనిచేస్తుంది.

టీ ట్రీ ఆయిల్(tea tree oil):

Image credit:original

టీ ట్రీ ఆయిల్ కూడా చుండ్రును నివారించడానికి చాలా సహాయపడుతుంది. ఇది జుట్టుకి మంచి ఔషధంలా పనిచేస్తుంది. దీనిని ఎలా వాడాలంటే టీ ట్రీ ఆయిల్లో, కోకోనట్ ఆయిల్(coconut oil) వేసి కలపాలి. దీనిని మీ తలకి అప్లై చేయాలి. కొన్ని రోజుల వ్యవధిలోనే చుండ్రు సమస్య నుంచి బయటపడతారు.

ఆపిల్ సైడర్ వెనిగర్(apple cider vinegar):

Image credit: original

ఆపిల్ సైడర్ వెనిగర్ ని ఉపయోగించి చుండ్రు ను పోగొట్టుకోవచ్చు. దీనికోసం ఆపిల్ సైడర్ వెనిగర్ మరియు నీటిని సమపాళ్లల్లో తీసుకొని కలపాలి. ఇప్పుడు తలకి అప్లై చేయాలి. ఆరిన తర్వాత జుట్టును నీటితో కడగాలి. ఈ విధంగా చేసి కూడ చుండ్రు నుండి విముక్తి పొందవచ్చు .

వీటిల్లో మీకు ఏది వీలుగా ఉంటుందో దానిని ప్రయత్నించండి. అన్ని చేయాల్సిన అవసరం లేదు. ఇటువంటి కొన్ని నేచురల్ హోమ్ రెమెడీస్(Natural Home Remedies) ద్వారా మీకున్న చుండ్రు సమస్య నుండి బయటపడండి.

Leave A Reply

Your email address will not be published.