Chanakya neeti sutras : బాధ్యత లేకుండా ప్రవర్తిస్తున్నారా.. అయితే మీరు పేదరికంలో ఉన్నట్లే..

Telugu Mirror : ఉత్తర భారత దేశంలోని మౌర్య సామ్రాజ్యాధిపతి చంద్రగుప్తుడు(Chandragupta) కి సలహా దారుడు చాణక్యుడు.చాణక్యుడి అసలు పేరు విష్ణుగుప్త, కలంపేరు కౌటిల్యుడు(Kautilya).చాణక్యుడు 2వ శతాబ్దం BCE అలాగే 3వ శతాబ్దం CE ల మధ్య రాజకీయాలపై అలానే ఆర్ధిక శాస్త్రం పై అర్ధశాస్త్రం రచించిన మహా వ్యక్తి చాణక్యుడు.ఎన్నో గ్రంధాలను రచించిన చాణక్యుడి పేరు ఇప్పటికీ ప్రసిద్ది.చాణక్యుడు వ్రాసిన నీతి శాస్త్రం ఇప్పటికీ చాణక్య నీతి పేరుతో ప్రసిద్ది(Popular) గాంచింది. జీవిత సత్యాలను అలాగే విజయ రహస్యాలను చెప్పాడు చాణక్యుడు.

PM Kisan Yojana : అన్నదాతలకు గుడ్ న్యూస్..ఖాతాల్లోకి డబ్బులు..14వ విడతపై బిగ్ అప్డేట్..

తత్వవేత్త,న్యాయవాది,అలానే రాజ సలహా దారుడు చాణక్యుడ . మానవుడు ఎటువంటి మంచి అలవాట్లను కలిగి ఉండాలో ఎటువంటి అలవాట్లను కలిగి ఉండకూడదో చాణిక్య గ్రంథంలో వ్రాయబడింది. చాణిక్య నీతి శాస్త్రం(Ethics)ఎన్నో విషయాల పైన బోధించడం జరిగింది .అలాగే సరైన నడవడికను తెలియజేస్తుంది. ఈ గ్రంథం సామాజికంగా మరియు రాజకీయంగా మనిషికి మార్గదర్శి గా నిలుస్తుంది. చాణిక్యుడు రచించిన గ్రంథంలో ఎన్నో ఉపయోగకరమైన సూత్రాలు(Principles),విధానాలు పొందుపరిచారు.ఇందులో మానవులు జీవితంలో ఎలా విజయం సాధించాలో తెలియజేసే విషయాలు ఉన్నాయి .ఎలాంటి అలవాట్లు ఉండాలో తెలియజేశారు. ఎటువంటి అలవాట్లు ఉంటే మనిషి క్రమంగా పేదవాడు అవుతాడో చెప్పబడింది. అవి ఏమిటో తెలుసుకుందాం.

Image Credit : Ok telugu
  • ఎవరైతే అపరిశుభ్రం అయిన దుస్తులు ధరిస్తారో మరియు పరిసరాల పరిశుభ్రత పాటించరో, అటువంటి వ్యక్తులు ఎప్పుడు పేదరికంలో ఉంటారు.
  • గట్టిగా కేకలు వేస్తూ, అరుస్తూ, కఠినం(Harsh)గా మాట్లాడే వారి దగ్గర లక్ష్మీ ఉండదు .అలాంటి స్వభావం ఉంటే మానుకోవాలి .
  • ఇతరులతో మంచిగా మాట్లాడాలి లేకపోతే సంబంధాలు చెడిపోతాయి .ఈ విధమైన అలవాట్లు ఉంటే వదిలేయాలి.
  • ఎవరైతే సూర్యుడు అస్తమించే సమయంలో నిద్రపోతారో వారు ఎప్పుడూ పేదవారిగానే ఉంటారు. ఎందుకంటే ఆ సమయంలో నిద్రించడం లక్ష్మీదేవికి ఇష్టం ఉండదు. కాబట్టి పొరపాటున కూడా సూర్యాస్తమయ సమయంలో నిద్రించకూడదు.
  •  సోమరితనాన్ని(laziness) విడిచిపెట్టాలి. ఈ అలవాటు ఉన్న వ్యక్తులు ఏ పని చేయలేరు. ఈ అలవాటు ఉన్నవారు జీవితంలో విజయం సాధించలేరు. కాబట్టి సోమరితనం విడిచి పెట్టాలి.
  • ఎవరైతే అనాలోచిత(Inadvertent) ఖర్చుచేస్తారో వారి పేదవారు అవుతారు. మీ ఆదాయానికి తగిన విధంగా ఖర్చు చేయాలి. ఖర్చులను అదుపులో ఉంచుకోవాలి. అప్పుడు మాత్రమే విజయం సాధిస్తారు.

బ్యాంకుల RDs vs పోస్ట్ ఆఫీస్ RDs: ఏది అధిక వడ్డీ రేటును అందిస్తోంది…

కాబట్టి ఆర్థిక అవసరాలకు అనుగుణంగా డబ్బులు కేటాయించండి. మరియు పొదుపు(Savings) చేయడం నేర్చుకోవాలి. కాబట్టి ఇటువంటి అలవాట్లు ఉంటే మానుకోవాలి.చాణిక్య గ్రంధంలో నీతి సూత్రాలు పాటించడం ద్వారా మనిషి విజయం(Success) సాధించే అవకాశాలు ఎక్కువగా  ఉన్నాయి.

Leave A Reply

Your email address will not be published.