Telugu Mirror : గూగుల్ (Google) భారతదేశ ప్రజలకి ఎంతో ఉపయోగపడే ముందస్తు భూకంపం హెచ్చరిక సిస్టమ్‌ను ప్రవేశపెట్టింది . 2020 లో మొదలు అయిన ఈ ప్రాజెక్టుని గూగుల్ భారతదేశంలో నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ (National Disaster Management Authority), ఎర్త్ సైన్సెస్ మంత్రిత్వ శాఖ (Ministry of Earth Sciences) కు చెందిన నేషనల్ సెంటర్ ఫర్ సీస్మోలజీ (national center for seismology)తో కలిసి ఆండ్రాయిడ్ భూకంప హెచ్చరికల వ్యవస్థను ఇప్పుడు లాంచ్ చేసింది.
స్మార్ట్ ఫోన్ ల ద్వారా సేకరించిన డేటా ద్వారా ఆండ్రాయిడ్ వినియోగదారులు అందరికీ భూప్రకంపనలు ఎక్కువ ఉన్న చోటును ముందస్తుగా అంచనావేసేందుకు ఈ సిస్టమ్ అందుబాటులో ఉంటుంది అని దీనివలన ఆ ప్రాంతంలో ఉన్న ప్రజలను అప్రమత్తం చేయవచ్చని గూగుల్ తన వెబ్సైట్ (Android early earthquake warnings – Google Crisis Response) లో తెలియ చేసింది. ఆండ్రాయిడ్ డివైస్ (Android Device) యొక్క యాక్సెలరోమీటర్ సెన్సార్ల (accelerometer sensor) ను ఉపయోగించుకొని ఈ సిస్టమ్ పని చేస్తుంది.
Also Read:ప్రపంచంలో ఎనిమిదవ ఖండం అవతరించనుందా? దాని విశేషాలను ఇప్పుడు తెలుసుకుందాం
భూకంపం వచ్చే సమయం లో ఈ యాక్సెలరోమీటర్లు చిన్న భూకంపమీటర్లుగా (seismic sensors) పనిచేస్తాయి, అనేక ఫోన్‌లు ఒకే సమయంలో ఒకే ప్రదేశం లో భూమి కధులుతునట్లు నమోదు చేస్తే దాని భూకంప పరిమాణ లక్షణాలను గూగుల్ సర్వర్ గుర్తించగలదు. వెంటనే సర్వర్ ఆ తర్వాత సమీపంలోని ఫోన్లలో భూకంప హెచ్చరికలను తెలియచేస్తుంది. భూకంప తీవ్రతలను అనుసరించి రెండు రకాల హెచ్చరికలను అందిస్తుంది. అందులో మొదటిది వినియోగదారు స్మార్ట్‌ఫోన్‌లో పెద్ద సౌండ్‌ని ప్లే చేస్తూ బి అవేర్ (Be Aware) అనే భూకంప హెచ్చరిక ను తెలియచేస్తుంది.
మరొక సందర్భంలో టేక్ యాక్షన్ (Take Action) అనే అలర్ట్ ద్వారా హెచ్చరిస్తుంది. హెచ్చరిక పంపే సమయంలో మీ మొబైలు ఫ్లయిట్ మోడ్ (Flight Mode) లేదా సైలెంట్ మోడ్ (Silent Mode) లో ఉన్నా కూడ మీకు హెచ్చరిక వస్తుంది. భూకంప అలారాన్ని మీ ఆండ్రాయిడ్ ఫోన్ లో ఈ పద్దతులలో యాక్టివేట్ చేసుకోండి.
Also Read:KATRINA KAIF : భారత దేశంలో జపనీస్ సంస్థ ‘యునిక్లో’ మొదటి బ్రాండ్ అంబాసిడర్ గా “కత్రినా కైఫ్.”
1: మీ Android స్మార్ట్‌ఫోన్‌లో, Wi-Fi లేదా మొబైల్ డేటాను ఆన్ చేయండి.
2 : మీ Android స్మార్ట్‌ఫోన్‌లో సెట్టింగ్‌లను తెరవండి.
3 : తర్వాత, మీ Android ఫోన్‌లో భద్రత మరియు ఎమర్జెన్సీ సెట్టింగ్‌లను క్లిక్ చెయ్యండి.
4 : తర్వాత, మీ Android ఫోన్‌లో భూకంప హెచ్చరికల ఎంపికను ప్రెస్ చేయండి.
5 : మీకు సేఫ్టీ ఎమర్జెన్సీ కనిపించకుంటే, లొకేషన్ ను క్లిక్ చేసి ఆ తరువాత అడ్వాన్స్‌డ్ అనంతరం భూకంప హెచ్చరికలను నొక్కండి.
6 : చివరగా, భూకంప హెచ్చరికల ఎంపికను ఆన్ చేయండి.