Blood Clot : రక్తం గడ్డకట్టడాన్ని అరికట్టాలా ? అయితే దివ్య ఔషధాలతో కూడిన ఆహార పదార్దాలు ఇప్పుడు మీ కోసం..

Telugu Mirror : మనం తీసుకునే ఆహారం మన రక్త ప్రసరణ(Blood Circulation) వ్యవస్థ పనితీరు ఆధారపడి ఉంటుంది. ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడం వలన రక్తం గడ్డకట్టే సమస్యను నివారించడంలో తోడ్పడుతుంది.అయితే పోషకాహార నిపుణులు అంజలి ముఖర్జీ రక్తం గడ్డ కట్టే పరిస్థితి గురించి వ్రాస్తూ “ఆహారం, రక్తం గడ్డకట్టడానికి వ్యతిరేకంగా పనిచేసే సహజ రక్షణ! ఆరోగ్యకరమైన ప్రసరణ వ్యవస్థను కలిగి ఉండటానికి మరియు బ్లడ్ క్లాట్(Blood Clot) అవకుండా ఆపడంలో మనం ఏ విధమైన ఆహారాన్ని తీసుకోవాలని ఎంచుకోవడం ముఖ్యమైన పాత్ర పోషిస్తుందని మీకు తెలుసా? ఇది యదార్ధం.

Wheat Flour Quality: గోధుమ పిండిలో నాణ్యతను విస్తృతంగా పరీక్షించుకోండి ఇలా..కల్తీని తరిమేయండి అలా అలా..

మనకు గుండెపోటు వస్తుందో లేదో అనేది మన శరీరంలో జరిగే ప్రసరణ వ్యవస్థలో రక్తం గడ్డ కట్టే పద్దతి మీద ఆధారపడి ఉంటుంది.మనం తీసుకునే కొన్ని ఆహార పదార్థాలు రక్త ప్రసరణ వ్యవస్థని భద్రంగా ఉంచేందుకు,మెరుగు పరచేందుకు ఉపయోగ పడతాయి.అలానే కొన్ని రకాల అనారోగ్యకరమైన ఆహారపు పద్దతులు రక్తాన్ని ప్రసరణ వ్యవస్థ గోడలకు అంటుకునేలా చేస్తాయి,అలాగే మచ్చలు(Dots) పడే అవకాశం కూడా ఉంది. రక్త ప్రసరణ వ్యవస్థ ఆరోగ్యంగా ఉండడానికి తోడ్పడే ఆహార పదార్ధాలు కొన్నిటి గురించి తెలుసు కుందాం.

ట్రీ-ఇయర్ మష్రూమ్స్ :

Tree-ear Mushrooms

ట్రీ-ఇయర్ మష్రూమ్స్ వీటినే బ్లాక్ పుట్టగొడుగులు(Black Mushrooms) లేదా నల్ల పుట్ట గొడుగులు అని కూడా అంటారు. ఇవి రక్తం గడ్డ(Blood Clot) కట్టడాన్ని నిరోధించే లక్షణాలను కలిగి ఉంటాయి. మరియు సూక్ష్మ రక్త కణాలు ఒకదానికొకటి అంటుకోకుండా కాపాడడంలో ఉపయోగ పడతాయి.

అల్లం మరియు వెల్లుల్లి :

Ginger and Garlic

అల్లం(Ginger) మరియు వెల్లుల్లి(Garlic) రక్తం గడ్డకట్టే లక్షణాలను నివారించే లక్షణాలను కలిగి ఉంటాయి అదేవిధంగా రక్తాన్ని పల్చగా చేయడంలో మరియు రక్త నాళాలలో ఏర్పడిన గడ్డలను కరిగించడంలో సహాయపడతాయి.వీటిని ఆహారం లో చేర్చుకోవడం ద్వారా రక్త సరఫరా లో ఆటంకాలను ఎదుర్కోవడానికి ఉపయోగపడతాయి.

Salt Control: ఉప్పు కంట్రోల్ లో లేకపోతే పెను ప్రమాదమే.. తీసుకోవలసిన జాగ్రత్తలు ఏంటో తెలుసుకొండి

ఉల్లిపాయలు :

Onions

ఉల్లిపాయలను రోజువారీ ఆహారంలో తప్పకుండా తీసుకుంటూ ఉండాలి. ఎందుకంటే ఉల్లిపాయలను ఆహారంలో తప్పనిసరిగా తీసుకోవడం వలన ఉల్లిపాయలో ఉండే సమ్మేళనాలు(Compounds) రక్తం గడ్డ కట్టకుండా నిరోధించడంలో సహాయపడతాయి.

అవిసె గింజలు :

Flax-Seeds

అవిసె గింజలు(Flax seeds) ఆహారంలో తీసుకోవడం వలన రక్తం పలుచబడటానికి సహాయపడతాయి. వీటిని వివిధ రకాలుగా ఆహారం లో చేర్చుకోవడం ద్వారా రక్త ప్రసరణ వ్యవస్థను ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడతాయి.

Leave A Reply

Your email address will not be published.