Respiratory Syncytial Virus : పిల్లలకు ప్రమాదకరం RSV వైరస్..నివారణకు టీకానే మార్గం..పెద్దలకూ సోకే అవకాశం..

Telugu Mirror : RSV అనగా రెస్పిరేటరీ సిన్సిటియల్ వైరస్. పిల్లలు ఈ వైరస్(Virus) బారిన పడుతున్నారు. కొన్నిసార్లు వృద్ధులకు కూడా ఈ వైరస్ వల్ల ప్రమాదం పొంచి ఉంది. RSV అనేది సాధారణ శ్వాసకోస వైరస్(Respiratory virus). ఇది జలుబు వంటి లక్షణాలను కలిగిస్తుంది. కొన్ని సందర్భాల్లో దీని ప్రభావం తీవ్రంగా కూడా మారే అవకాశం ఉంది. ఈ వైరస్ వచ్చిన శిశువులను ఆసుపత్రికి తీసుకెళ్లడం చాలా అవసరం. RSV వల్ల లంగ్స్(lungs) మరియు శ్వాస కోస వ్యవస్థ సమస్యలకు దారితీస్తుందని వైద్యులు అంటున్నారు.

Hot Water Benefits: పేరుకే “హాట్ వాటర్”..చేసే మేలు మాత్రం చాలా బెటర్.. వర్షాకాలం వ్యాధుల బారినుండి రక్షణ కోసం

సెంటర్ ఫర్ డిసీస్ ప్రివెన్షన్ (CDC) అండ్ కంట్రోల్ వైద్యులు ఈ వైరస్ నుండి పిల్లలను సంరక్షించాలని అంటున్నారు. దీనికోసం అందరూ కృషి చేయాలని అన్నారు. 8 నెలల లోపు వయసు ఉన్న ప్రతి పిల్లలకి ఈ ఇన్ఫెక్షన్(injection) సోకకుండా టీకాలు వేయించడం చాలా అవసరమని అన్నారు.ఈ వైరస్ గురించి మరికొన్ని విషయాలు తెలుసుకుందాం. CDC నిపుణుల అధ్యయనం ప్రకారం ఎనిమిది నెలల కంటే తక్కువ వయస్సు ఉన్న పిల్లలందరికీ RSV కి వ్యతిరేకంగా టీకాలు వేయించాలి.ఈ వైరస్ పిల్లల్లో మొదట సాధారణ జలుబు లక్షణాలతో కనిపిస్తుంది.

Image Credit : github

తర్వాత న్యూమోనియా లేదా వారి ఊపిరితిత్తుల వాయు మార్గాలు వాపుతో ఉండి కఠినంగా మారే ప్రమాదం ఉంటుంది.RSV కారణంగా ప్రతి ఏడాది సంవత్సరంలోపు వయసున్న పిల్లలు ఒకటి నుంచి మూడు శాతం(3%) మంది ఆసుపత్రి పాలవుతున్నారని అంచనా. ఉంది. యాంటీ RSV వ్యాక్సిన్ వేయించడం వల్ల ఈ వైరస్ ప్రమాదాన్ని తగ్గించే అవకాశం ఉంది.ఈ మధ్యకాలంలో FDA, 19 నెలల కంటే తక్కువ వయస్సు ఉన్న పిల్లలందరికీ నిర్సే విమాబ్ వ్యాక్సిన్(Vimab vaccine) ఇవ్వాలని CDC ఆమోదించింది. ఇది వైరస్ బారిన పడకుండా కాపాడే వ్యాక్సిన్. ఈ వ్యాక్సిన్ వేయించడం వల్ల తీవ్రమైన ఆరోగ్య సమస్యలు 80శాతం తగ్గిస్తుందని పరిశోధనలో కనుగొన్నారు.

Breast milk feeding:తల్లి పాలు బిడ్డకు శ్రేష్టం..ఇవ్వమని అమ్మకు చెబుదాం..ఘనంగా జరుగుతున్న ప్రపంచ తల్లి పాలవారోత్సవాలు

RSV లక్షణాలు(Symtoms) పెద్దలు మరియు వృద్ధులలో తక్కువగా ఉంటాయి . సాధారణ జలుబు లాగే ఉండి కొన్ని సందర్భాలలో కొంతమందికి తీవ్రంగా మారే అవకాశం ఉంది. ఈ వైరస్ యొక్క ప్రభావం ఎక్కువగా ఎవరికి వస్తుందంటే సంవత్సరం కన్నా తక్కువ వయసు ఉన్న పిల్లలకి అలాగే నెలలు నిండకుండా పుట్టిన వారికి, ఊపిరితిత్తులు మరియు గుండె వ్యాధులు ఉన్నవారికి, అలాగే రోగనిరోధక శక్తి(Immunity Power) తక్కువగా ఉన్నవారికి ఈ ఇన్ఫెక్షన్ బారిన పడే ప్రమాదం అధికంగా ఉంటుంది.

RSV రావడం వలన రోగ నిరోధక వ్యవస్థ బలహీనంగా మారుతుంది. దీనివల్ల పెద్దలు మరియు పిల్లల్లో కోవిడ్ -19 వచ్చేలా చేసే అవకాశం ఉందని గుర్తించాలి. ఎవరికైనా ఈ రెండు RSV మరియు కోవిడ్ -19(Covid-19) కలిసి వస్తే వ్యాధి మరింత కఠినంగా మారే అవకాశం ఎక్కువగా ఉంది.కాబట్టి సంవత్సరంలోపు వయసున్న పిల్లలకు వైద్యులను సంప్రదించి యాంటీ RSV టీకాలు వేయించాలి. RSV పట్ల అందరూ అప్రమత్తంగా ఉండాలి.

Leave A Reply

Your email address will not be published.