Adhaar Mobile Number Change: ఆధార్ కార్డు ఫోన్ నెంబర్ అప్డేట్ చేసే పద్ధతులు…

Telugu Mirror : ఆధార్ కార్డ్ ఇప్పుడు భారత దేశంలో నివసించే వారికి తప్పని సరిగా ఉండవలసినది.ఆధార్ లేకుంటే దేశంలో ఏ పనికైనా ఆటంకమే.ప్రజల యొక్క గుర్తింపు పత్రాలలో అతి ముఖ్యమైనది ఆధార్.ఇది 16-అంకెలు కలిగిన ప్రత్యేక గుర్తింపు కార్డ్ మరియు సంఖ్య.ఆధార్ కార్డ్ భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ (UIDAI)చేత మంజూరీ చేయబడినవి.అయితే మీరు మీయొక్క ఫోన్ నంబర్ ను ఈ మధ్య కాలంలో మార్చుకుని,కొత్త ఫోన్ నంబర్ తీసుకుని ఉంటే,మీ ఆధార్ కార్డ్ కు గతంలో లింక్ అయి ఉన్న పాత ఫోన్ నంబర్ స్థానం లో కొత్త నంబర్ ను అప్ డేట్ చేసినారా? ఒకవేళ మీరు కొత్త ఫోన్ నంబర్ ను అప్ డేట్ చేయకుండా ఉంటే, మీకు దగ్గరలో ఉన్న ఆధార్ సేవా కేంద్రాన్ని సంప్రదించడం ద్వారా కొత్త ఫోన్ నంబర్ ని ఆధార్ కార్డ్ కు లింక్ చేసుకోవచ్చు.
ఆధార్ కార్డ్ తో లింక్ అయిన ఫోన్ నంబర్ ను మార్చి కొత్త మొబైల్ నంబర్ ఎలా జోడించాలో? ఈ క్రింద సూచించిన దశలను అనుసరించి మార్చవచ్చు.

Smooth-Chapathi : చపాతీలు దూదిలా మెత్తగా, రుచిగా రావాలంటే ఈ టిప్స్ పాటించండి ..

•Step 1:UIDAI అధికారిక వెబ్ సైట్ (uidai.gov.in) ని తెరవండి అందులో “నమోదు కేంద్రాన్ని గుర్తించు” అనే దానిపై నొక్కండి.ఇప్పుడు మీకు దగ్గరలో ఫోన్ నంబర్ ను ఆధార్ తో అప్ డేట్ చేసే ఆధార్ ఎన్ రోల్ మెంట్ సెంటర్ ని గుర్తించడంలో మీకు సహాయ పడుతుంది.

•Step 2: ఆధార్ ఎన్ రోల్ మెంట్ కేంద్రం లోని ఆధార్ సహాయ ఎగ్జిక్యూటివ్ ని కలవండి.ఫోన్ నంబర్ నమోదు చేసే ప్రక్రియను మీకు నేరుగా వివరిస్తారు.

Aadhar mobile number update

 

•Step 3. మీరు ఆధార్ లో ఫోన్ నంబర్ ను అప్ డేట్ చేయడానికి దరఖాస్తు ను పూర్తి చేయవలసి ఉంటుంది.మీరు పూరించిన దరఖాస్తును ఒకటికి రెండు సార్లు సరి చూసుకోవడం మర్చిపోవద్దు.సరి చూడడం ద్వారా మీరు పూరించిన దరఖాస్తులో ఏవిధమైన తప్పులు లేవని నిర్ధారించుకోండి.

•Step 4: మీరు పూర్తి చేసిన దరఖాస్తును ఆధార్ కేంద్రం లోని హెల్ప్ ఎగ్జిక్యూటివ్ కి సమర్పించండి.మీ దరఖాస్తు లోని వివరాలు అన్నీ ఖచ్చితత్వం గా ఉన్నవి లేనిది వారు సమీక్ష చేస్తారు.మీరు తప్పకుండా మీ గుర్తింపు కార్డు,అడ్రస్ ప్రూఫ్,మీ ఆధార్ కార్డ్ ను అలానే అవసరమైన పత్రాలను మీ వెంట తీసుకు వెళ్ళండి.

Migraine Heading : మైగ్రేన్ సమస్యతో బాధపడుతున్నారా?

•Step 5: ఆధార్ కార్డ్ లో మీ ఫోన్ నంబర్ ని ఎంటర్ చేయడానికి మీరు రూ.50 చెల్లించ వలసి ఉంటుంది.

•Step 6: మీరు రూ.50 చెల్లించిన వెంటనే ఆధార్ సెంటర్ హెల్ప్ ఎగ్జిక్యూటివ్ మీకు అప్ డేట్ రిక్వెస్ట్ నంబర్ (URN) రశీదును ఇస్తాడు.మీకు ఇచ్చిన URN స్లిప్ ద్వారా మీరు మీ మొబైల్ నంబర్ అప్ డేట్ యొక్క స్థితిని తెలుసుకోవచ్చు.

•Step 7: మీరు మీ ఫోన్ నంబర్ అప్ డేట్ యొక్క ప్రోగ్రెస్ తెలుసుకోవడానికి UIDAI అధికారిక వెబ్ సైట్ myaadhar.uidai.gov.in ని తెరచి ‘Check Enrollment’ అనే విభాగంపై క్లిక్ చేసి URN నంబర్ ను అలాగే అక్కడ అడిగిన ఇతర వివరాలను నమోదు చేయండి.మీ మొబైల్ నంబర్ అప్ డేట్ యొక్క ప్రస్తుత స్థితిని స్క్రీన్ పై చూపెడుతుంది.

Leave A Reply

Your email address will not be published.