Telugu Mirror: గిన్నీస్ రికార్డ్ ను బ్రేక్ చేసిన ఢిల్లీ వాసి..

అందరూ గిన్నీస్ రికార్డ్ లను బ్రేక్ చెయ్యాలని అనుకుంటారు. అలానే ఢిల్లీకి చెందిన ఒక వ్యక్తి ఇలాంటి రికార్డ్ ను బ్రేక్ చేశాడు.

ఆ రికార్డ్ ఏంటో చూద్దాం..

ఢిల్లీకి చెందిన శశాంక్ మను కొత్త రికార్డ్ ను క్రియేట్ చేశాడు. ఢిల్లీలో మొత్తం 286 మెట్రో స్టేషన్ లు ఉన్నాయి. అయితే ఈ స్టేషన్ లన్నీటిని 15 గంటల 22 నిమిషాల 49 సెకండ్లలోనే చుట్టేశాడు. శశాంక్ మనూ కి ఈ ఆలోచన కరోనా లాక్ డౌన్ లో వచ్చింది. లాక్ డౌన్ తర్వాత మెట్రో సర్వీస్ లు మళ్ళీ అందుబాటులోకి వచ్చినప్పుడు అన్ని స్టేషన్ లను తిరగాలని అనుకున్నాడు. తనకు ప్రయాణించడం అంటే ఇష్టం కాబట్టి తనకు ఇలాంటి ఆలోచన వచ్చింది. అయితే 2021 ఆగస్ట్ లో ప్రఫుల్ సింగ్ అనే వ్యక్తి ఇలాంటి పనినే చేశాడు.

China Smart Phones : మరో కొత్త ఫోన్ విడుదల చేయబోతున్న చైనా..

ఢిల్లీలోని మొత్తం 286 మెట్రో స్టేషన్ లను 16 గంటల 2 నిమిషాల్లో తిరిగాడు. అదే సంవత్సరం శశాంక్ మను కూడా 286 మెట్రో స్టేషన్ లను 15 గంటల 22 నిమిషాల 49 సెకండ్లలోనే చుట్టేసాడు. కానీ అనుకోకుండా ఇతనికి ఆ గిన్నీస్ రికార్డ్ దక్కలేదు. అతను పొద్దున 5 గంటలకు తన ప్రయాణాన్ని బ్లూ లైన్ నుంచి మొదలుపెట్టాడు, ఈ రికార్డ్ ను బ్రేక్ చెయ్యడానికి అతను ‘ వన్ డే టూరిస్ట్ కార్డ్ ‘ ను తీసుకున్నాడు. గిన్నీస్ రికార్డ్ ను బ్రేక్ చెయ్యాలంటే ఆధారం కావాలి అందుకు శశాంక్ మను తన ప్రయాణాన్ని మొదలుపెట్టిన దగ్గర నుండి కెమెరాతో వీడియోను తీయడం మొదలుపెట్టాడు.

Indira Gandhi International Airport: ప్రయాణీకుల కోసం మరో సౌకర్యం..

తను ఆ కెమెరాను ఎక్కడ కూడా పాస్ చెయ్యలేదు. తను చేరిన ప్రతి స్టేషన్ దగ్గర ఫోటో దిగాడు అలా 286 స్టేషన్ లలో ఫోటో దిగాడు. ప్రతి స్టేషన్ దగ్గర అజ్ఞాత ప్రయాణికులతో తను ఆ స్టేషన్ కు వచ్చాడని రుజువుగా సంతకం పెట్టించుకున్నాడు. తన ప్రయాణం ఆ రోజు రాత్రి 8:30 కు బ్రిగేడియర్ హోషియర్ సింగ్ స్టేషన్ దగ్గర పూర్తి అయ్యింది. కానీ గిన్నీస్ వరల్డ్ రికార్డ్స్ వారు దీన్ని గుర్తించలేదు, ఆ రికార్డ్ ను ప్రఫుల్ సింగ్ కే లభించింది. కానీ శశాంక్ మను వీడియోను ఎక్కడ పాస్ చెయ్యకుండా, ఇతర ప్రయాణికుల సంతకాలను తను ఆ స్టేషన్ కి వచ్చినట్టు రుజువుగా తీసుకోవడం వల్ల తనకు ఇప్పుడు ఆ గిన్నీస్ రికార్డ్ దక్కింది.

Leave A Reply

Your email address will not be published.