One Plus Open : భారత్ లో OnePlus ఓపెన్..ప్రారంభానికి ముందే స్మార్ట్ ఫోన్ ధర లీక్..

Telugu Mirror : చైనీస్ కన్స్యూమర్ ఎలక్ట్రానిక్స్ తయారీదారు OnePlus కంపెనీ నుంచి OnePlus ఓపెన్ త్వరలో భారతదేశంలో ప్రారంభం అవుతుందని భావిస్తున్నారు. విడుదలకు సిద్ధంగా ఉన్న స్మార్ట్ ఫోన్ OnePlus Open స్మార్ట్ ఫోన్ OnePlus నుండి వస్తున్న మొదటి ఫోల్డబుల ఫోన్ అవుతుంది. ఫోల్డబుల్ స్మార్ట్‌ఫోన్ కి సంబంధించిన డిజైన్ వివరాలు మరియు స్పెసిఫికేషన్‌లపై రూమర్స్ బహిర్గతమయ్యాయి. భారతదేశంలో OnePlus Open స్మార్ట్‌ఫోన్ ధరపై ఇంటర్నెట్‌లో లీక్ అయినట్లుగా కనిపించాయి.

Tipster Yogesh Brar (@heyitsyogesh) ఇంటర్నెట్ లో లీక్ చేసిన ప్రకారం OnePlus Open ధర రూ.1,20,000 లోపు ఉంటుందని వెల్లడించారు. OnePlus Open ధర రూ.1,20,000 అనేది నిజమైతే, OnePlus Open ఫోల్డబుల్ స్మార్ట్‌ఫోన్ ధర మనదేశంలో Samsung Galaxy Z Fold5 స్మార్ట్ ఫోన్ కన్నా తక్కువలో లభిస్తుంది. Samsung Galaxy Z Fold 5 ప్రారంభ ధర భారత దేశంలోరూ.1,64,999 వద్ద కొనుగోలు దారులకు అందుబాటులోఉంది.

Vijay Sales: దుమ్ము రేపుతున్న విజయ్ సేల్స్.. Apple iPhone ల పై భారీ తగ్గింపు..

భారతదేశంలో OnePlus ఓపెన్ అంచనా ధర : 

ఇతర అన్ని స్మార్ట్ ఫోన్ బ్రాండ్ ల కన్నాOnePlus “ఈ సంవత్సరం అత్యంత బలమైన లైనప్” అని ఇండికేట్ చేస్తూ, Tipster Yogesh Brar, OnePlus Open స్మార్ట్ ఫోన్ భారతదేశంలో రూ.1,20,000 లోపు ఉంటుందని ఒక రూమర్(Rumor) ని ట్వీట్ (X) చేశారు.ఒక దానినుండి ఒకటి వేరుగా విభిన్నంగా ఉన్న స్మార్ట్ ఫోన్ లు OnePlus. టిప్ స్టర్(Tip Stur) యోగేష్ వీటి ధరలను కూడా ట్వీట్ లో జోడించాడు. Nord CE 3 Lite ధర రూ.20,000 లోపు, Nord CE 3 ధర రూ. 30,000 లోపు, OnePlus Nord 3 ₹40,000 లోపు మరియు OnePlus 11R ధర ₹ 50,000 లోపు భారత దేశం లో లభిస్తున్నాయి. ఇప్పుడు విడుదల చేయాలని చూస్తున్న OnePlus ఓపెన్ మొబైల్, భారతదేశంలో Oneplus కంపెనీ ద్వారా ఇప్పటి వరకు విడుదలైన ఫోన్ లు అన్నిటి కన్నా అత్యంత ఖరీదైన స్మార్ట్‌ఫోన్‌గా కనిపిస్తుంది.

Image Credit : English Jagran

OnePlus ఓపెన్ లాంచ్ తేదీ

ఆగస్టు 29న OnePlus ఓపెన్ ప్రపంచ వ్యాప్తంగా న్యూయార్క్‌(New York)లో లాంఛ్ కావలసి ఉంది. షెన్‌జెన్ హెడ్ క్వార్టర్ ఆధారిత మొబైల్ తయారీదారు OnePlus ఇప్పుడు ఫోన్ విడుదలను మరింత ఆలస్యం చేసింది. అయితే,గతంలో ట్విటర్‌(Twitter)గా పిలిచి, ప్రస్తుతం X గా మారిన సోషల్ నెట్వర్కింగ్ లో టిప్ స్టర్ మ్యాక్స్ జాంబోర్ ట్వీట్ ప్రకారం, OnePlus BOE ప్యానెల్‌లను ఉపయోగించాలని ఆలోచిస్తోందని అయితే కొన్ని ఒడిదుడుకుల కారణంగా, కంపెనీ ఇప్పుడు Samsung లో కలవాలని నిర్ణయించుకుంది, దీని వలన ఆలస్యానికి గురైనది. అయితే కొత్త విడుదల తేదీని OnePlus కంపెనీ ఇంకా అధికారికంగా ప్రకటించలేదు.

OnePlus ఓపెన్ ఊహించిన స్పెసిఫికేషన్లు

లీక్ అయిన రూమర్ లు నిజమైతే, OnePlus Open 7.8-అంగుళాల ప్రైమరీ డిస్‌ప్లే మరియు 6.3-అంగుళాల కవర్ డిస్‌ప్లేను కలిగి ఉంటుందని భావిస్తున్నారు. ఫోన్ యొక్క రెండు డిస్ ప్లేలు 120Hz రిఫ్రెష్(Refresh) రేట్‌ను కలిగి ఈ స్మార్ట్‌ఫోన్ స్నాప్‌డ్రాగన్ 8 Gen 2 చిప్‌సెట్ కలిగి ఉంటుంది. అలాగే 16GB RAM మరియు 512GB స్టోరేజ్‌తో వస్తుందని భావిస్తున్నారు.

Flip Kart Big Savings Day: ఫ్లిప్ కార్ట్ బిగ్ సేవింగ్స్ డే లో కిర్రాక్ డిస్కౌంట్ లలో Motorola స్మార్ట్ ఫోన్ లు

కెమెరా ఫ్రంట్ పార్ట్ లో, బాహ్య డిస్‌ప్లే, సెల్ఫీలు మరియు వీడియో కాల్‌ల కోసం, 20- మెగాపిక్సెల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరాను కలిగి ఉంటుంది అని లీక్(leak) లు సూచిస్తున్నాయి. ఇంటర్నల్ డిస్‌ప్లే పైన ఎడమ కార్నర్ లో 32-MP కెమెరాను కలిగి ఉంటుందని భావిస్తున్నారు.ఫోన్‌లో డ్యూయల్ రియర్ కెమెరా 50-మెగాపిక్సెల్ ప్రైమరీ సెన్సార్ అలాగే 48- MP అల్ట్రా -వైడ్ యాంగిల్ లెన్స్ తో వచ్చే అవకాశం ఉంది.OnePlus Open స్మార్ట్ ఫోన్ లో 4,800 mAh బ్యాటరీ అమర్చబడి 67W ఫాస్ట్ ఛార్జింగ్ కి మద్దతు ఇస్తుంది. ఈ ఫోన్ ఆండ్రాయిడ్ 14 ఆధారిత ఆక్సిజన్‌ ఓఎస్ 13.1పై నడుస్తుంది.

Leave A Reply

Your email address will not be published.