Protein Powder : సహజమైన పద్దతిలో ప్రోటీన్ పొడి తయారీ, ఇక పై శరీరానికి రెట్టింపు శక్తి

Telugu Mirror: ఆరోగ్యం మంచిగా ఉండటం కోసం ఏమైనా చేస్తాం. ఆరోగ్యం పట్ల జాగ్రత్త వహిస్తాం. మన ఆరోగ్యం పై మనం తీసుకునే ఆహార పదార్ధాలు ప్రధాన పాత్ర పోషిస్తుంది. శరీరానికి కావాల్సిన ప్రోటీన్స్ (Proteins) , విటమిన్స్ (Vitamins) తీసుకోవడం ఎంతో అవసరం. అయితే మార్కెట్ లో దొరికే ప్రోటీన్ పొడి మనం మసస్ఫూర్తిగా ఇష్టపడం. ప్రోటీన్ యొక్క ముఖ్య పాత్ర గురించి తెలుసుకుందాం. ఆ తర్వాత ప్రోటీన్ పొడిని సహజమైన పదార్ధాలతో సహజమైన పద్దతులతో ఇంట్లోనే ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం.

Natural Protein powder making process
Image credit: Digit Insurance

Also Read: Banana Lasi: మధురమైన బనానా లస్సిని తయారు చేసుకోండి ఇలా. ప్రయోజనాలు పొందండి అలా

ప్రోటీన్ యొక్క ప్రాధాన్యత ఏమిటి ? 

శరీరానికి పోషకాలు అవసరం. ప్రోటీన్స్ శరీరంలో ఉండే కణజాలం యొక్క “బిల్డింగ్ బ్లాక్” లో ఒకటి గా సూచిస్తారు. అయితే ఈ ప్రోటీన్ లు శరీరానికి ఇంధన వనరుగా, కండరాల మరమ్మతుకు, రోగనిరోధక శక్తిని పెంపొందించే విషయంలో మంచి పాత్ర పోషిస్తుందని చెప్పవచ్చు. హార్మోన్ (Hormone), ఎంజైములు (Enzymes) ఉత్పత్తి చేయడం లో మరియు జుట్టు, చర్మం, గోర్లను ఒక రీతిలో అమలుపరుస్తాయి. క్రీడాకారులు యోగ్యత పెంపొందించుకునేందుకు కండరాలు పెరుగుదలకు మరియు భారీగా వర్కౌట్స్ చేసి కోలుకునేందుకు ప్రోటీన్ ఎంతో సహాయపడుతుంది.

ప్రోటీన్ పొడి తాయారు చేసుకోవడం.. 

ప్రోటీన్ తయారు చేయడానికి ముందుగా ఎంచుకోవాల్సి ఏంటంటే ప్రోటీన్ రిచ్-బేస్.

కాయధాన్యాలు (Lentils ) : ప్రోటీన్ లు , ఫైబర్ పుష్కలంగా ఉండే ఈ చిక్కుళ్ళను గోధుమ వర్ణము వచ్చేదాకా వేయించి మెత్తగా రుబ్బుకొని పెట్టుకొండి.

చిక్పీస్ (chickpeas) : ముందుగా వీటిని రోస్ట్ చేసి ఆ తర్వాత మెత్తగా రుబ్బుకోవాలి. ఈ చిక్పీస్ ఒక అద్భుతమైన ఎంపిక అనే చెప్పొచువచ్చు.

బాదం (Badam) : బాదాం పప్పు ఆరోగ్యానికి మంచిది అని మన అందరికి తెలిసిన విషయమే. ప్రొటెయిన్లతో పాటు కొవ్వులతో కూడిన ఈ బాదాం లో బ్లాంచ్డ్ బాదంపప్పులను సున్నితమైన రూపం కోసం ఎంపిక చేసుకోండి.

గుమ్మడికాయ గింజలు (Pumpkin Seeds) : విలువగల ఖనిజాలతో కూడిన ఇంకా ప్రోటీన్స్ తో కూడిన ఈ పంప్కిన్ గింజలను దోరగా వీయించి తర్వాత మిక్సీ పట్టాలి.

ప్రోటీన్ పొడి లో కాస్త రుచుని పెంచేందుకు మరియు కంటెంట్ పెంచేందుకు ఈ పదార్ధాలను కూడా చేర్చుకోండి.

అవిసె గింజలు (Flax seeds) : అవిసెగింజల్లో ప్రధానంగా ఒమేగా-3 ఫ్యాటీ ఆసిడ్స్ మరియు పీచు పదార్థం ఎక్కువగా ఉండడం వల్ల మీ శరీరానికి బూస్టింగ్ ని అందించేందుకు తడ్పడుతుంది. కాబట్టి ఇది కూడా జోడించండి.

కోకో పౌడర్ (co co powder) : యాంటీ ఆక్సిడెంట్లను పెంపొందించడం లో సహాయపడుతుంది. మరియు రుచిని కూడా అందిస్తుంది.

దాల్చినచెక్క (Cinnamon) : ఇది ఘాటుగా ఉంటుంది కానీ అద్భుతమైన ప్రయోజనాలను అందజేస్తుంది. రుచికి వెచ్చదనాన్ని అందిస్తుంది.

సహజత్వం తో కూడిన రుచి ని మరియు తీపిని పొందాలంటే వీటిని కూడా జోడించండి.

వనిల్లా సారం, స్టెవియా మరియు ఎండిన పండ్లు : 

ఒక చెంచా వనిల్లా సారం ప్రోటీన్ పొడి లో కలపడం వల్ల మంచి సువాసనను, అద్భుతమైన రుచిని అందజేస్తుంది. స్టెవియా అనేది శరీరం లో చెక్కర స్థాయిని అదుపులో ఉంచుతూనే పౌడర్ కి తీపిని యాడ్ చేస్తుంది. ఎండిన పండ్లు మంచి తీపిని అందిస్తుంది దానితో పాటు మంచి పోషకవివిలను అందిస్తుంది.

మీ పదార్ధాలు అన్ని ఎంపిక చేసుకున్న తర్వాత మెత్తగా రుబ్బండి. ఆ ప్రోటీన్ పొడి ని ఎప్పుడు తాజాగా ఉండేందుకు చల్లని మరియు చీకటి ప్రదేశం లో గాలి వెళ్లని ప్రదేశంలో పెట్టేందుకు ప్రయత్నించండి.

Leave A Reply

Your email address will not be published.